లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'డ్యూడ్'. దీపావళి సందర్భంగా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాంటిది ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఈ మేరకు డేట్ వైరల్ అవుతోంది.
'డ్యూడ్' చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో ఆర్య సినిమా పోలికలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. దర్శకుడు కూడా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ఈ కథకు ఆర్య-2 సినిమా స్పూర్తి అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ మూవీ.. నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని సమాచారం.
(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ)
విడుదలకు ముందు 'డ్యూడ్' ఓటీటీ హక్కుల డీల్ జరిగిపోయింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే ఈనెల 14 నుంచి సినిమాని స్ట్రీమింగ్ చేసే అవకాశముంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మిగతా దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చు.
'డ్యూడ్' విషయానికొస్తే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద(నేహాశెట్టి)ని ఇష్టపడతాడు. కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. మరోవైపు మేనమామ కూతురు కుందన (మమిత బైజు)కి చిన్నప్పటినుంచి గగన్ అంటే ఇష్టం. కానీ గగన్‌కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కుందన పెళ్లి ప్రపోజల్ తెచ్చినా రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధలో పార్ధు(హృదయ్)ని కుందన ఇష్టపడుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో కుందన, గగన్‌కి పెళ్లవుతుంది. కానీ ఆమె మనసులో పార్ధు ఉన్నాడని గగన్‌కి తెలుసు. దీంతో కుందన, ఆమె ప్రియుడిని కలిపే పనిలో ఉంటాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ)


