
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఘనంగా ఆయన ఎంగేజ్‌మెంట్ జరిగింది. రాహుల్‌కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. కానీ, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆగష్టు 17న తన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో వారి నిశ్చితార్థం జరిగింది. అయితే, అధికారికంగా వారు ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదు. కానీ, షోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టింది. దీంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ క్రమంలో 2023లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్‌కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. కాంగ్రెస్ అధికారకంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. తెలంగాణ నేపథ్యంతో పాటు పలు ర్యాప్ సాంగ్స్ పాడి ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు.