డేవిడ్‌ రెడ్డి గ్లింప్స్.. అదంతా కల్కి బుజ్జి టీమ్ వాళ్లే: మంచు మనోజ్ | Manchu Manoj Comments About His David Reddy Movie War Bike | Sakshi
Sakshi News home page

David Reddy Movie: మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి.. కల్కి బుజ్జి టీమ్ వాళ్లే..!

Dec 17 2025 9:59 PM | Updated on Dec 17 2025 10:02 PM

Manchu Manoj Comments About His David Reddy Movie War Bike

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న పీరియాడికల్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి   హనుమ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన మరియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్‌ చేశారు.  ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన మంచు మనోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ గ్లింప్స్‌లో కనిపించిన వార్‌ డాగ్ బైక్ గురించి మంచు మనోజ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ బైక్‌ను కల్కి టీమ్‌కు పనిచేసేవారే డిజైన్‌ చేశారని వెల్లడించారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొని తయారు చేశారని తెలిపారు. కల్కిలోని బుజ్జిని తయారు చేసిన టీమ్‌ ఈ వార్ ‍డాగ్‌ క్రియేట్‌ చేశారని పంచుకున్నారు. దీని బరువు దాదాపు 700 కేజీల వరకు ఉందని మంచు మనోజ్‌ అన్నారు. కాగా.. ఈ బైక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అతిథి పాత్ర పోషించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై కూడా మనోజ్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో అతిథి పాత్రలకు మంచి స్కోప్‌ ఉంది..కానీ మేము ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్ పెట్టారు మంచు మనోజ్.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement