స్టార్‌ హీరో కూతురిపై ట్రోలింగ్‌.. 'నా బాడీ గురించి మీకెందుకు?' | Kiccha Sudeep Daughter Saanvi Angry on Trolls over Body Shaming | Sakshi
Sakshi News home page

నా శరీరం గురించి మీకెందుకు? ట్రోలర్స్‌కు హీరో కూతురి కౌంటర్‌

Dec 29 2025 11:31 AM | Updated on Dec 29 2025 11:58 AM

Kiccha Sudeep Daughter Saanvi Angry on Trolls over Body Shaming

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ కూతురు శాన్వి సుదీప్‌ సింగర్‌గా ఆకట్టుకుంటోంది. ఈమె తెలుగులో హిట్‌ 3 మూవీలో పోరాటమే 3.0 సాంగ్‌ పాడింది. ఇటీవల తన తండ్రి హీరోగా నటించిన మార్క్‌ మూవీలోనూ మస్త్‌ మలైకా సాంగ్‌ ఆలపించింది. ఈ పాటతోనే కన్నడ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. ఇకపోతే మస్త్‌ మలైకా సాంగ్‌ వైరల్‌గా మారగా కొందరు నెటిజన్లు శాన్వీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

హీరో కూతురిపై ట్రోలింగ్‌
కొన్ని పదాలు తను సరిగా పలకలేదంటున్నారు. అక్కడితో ఆగకుండా ఆమెను బాడీ షేమింగ్‌ చేస్తూ తిడుతున్నారు. ఈ ట్రోలింగ్‌పై శాన్వి సుదీప్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. నేను మీ అభిప్రాయాలు అడిగానా? లేదు కదా.. నేను అడిగినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి.. అంతే కానీ ఇక్కడ నా శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని మండిపడింది.

ప్రేమ వివాహం
మార్క్‌ సక్సెస్‌ ఈవెంట్‌లోనూ కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ.. శాన్వి చాలా స్ట్రాంగ్‌. ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్‌ చేయగలదు. ఇండస్ట్రీలో విమర్శలనేవి సాధారణం. వాటిని తను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలదు. ఆ నెగెటివిటీకి పదిరెట్లు ఎక్కువ ధృడంగా నిలబడగలదు అని చెప్పుకొచ్చాడు. కిచ్చా సుదీప్‌.. కేరళకు చెందిన ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2004లో కూతురు శాన్వి జన్మించింది. 2015లో దంపతులు విడిపోగా.. తర్వాత కొంతకాలానికి విడాకుల ఆలోచన మానుకుని మళ్లీ జంటగా కలిసిపోయారు.

చదవండి: ఎన్నాళ్లయిందో.. నా లైఫ్‌లో మర్చిపోలేని జ్ఞాపకం: తనూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement