టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మంచు మనోజ్ లుక్, వార్ డాగ్ బైక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నెేల కరిగింది' ..' ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై.. ఏ డేవిడ్ రెడ్డికా ఇండియా హై' అనే డైలాగ్స్ మంచు మనోజ్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఇవాళ విడుదలైన డేవిడ్ రెడ్డి టీజర్ గ్లింప్స్ చూస్తుంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో విజువల్స్, డైలాగ్స్, డేవిడ్ రెడ్డి బైక్ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. గ్లింప్స్ చూడగానే పీరియాడికల్ మూవీ అని చెప్పేయొచ్చు. తాజా గ్లింప్స్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
War Dog… Ready to Roar 🔥🔥🔥
Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025


