2025 రౌండప్.. ఓటీటీల్లో ఈ సినిమాలకు సూపర్ రెస్పాన్స్ | Telugu OTT Movies Got Huge Response This Year | Sakshi
Sakshi News home page

OTT Movies: ఓటీటీల్లో తెలుగు మూవీస్.. చాలామందికి నచ్చాయ్!

Dec 17 2025 4:55 PM | Updated on Dec 17 2025 5:19 PM

Telugu OTT Movies Got Huge Response This Year

2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఈ ఏడాది ఓటీటీల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని ఊహించినట్లుగానే అద్భుతమైన రెస్పాన్స్ అందుకోగా.. మరికొన్ని మాత్రం అనుహ్యంగా డిజిటల్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకున్నాయి. అలా బెస్ట్ అనిపించుకున్న చిత్రాలేంటి? ఇవి ఏయే ఓటీటీల్లో ఉన్నాయనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి థియేటర్లలో కళ్లు చెదిరే వసూళ్లు అందుకున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై విడుదల టైంలోనే విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అయినా సరే దీన్ని ఓటీటీలోనూ అదేస్థాయిలో చూశారు. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

సాధారణ ప్రేక్షకుల నుంచి దైవభక్తుల వరకు ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసిన మూవీ 'మహావతార్ నరసింహా'. ఇదో యానిమేటెడ్ మూవీ. కాబట్టి దీనికి బాషతో సంబంధం లేదు. విజువల్స్, మ్యూజిక్, స్టోరీ, సీన్స్.. ఇలా అన్నీ టాప్ నాచ్‌లో ఉంటాయి. తొలుత థియేటర్‌లో, ఆపై నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చాక కూడా సేమ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

పవన్ కల్యాణ్ నుంచి చాలారోజుల తర్వాత వచ్చిన స్ట్రెయిట్ సినిమా 'ఓజీ'. థియేటర్లలో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు సుజీత్‌కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రానికి సాధారణ ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది.

హీరో నాని నిర్మించిన చిన్న సినిమా 'కోర్ట్'. థియేటర్లలో రిలీజైనప్పుడే అద్భుతమైన హిట్ అయిన ఈ చిత్రం.. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి రెస్పాన్స్ అందుకుంది. మిగిలిన దక్షిణాది భాషల్లోనూ దీనికి ఓటీటీలో హిట్ టాక్ రావడం విశేషం.

శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'సింగిల్'. ప్రేమకథని కామెడీగా తీసిన విధానం, అందులో ట్రెండింగ్ మీమ్స్, వన్ లైనర్స్ లాంటివి ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడానికి కారణమయ్యాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

నవీన్ చంద్ర హీరోగా నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఎలెవన్'. థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి జనాలకు పెద్దగా తెలియలేదు గానీ ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం సర్‌ప్రైజ్ రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్ మూవీస్ లవర్స్‌కి ఇది నచ్చేసింది.

తెలుగులో ప్రేమకథలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా ఈ ఏడాది రిలీజైన సినిమా '8 వసంతాలు'. అనంతిక లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో రిలీజైనప్పుడు దీనికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ వినిపించింది. డైలాగ్స్, విజువల్స్ ఈ మూవీలో మెయిన్ హైలైట్. నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని చూడొచ్చు.

తేజా సజ్జా చేసిన మరో సూపర్ హీరో సినిమా 'మిరాయ్'. ఇందులో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీలో లాజిక్స్‌పై ట్రోల్స్ వచ్చినప్పటికీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ మంచి స్పందనే అందుకుంది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో ఉంది.

విలన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం హీరోగా చేస్తున్న తిరువీర్ నుంచి వచ్చిన లేటేస్ట్ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిన్న చిత్రం.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. స్వచ్ఛమైన హాస్యం, సిచ్యుయేషన్ కామెడీ ప్లస్ పాయింట్స్. ఇది జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement