శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..! | Sabarimala earnings hit Rs 332 crore this season | Sakshi
Sakshi News home page

శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!

Dec 28 2025 3:23 PM | Updated on Dec 28 2025 3:28 PM

Sabarimala earnings hit Rs 332 crore this season

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిసింది. ఈ ఒక్కరోజే సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్‌ వెల్లడించారు. 

మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు. 

కాగా, శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం అనంతరం గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకోనుంది.

(చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement