Court - State Vs. A Nobody
-
మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్
చాలామంది హీరోలు సినిమాలు చేస్తుంటారు. కానీ ప్రేక్షకుల మనసులు గెలుచుకునేది మాత్రం కొందరే. ఇలా జరగాలంటే ఆడియెన్స్ పల్స్ తెలియాలి. ఈ విషయంలో మాత్రం నాని టాప్ లో ఉంటాడేమో! ఎందుకంటే వరసపెట్టి హిట్స్ కొడుతూనే ఉంటాడు.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్)తాజాగా నిర్మాతగానూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రెండు వారాల క్రితం 'కోర్ట్' సినిమాని రిలీజ్ చేయగా.. దీనికి అద్భుతమైన ఆదరణ వచ్చింది. కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ.. కంటెంట్ హిట్ అయింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. మరోవైపు ఓవర్సీస్ లోనూ మిలియన్ డాలర్ వసూళ్లు సొంతం చేసుకుంది.ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ అనేది చాలామంది హీరోలకు కల. స్టార్ హీరోలు దీన్ని ఇప్పటికే అందుకున్నారు కానీ మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం ఇది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. నాని మాత్రం హీరోగా ఇప్పటికే పలు చిత్రాలతో మిలియన్ డాలర్స్ సాధించగా.. ఇప్పుడు నిర్మాతగానూ 'కోర్ట్'తో ఆ ఘనత సొంతం చేసుకున్నాడు. స్టార్స్ లేకుండా తీసిన ఈ మూవీ మిలియన్ డాలర్ అందుకోవడం నానికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని) -
రికార్డ్ మార్క్ దాటేసిన 'కోర్ట్' కలెక్షన్స్
కొన్నిసార్లు అదృష్టం కలిసొచ్చి చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. రెండు మూడు రెట్ల లాభాలు గడించేస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'కోర్ట్' మూవీ సూపర్ హిట్ అయింది. నాని నిర్మించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఓ రికార్డ్ మార్క్ చేరుకుంది.(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)కేవలం రూ.9-10 కోట్లతో నిర్మించిన కోర్ట్ మూవీ.. రిలీజ్ కి ముందు ఓటీటీ డీల్ పూర్తయింది. అలా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రీమియర్ల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి వీకెండ్ లోనే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. 10 రోజుల్లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్ గా ప్రియదర్శి చేయగా.. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) -
గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
'కోర్ట్' బాక్సాఫీస్ కలెక్షన్.. ఐదురోజుల లెక్కలివే
కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు.. థియేటర్లలో ఆడిన సందర్భాలు తక్కువే. మన తెలుగులో ఈ జానర్ లో సినిమాలు రావడమే అరుదు. అలాంటిది ఓ మాదిరి అంచనాలతో రిలీజై సెన్సేషన్ సృష్టిస్తున్న మూవీ 'కోర్ట్'(Court Movie 2025). హీరో నాని నిర్మించిన ఈ చిత్రం ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించింది? బాక్సాఫీస్ లెక్కలు ఓసారి చూద్దాం.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)నాని (Actor Nani) నిర్మించాడని తప్పితే 'కోర్ట్' మూవీపై రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాల్లేవు. కానీ రెండు రోజుల ముందే పడిన ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రాగా.. తొలిరోజే రూ.8 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చింది. అది అలా అప్పటినుంచి స్టడీగా సాగుతూ వెళ్తుంది. ప్రస్తుతం ఐదు రోజుల్లో రూ.33.55 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఐదు రోజుల్లో, అది కూడా ఓ కోర్ట్ (Court Movie Collection) రూమ్ డ్రామా సినిమాకు ఈ రేంజు వసూళ్లు అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు మూడు రెట్లు లాభాలని నిర్మాతతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ 800k డాలర్స్ వసూళ్లు వచ్చాయి. అంటే త్వరలో మిలియన్ డాలర్ మార్క్ కొట్టేయడం గ్యారంటీ అనిపిస్తోంది. తెలుగులోనూ ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.50 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?) -
బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్‌ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం. ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ఓవర్సీస్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోర్ట్ విషయానికొస్తే.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్‌రూమ్ డ్రామా బాగా పండడం, ఎమోషనల్ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి. #CourtTelugu continues its dominance at the box office this week ❤🔥Collects a gross of 28.9+ CRORES WORLDWIDE in 4 days 💥💥Book your tickets for #Court now! ▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️ Presented by Natural Star @NameisNani Starring… pic.twitter.com/AiUSVO3RCD— Wall Poster Cinema (@walpostercinema) March 18, 2025 -
'కోర్ట్' మూవీ కలెక్షన్స్.. ఫస్ట్ డే కంటే మూడో రోజే ఎక్కువ
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించారు. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలిరోజే భారీ రెస్పాన్స్ రావడంతో ఎక్కడ చూసిన వీకెండ్లో హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి.కోర్టు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 24.40 కోట్లు రాబట్టింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.11 కోట్లతో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే, మొదటిరోజు రూ. 8.10 కోట్లు, రెండో రోజు రూ. 7.80 కోట్లు, మూడోరోజు రూ. 8.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. కోర్టు సినిమా ఫస్ట్‌డే నాడు ప్రీమియర్స్ షోలతో కలిపి వచ్చిన కలెక్షన్స్ కంటే మూడోరోజు ఎక్కువ రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మధ్య కాలం వచ్చిన సినిమాల్లో కోర్టు చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు ఈ చిత్రానికి వచ్చాయని అంచనా వేస్తున్నారు. కోర్టు సినిమా హీరో నానికి భారీ లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ లాంగ్ రన్లో రూ. 50 కోట్ల క్లబ్లో ఈ చిత్రం చేరవచ్చని అంచనా వేస్తున్నారు. -
ఆమెను చూస్తే మా అమ్మనే గుర్తుకొస్తుంది: హీరో నాని ఎమోషనల్
టాలీవుడ్ హీరో నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వర్డిక్ట్ పేరిట గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను మా అమ్మనే గుర్తుకు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.హీరో నాని మాట్లాడుతూ..'నా మోస్ట్ ఫేవరేట్ పర్సన్ ఇన్ సినిమా ఆమెనే. రోహిణి మేడంను చూడగానే మా అమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మను చూడగానే రోహిణి మేడం గుర్తొస్తుంది. ప్రతి సినిమా సెట్లో ఆమెను చూడగానే మా పని సులువుగా అయిపోతుందని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను మణిరత్నం గారికి గ్రేటేస్ట్ ఫ్యాన్‌ను. ఆయన చాలా సినిమాల్లో హీరోయిన్లకు రోహిణి మేడం డబ్బింగ్ చెప్పింది. అందుకే మాకు మొదటి నుంచి ఎక్కడో కనెక్షన్ ఉందినిపిస్తుంది. చాలా ఈవెంట్స్‌లో మేం ఇద్దరం చాలా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తాను' అంటూ నటి రోహిణిపై ప్రశంసలు కురిపించారు.కాగా.. తొలిరోజే కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు ఏకంగా రూ. 8.10 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అతని కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిరోజు బ్రేక్ఈవెన్కు దగ్గరలో కోర్టు కలెక్షన్లు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. రెండు రోజుల్లోనే రూ.15.90 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే రూ. 20 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని టాలీవుడ్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
'కోర్ట్' మూవీ కలెక్షన్స్.. రెండో రోజే లాభాల్లోకి
నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం రిలీజైన రెండు రోజే లాభాలు అందుకుంది. తొలిరోజేలానే రెండో రోజు కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)పోక్సో కేసు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'కోర్ట్' మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెగ్యులర్ కోర్ట్ డ్రామా అయినప్పటికీ ప్రస్తుతం థియేటర్లలో చూడదగ్గ మూవీస్ ఏం లేకపోవడం దీనికి కలిసొచ్చింది. అలా తొలిరోజు రూ.8.10 కోట్ల గ్రాస్ రాగా.. రెండో రోజుల్లో రూ.15.90 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.రూ.10 కోట్ల కంటే తక్కువ ఖర్చుతో తీసిన 'కోర్ట్' మూవీ ఓటీటీ రైట్స్, ఆడియో హక్కులు ఇదివరకే విక్రయించేశారు. మరోవైపు పెట్టుబడి కూడా రెండు రోజుల్లోనే తిరిగొచ్చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండో రోజుకే సినిమా లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతగా నాని నమ్మకం నిజమైంది. (ఇదీ చదవండి: 'కోర్ట్' మూవీ హీరోయిన్.. ఎవరీ 'జాబిలి'?) -
స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను: నాని
నాని(Nani) తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. నేను ఈ రోజుదాక స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెలుతున్న అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. బలగం హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్ గా దీప్తి అక్క, ప్రశాంతి గారు వచ్చారు. మేమంతా రాకెట్ లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. ఆయన నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.యాక్టర్ శివాజీ మాట్లాడుతూ... 25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై సినిమాలు చేస్తాను'అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ జగదీశ్, నటులు హర్షవర్దన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
'కోర్ట్' మూవీ హీరోయిన్.. ఎవరీ 'జాబిలి'?
ఈ వారం రెండు మూడు సినిమాలు రిలీజైతే.. వీటిలో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ విజేతగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే దిల్ రుబా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే చిత్రాలతో పాటు డిప్లమాట్ అనే హిందీ మూవీ వచ్చింది గానీ 'కోర్ట్'నే జనాలు ఇష్టపడ్డారు. అయితే ఈ సినిమాలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయి మాత్రం ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఇంతకీ ఎవరీ ఈమె? ఫ్యామిలీ డీటైల్స్ ఏంటి?పోక్సో కేసు బ్యాక్ స్టోరీతో తీసిన సీరియస్ సినిమా 'కోర్ట్'. ఇందులో చందు-జాబిలి పాత్రల్లో హర్ష రోషన్, శ్రీదేవి నటించారు. మూవీలో నటించిన ప్రియదర్శి, శివాజీ, రోహిణి.. ఇలా అందరూ చాలా చిత్రాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్లెవరో తెలుసు. కానీ జాబిలి పాత్ర చేసిన శ్రీదేవి ఎవరా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల)శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. తెలుగమ్మాయి అందున పాత్ర డిమాండ్ చేసిననట్లు టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకునేలా నటించింది శ్రీదేవి. అది సంగతి. ఇకపోతే 'కోర్ట్' మూవీకి తొలిరోజే రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మూవీకి అయిన బడ్జెట్ తక్కువే. అలానే ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ రూపంలో ఇప్పటికే లాభాలు వచ్చేశాయి. ఇప్పుడు వసూళ్లు చూస్తుంటే నాని పంట పండినట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా!) View this post on Instagram A post shared by YouWe Media (@youwemedia) -
కోర్ట్, దిల్రూబా సినిమాలు వచ్చేవి ఆ ఓటీటీలోనే!
హోలి పండగ (మార్చి 14) రోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అదే కోర్ట్ (Court: State Vs a Nobody), దిల్రూబా (Dilruba Movie). కోర్ట్ చిత్రంలో రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ ఓటీటీ పార్ట్నర్ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ కోర్ట్ మూవీపై బలమైన నమ్మకం వ్యక్తపరిచాడు నాని. అతడి నమ్మకమే నిజమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.(కోర్ట్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)దిల్రూబా ఓటీటీ పార్ట్నర్క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దిల్రూబా. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ రన్‌ను బట్టి నెల రోజుల్లోనే దిల్రూబా ఆహాలోకి వచ్చే అవకాశం ఉంది.(దిల్రూబా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాని కాన్ఫిడెన్స్.. పేరు మార్చుకుంటానన్న రాజేంద్రప్రసాద్.. అదే కారణమన్న కిరణ్
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.సీన్ 2: దిల్రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.కిరణ్ రియాక్షన్ ఇదే!అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్ -
నాని సవాల్.. నా సినిమా సేఫ్ అంటూ డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
‘కోర్ట్’(Court: Sate Vs A Nobody) సినిమా నచ్చకపోతే తను హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’(Hit 3) చూడొద్దని నాని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్3 దర్శకుడు శైలేశ్ కొలను స్పందిస్తూ నా సినిమా సేఫ్ అంటూ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి బుధవారం కొన్ని చోట్ల ప్రీమియర్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ శైలేశ్ కొలను కూడా ఈ సినిమా వీక్షించాడు. అనంతరం ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. తన హిట్ 3 సినిమా సేఫ్ అంటూ పోస్ట్ చేశాడు.‘నా సినిమా సేఫ్ (హిట్ 3). ‘కోర్ట్’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్ సినిమా చూడండి’’ అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్ పోస్టర్‌ను జోడించారు. మిర్చిలో ప్రభాస్ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్ కొలను పంచుకున్నారు. ‘హిట్ 3’ సినిమా విషయానికొస్తే.. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Naaa cinema safe !!!! #CourtStateVsANobody is an emotionally riveting movie that is absolutely necessary for everyone cos there is so much to take back home. So proud to be associated with @walpostercinema @tprashantii and my man @NameisNani. One more feather in… pic.twitter.com/e13JAGLEJa— Sailesh Kolanu (@KolanuSailesh) March 12, 2025 -
సినిమా చూడొద్దన్న నాని.. నేడే రిజల్ట్!
ఈ మధ్య సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్లా సవాళ్లు విసురుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తమ కథపై వారికి ఉన్న నమ్మకమే అలా మాట్లాడిస్తుంది. అయితే అన్ని సందర్భాలో వారి నమ్మకం ఫలించదు. కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి.మరికొన్ని సార్లు అంచనా వేయలేని విజయాన్ని అందిస్తాయి. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం మేకర్స్ అంతా తమది గొప్ప కళాఖండమే అని చెప్పుకోవడంలో తప్పులేదు. చివరికి ఆ సినిమా హిట్టా? ఫట్టా అనేది డిసైడ్ చేసేది ఆడియన్ మాత్రమే. ఈ విషయం మేకర్స్‌కి కూడా తెలుసు కానీ ఆడియన్‌ని థియేటర్‌కి రప్పించేందుకు ఇలాంటి ‘సవాళ్ల’ని ఎదుర్కొవాల్సిందే. తాజాగా హీరో నాని(Nani) ప్రేక్షకులకు విసిరిన సవాల్ నెట్టింట బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘కోర్ట్’(Court ) సినిమా నచ్చకపోతే ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాని చూడకండి అని ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇక కోర్ట్ సినిమాని రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడయాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. నాని ఊహించినట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనేది నేటి సాయంత్రంతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నారు.(చదవండి: నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ ఎలా ఉందంటే?)ఇక నాని ‘కోర్ట్’కి పోటీగా బరిలోకి దిగాడు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ‘దిల్రూబా’(Dilruba ) మూవీ కూడా మార్చి 14నే విడుదల కానుంది. ఈ సినిమాపై కిరణ్ కంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ రవినే నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని సవాల్ విసిరాడు. ఈయన కామెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కోర్ట్‌తో పాటు దిల్రూబాకి కూడా పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఈ మూవీ రిజల్ట్ వచ్చేస్తుంది. సవాళ్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా? లేదా? చూడాలి. -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్