
ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల్లో 'కోర్ట్' ఒకటి. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం శ్రీదేవి అనే అమ్మాయి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఈమెకు పెళ్లయిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్)
శ్రీదేవి.. రీసెంట్‌గానే రాఖీ పండగని సెలబ్రేట్ చేసుకుంది. తన సోదరుడి చేతికి రాఖీ కట్టింది. ఆ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు ఈ వీడియో చూసి ఊరుకోకుండా.. ఈమె మెడలో పసుపు తాడు ఉందేంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏంటి ఈమెకు పెళ్లయిపోయిందా? ఇదెప్పుడు జరిగిందా? అని చాలా డిస్కషన్ నడుస్తోంది. అయితే అసలు సంగతి ఇది కాదు.
రాఖీ పండగ శనివారం కాగా.. అంతకు ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారం సందడి కనిపించింది. అలా శ్రీదేవి ఇంట్లో కూడా వరలక్ష‍్మి వ్రతం చేసుకున్నారు. ఈ పూజ తర్వాత పసుపు తాడుకి కట్టిన కాసు(కాయిన్) మెడలో వేసుకుంది. అయితే దీన్ని తాళిబొట్టుగా పొరబడిన నెటిజన్లు.. పెళ్లయిపోయిందా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది అసలు సంగతి!
(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ)