'కోర్ట్' సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి.. తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం 'కోర్ట్'లో తనకు జంటగా నటించిన రోషన్‌తోనే ప్రస్తుతం 'బ్యాండ్ మేళం' అనే మూవీ చేస్తోంది. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ ప్రేమకథ. ఇప్పుడు తమిళంలోనూ చేస్తున్న సినిమా కూడా లవ్ స్టోరీనే. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)
శ్రీదేవి హీరోయిన్‌గా చేస్తున్న తమిళ సినిమాకు 'హైకూ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళ నటుడు ఏగన్ హీరో. తెలుగు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నాడు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్ బట్టి ఇదో యూత్‌ఫుల్ కాలేజీ లవ్ స్టోరీ అనిపిస్తుంది. 'కోర్ట్'తో మెప్పించిన శ్రీదేవి, విజయ్ బుల్గానిన్.. మరి తమిళంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి?
(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' రవికి జాబ్ ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన డీసీపీ)


