'అర్జున్ రెడ్డి'తో తెలుగులో హిట్ కొట్టి.. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్, యానిమల్ అంటూ హిందీలోనే మూవీస్ తీశాడు. ఇవి బ్లాక్ బస్టర్ హిట్ అయి వందల కోట్ల కలెక్షన్ తెచ్చుకున్నా సరే ఇతడిపై బాలీవుడ్ సెలబ్రిటీల కడుపు మంట చల్లారలేదని చెప్పొచ్చు. అవకాశం దొరికినా ప్రతిసారి ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. వాటికి సందీప్ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూనే ఉంటాడు.
గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'స్పిరిట్' మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ పేరు ముందు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్' అని సందీప్ ప్రస్తవించాడు. ఈ ట్యాగ్ వల్ల బాలీవుడ్ గల్లంతు అయిపోయింది. అటు సల్మాన్ ఇటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్.. మా హీరో సూపర్‌స్టార్ అంటే మా హీరో సూపర్‌స్టార్ తెగ ట్వీట్స్ పెట్టి హడావుడి చేశారు. మరోవైపు పలువురు పీఆర్స్ కూడా ప్రభాస్ కంటే సల్మాన్, షారుఖ్ తోపు అన్నట్లు రాసుకొచ్చారు.
(ఇదీ చదవండి: ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు)
ఇదంతా జరిగి వారంపైనే అయిపోయింది. తాజాగా ఈ ట్యాగ్ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి కారణం షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీ అనౌన్స్‌మెంట్. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం(నవంబరు 02) గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో.. 'సూపర్‌స్టార్ అనే ట్యాగ్ మించిన స్టార్స్ ఉంటే వాళ్లని కింగ్ అని పిలుస్తారు. హ్యాపీ బర్త్ డే ఇండియాస్ కింగ్' అని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రాసుకొచ్చాడు.
డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ట్వీట్ చూస్తే కచ్చితంగా సందీప్ రెడ్డి వంగా కౌంటర్ ఇవ్వడం కోసమే ఇలా పెట్టాడా అనే సందేహం వస్తుంది. చూస్తుంటే సందీప్ రేపిన రచ్చ బాలీవుడ్‌లో ఇప్పట్లో చల్లారేలా లేదుగా అనిపించడం గ్యారంటీ. రాబోయే రోజుల్లో ఈ ట్యాగ్ గోల ఎంతవరకు వెళ్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: వాట్సాప్‌లో మార్ఫ్‌డ్ వీడియోలు.. ఏడాదిపాటు డిప్రెషన్‌లో: విష్ణుప్రియ)
When stars go beyond being “just a superstar” they are called 👑
Happy Birthday INDIA’s KING pic.twitter.com/NZmChE3OIy— Siddharth Anand (@justSidAnand) November 2, 2025


