
‘‘డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది.
ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘డ్యూడ్’ దివాళి బిగ్ విన్నర్’’ అని ప్పారు. ‘‘జెన్ జి కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.