
అనుపమ పరమేశ్వరన్ పేరు చెప్పగానే హోమ్లీ హీరోయిన్ అనే తరహా పాత్రలే గుర్తొస్తాయి. దాదాపు అలాంటి రోల్స్ చేస్తూ వచ్చింది. కానీ గతేడాది రిలీజైన 'టిల్లు స్క్వేర్' మాత్రం అనుపమలో కొత్త యాంగిల్‌ని అందరికీ పరిచయం చేసింది. ఎందుకంటే ఆ సినిమా స్కర్ట్స్ వేసుకుని, లిప్ కిస్ సన్నివేశాల్లో కనిపించేసరికి అభిమానులు షాకయ్యారు. అనుపమ ఇలాంటి పాత్ర చేయడం ఏంటని కూడా అనుకున్నారు. ఇప్పుడు వాటన్నింటికీ స్వయంగా ఆమె సమాధానమిచ్చింది.
అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. మొన్ననే ట్రైలర్ లాంచ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అలా ఒకదానిలో మాట్లాడుతూ.. 'టిల్లు స్క్వేర్' చేస్తున్న సమయంలో తాను కంఫర్ట్‌గా లేననే విషయాన్ని బయటపెట్టింది. చాన్నాళ్ల పాటు ఆలోచించిన తర్వాతే సినిమా చేసిన సంగతి కూడా చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. 'కూలీ, 'వార్ 2'తో తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)
'నా అభిమానులకు ఆ పాత్ర నచ్చలేదని కాదు నేను అలాంటి రోల్ చేయడం నచ్చలేదు. దానికి తప్పు అని చెప్పలేను. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్.. నేను ఒప్పుకోవడానికి కూడా చాలా టైమ్ పట్టింది. చెయ్యాలా వద్దా అని చాలా సమయం తీసుకుని.. ఓ రకంగా చెప్పాలంటే నిర్ణయం తీసుకోవడం నాకు చాలా కష్టమైంది. సెట్‌కి వెళ్లి 100 శాతం కాన్ఫిడెంట్‌గా చేసిన సినిమా కూడా కాదు అది. సినిమాలో గానీ ప్రమోషన్లలో గానీ ఆ డ్రస్సులు వేసుకోవడం నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. వేర్వేరు మూవీస్‌లో చేసినట్లే ఇది ఓ ఛాలెంజ్‌లా అనిపించింది'
'ఈ క్యారెక్టర్ చేస్తే ఏమనుకుంటారోనని చాలా సందేహాలు ఉండేవి. కాకపోతే ఆ పాత్ర చాలా బలమైనది అని భావించాను. సినిమా రిలీజయ్యాక కూడా హీరోకి సమానంగా ఉందని అంతా అన్నారు. అందుకే నేను ఆ పాత్ర వదలుకోదల్చుకోలేదు. అలాంటి పాత్ర చేద్దామని ఫిక్స్ అయితే విమర్శల్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించాను అదే జరిగింది కూడా' అని అనుపమ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!)