
ఈ ఏడాది తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ ఒకటి. మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. హిట్ టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా అందుకుంది. ఈ చిత్రంతో వైజాగ్ కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూవీ వచ్చిన ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.
(ఇదీ చదవండి: సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం)
దర్శకుడు రామ్ జగదీశ్ పెళ్లి వైజాగ్‌లో ఆదివారం రాత్రి జరిగింది. కార్తీక అనే అమ్మాయిని వివాహమాడాడు. ఈ వేడుకకు 'కోర్ట్' మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రామ్ జగదీశ్ పెళ్లి.. పెద్దల కుదిర్చినట్లు తెలుస్తోంది. కార్తీక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతానికైతే ఆమె పేరు మాత్రమే బయటకొచ్చింది. ఇకపోతే రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాని కూడా నాని నిర్మాణంలో తీయబోతున్నాడనే టాక్ కొన్నిరోజుల క్రితం వచ్చింది. ఈసారి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)


