
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా దీ పావళి సందర్భంగా అక్టోబరు 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘సెకండ్ గేర్ బాగుండు పో..’ పాటని శనివారం రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని సంజిత్, సాయి అభ్యంకర్ పాడారు. ‘‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. ‘సెకండ్ గేర్ బాగుండు పో..’ పాట మనసుని హత్తుకునే మెలోడీగా ఉంటుంది.
వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దీ పావళికి అద్భుతమైన మ్యూజిక్‌తో కూడిన కలర్‌ఫుల్ సినిమాని అందించడానికి మా ‘డ్యూడ్’ సిద్ధంగా ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకి సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: అనిల్ యెర్నేని, కెమెరా: నికేత్ బొమ్మి.