నాని సవాల్‌.. నా సినిమా సేఫ్‌ అంటూ డైరెక్టర్‌ ఆసక్తికర పోస్ట్‌! | Hit 3 Director Sailesh Kolanu Respond On Nani Statement About Court Movie | Sakshi
Sakshi News home page

నాని సవాల్‌.. నా సినిమా సేఫ్‌ అంటూ డైరెక్టర్‌ ఆసక్తికర పోస్ట్‌!

Published Thu, Mar 13 2025 3:12 PM | Last Updated on Thu, Mar 13 2025 3:34 PM

Hit 3 Director Sailesh Kolanu Respond On Nani Statement About Court Movie

‘కోర్ట్‌’(Court: Sate Vs A Nobody) సినిమా నచ్చకపోతే తను హీరోగా నటిస్తున్న ‘హిట్‌ 3’(Hit 3) చూడొద్దని నాని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్‌3 దర్శకుడు శైలేశ్‌ కొలను స్పందిస్తూ నా సినిమా సేఫ్‌ అంటూ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్‌’. మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి బుధవారం కొన్ని చోట్ల ప్రీమియర్‌ ప్రదర్శించగా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. డైరెక్టర్‌ శైలేశ్‌ కొలను కూడా ఈ సినిమా వీక్షించాడు. అనంతరం ఈ సినిమా గురించి ట్వీట్‌ చేస్తూ.. తన హిట్‌ 3 సినిమా సేఫ్‌ అంటూ పోస్ట్‌ చేశాడు.

‘నా సినిమా సేఫ్‌ (హిట్‌ 3). ‘కోర్ట్‌’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్‌ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్‌ సినిమా చూడండి’’ అని పోస్ట్‌ పెట్టారు. 

ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను జోడించారు. మిర్చిలో ప్రభాస్‌ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్‌ కొలను పంచుకున్నారు. ‘హిట్‌ 3’ సినిమా విషయానికొస్తే.. శైలేశ్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement