తెలుగులో ప్రాపర్ హారర్ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. కామెడీ హారర్ చిత్రాలు తరచు వస్తున్నాయి కానీ.. పూర్తిగా భయపెట్టే చిత్రాలేవి రావట్లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు ‘ఈషా’ వచ్చేస్తుంది. త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్‌కి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం రెండు సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఆత్మలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


