breaking news
Saanvi
-
నాకు సూపర్ పవర్స్ వస్తే..!
బుల్లితెరపై ‘మల్లి’ సీరియల్‌తో, వెండితెరపై ‘రాబిన్ హుడ్’ సినిమాతో పాపులర్ అయింది బేబీ శాన్వీ పటేల్. ‘రాబిన్ హుడ్’ సెట్లో హీరోయిన్ శ్రీలీల చేసిన సర్ప్రైజ్ గురించి, తనకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తుందో... ఇలా బోలెడన్ని కబుర్లు పంచుకుంది శాన్వీ.ప్రస్తుతం నేను ఐదో క్లాస్ చదువుతున్నాను. హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్‌తో పాటు సింగింగ్, డ్రాయింగ్ కూడా వచ్చు. కూచిపూడి డ్యాడ్స్ నేర్చుకుంటున్నాను. అలాగే చదువుపై కూడా శ్రద్ధ ఉంది. స్టడీస్ విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఒకవైపు చదువుకుంటూనే మరో వైపు సినిమాలు చేయడం నాకేం ఇబ్బంది లేదు. మా అమ్మ సహాయంతో బ్యాలెడ్స్ చేసుకుంటున్నాను. సింగింగ్, డ్రాయింగ్లలో నాకు స్కిల్స్ ఉన్నప్పటికీ యాక్టింగ్ అంటేనే ఇష్టం. భవిష్యత్‌లోనూ యాక్టింగ్‌ని కంటిన్యూ చేస్తూనే స్టడీస్‌ని పూర్తి చేస్తాను.జవహర్లాల్ నెహ్రూగారి జయంతిని మనం చిల్డ్రడ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని నాకు తెలుసు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. టీచర్స్ డే, చిల్డ్రడ్స్ డేలను మా స్కూల్లో బాగా సెలబ్రేట్ చేస్తారు. మా క్లాస్‌లో ఉన్న బెంచ్లన్నింటినీ తీసేసి, మా టీచర్ గైడెడ్స్తో అక్కడ కేక్ కట్ చేస్తాం. అలాగే అక్కడ కొన్ని సాంగ్స్‌కు సింగిల్‌గా, గ్రూప్‌గా డ్యాడ్స్ కూడా చేస్తాం. బర్త్ డేలను మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలా చిల్డ్రడ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఏడాది చిల్డ్రడ్స్ డేకి డ్యాన్సింగ్, సింగింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను. మా స్కూల్లో టీచర్స్ అందరూ నాకు ఇష్టమే. ముఖ్యంగా నాకు మా తెలుగు టీచర్ లావణ్య మేడమ్, సైడ్స్ టీచర్ నవ్య మేడమ్ అంటే చాలా ఇష్టం.నేను యాక్ట్ చేసిన ‘కలివి వనం’ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. అడవులను రక్షించుకోవాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు దర్శకుడు రాజ్ నరేంద్ర. ఇందులో నాగదుర్గ మేడమ్‌తో కలిసి నటించాను. నాతో పాటుగా మరో నలుగురు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సెట్స్‌లో మేం అందరం చాలా సరదాగా ఉండేవాళ్లం. మనమందరం అడవులను కాపాడుకోవాలి. సేవ్ ఫారెస్ట్స్... సేవ్ లైఫ్స్. నేను రెండు మొక్కలు నాటాను. ప్రతిరోజూ వాటికి నీళ్లు పోస్తాను. ఈ మొక్కల సంరక్షణను నేనే చూసుకుంటాను.తెలుగు హీరోస్లో ప్రభాస్, అల్లు అర్జున్ గార్లు అంటే ఇష్టం. హీరో యిన్స్లో శ్రీలీల, నాగదుర్గ మేడమ్స్ ఇష్టం. శ్రీలీలగారు హీరోయిన్ గా చేసిన ‘రాబిన్ హుడ్’లో నేను యాక్ట్ చేశాను. త్రీ డేస్ ముందు నా బర్త్ డే గురించి చె΄్పాను. నా ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలిపించి, సర్ప్రైజ్గా నా బర్త్ డేని సెలబ్రేట్ చేశారు శ్రీలీల మేడమ్. నేను సూపర్ హీరో సినిమాలూ చూస్తుంటాను. నాకు సూపర్ పవర్స్ వస్తే... సినిమాల్లో హీరోలు చేసినట్లుగా నేనూ మంచి పనులకే ఆ పవర్స్‌ని వాడతాను. నా ఫేవరెట్ కలర్ సిక్స్. సో... నాకు సిక్స్ కలర్స్ అంటే ఇష్టం. పింక్, పర్పుల్, బ్లాక్, మెరూన్, గ్రే వంటివి ఇష్టం.ఇప్పుడు ఇంద్రజ మేడమ్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను. ఆమె కూతురు పాత్రలో నటిస్తున్నాను. ‘మల్లి’ సీరియల్లో మల్లిక క్యారెక్టర్ చేశాను. నేను నటించిన మరికొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. పిల్లల గురించి వచ్చే సినిమాలు, సందేశం ఇచ్చే సినిమాలంటే నాకు ఇష్టం. ఫైటింగ్ సినిమాలన్నా కూడా ఇష్టమే.– ముసిమి శివాంజనేయులు – -
శాన్వీ ఆత్మకు శాంతి!
చిన్నారితోపాటు నానమ్మ హత్యకేసు తీర్పుపై స్వగ్రామంలో హర్షం రఘునందన్‌కు ఉరి ‘అకలిగొన్నవారి మొఖం చూడలేకపోయేది సత్యవతి. గ్రామంలో ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసేది. మా గ్రామంలో అలాంటివారు ఇంకా పుట్టరు కూడా. బంగారం లాంటి కాపురం.. సత్యవతి మృతితోనే నాశనం అయింది. చిట్టిపొట్టి చిన్నారి శాన్విని కూడా పొట్టనపెట్టుకున్నాడు. అందుకే ఆ రఘు ఇప్పుడు శిక్ష అనుభవించాడు’ ఈ మాటలు ఇప్పుడు కుడుములకుంటలో వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా : శాన్వి ఆత్మకు శాంతి లభించింది.. ఆమె నాన్నమ్మకు కూడా! అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని.. నేరస్తులు తప్పించుకోలేరని హంతకుడు రఘునందన్‌కు విధించిన మరణశిక్షతో తేలింది. అమెరికాలో 2012లో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ వెన్న సత్యవతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సత్యవతి స్వగ్రామం అయిన హనుమంతునిపాడు మండలం కుడుముల కుంట వాస్తవ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నాభిన్నం అయిన కుటుంబం.. సత్యవతి భర్త వెన్నా కొండారెడ్డి చాలా కాలం గ్రామంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడంలేదు. వచ్చిన రోజు అన్నం వండుకొని.. కూరలను కనిగిరి నుంచి తెచ్చుకుని మళ్లీ కనపడకుండా వెళ్లిపోతారు. ఇద్దరు కుమారులు అమెరికా లోనే ఉన్నారు. కుమార్తె సుజాత గుంటూరులో ఉంటోంది. సత్యవతి లోకం విడిచాక ఇక్కడి ఇంటిలో దీపం వెలిగించేవారు లేకుండా పోయారు. ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. అందరి తలలో నాల్కలా ఉన్న సత్యవతి మరణాన్ని గ్రామస్తులు ఇప్పటికీ మరచిపోలేదు. వారి నిమ్మ తోటలు, ఆస్తిపాస్తులు అన్నీ నాశనం అయ్యాయి. నిందితునికి సరైన శిక్ష పడిందని అంతా అంటున్నారు. సత్యవతి ఇంటిలో దీపం పెట్టేవారే లేరు: చిన్నారి శాన్విని చూసుకోనేందుకు కుమారుడు ప్రసాదు రెడ్డి వద్దకు సత్యవతి వెళ్లింది. ఫోను చేసి గ్రామంలో అందరి కష్ట సుఖాలను తెలుసుకొనేది. ఆమె మరణంతో ఇంటిలో దీపం వెలిగించే వారు లేకుండా పోయారు. కొండారెడ్డి..కుమారులు, కుమార్తె వద్ద కాలం కడుపుతున్నాడు. – సానికొమ్ము వెంకటసుబ్బమ్మ ఎప్పుడో ఉరి శిక్ష వేసి ఉండాల్సింది: డబ్బుకు ఆశపడి చిన్నారి శాన్విని, నానామ్మ వెన్నా సత్యవతిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకుడు రఘునందన్‌కు వెంటనే ఉరివేసి ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మరణ శిక్షను విధించి మంచి పని చేసింది. – వీరాచారి -
నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత
అమెంటే నాకు ప్రత్యేకం... ఆమెకే నా మొదటి ప్రాధాన్యం ... ఆమెను విపరీతంగా ప్రేమిస్తాను ... అని 11 ఏళ్ల తన గారాల పట్టి, కుమార్తె శాన్వీ గురించి ప్రముఖ నటుడు సుదీప్ తెలిపారు. ప్రియా, తనకు విడాకులు తీసుకున్నా శాన్వీతో తన అనుబంధంలో మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సుదీప్, కేరళకు చెందిన ప్రియా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్. సుదీప్ చిత్రాల్లో నటిస్తుంటే ... ప్రియా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమలోపడ్డారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రియను సుదీప్ వివాహం చేసుకున్నాడు. 2004లో వీరికి శాన్వీ జన్మించింది. మొదట్లో సుదీప్ ఇబ్బందులు పడ్డా... ఆ తర్వాత పుంజుకున్నారు. ఇటీవల వరుస సినిమాల ఆఫర్లు వస్తుండటంతో సుదీప్ తెగ బిజీ అయ్యారు. అయితే 2009 - 10లో సుదీప్‌పై వుకార్లు వెల్లువెత్తాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రియా కుమార్తె శాన్వీతో కలసి బెంగుళూరులోని జేపీ నగర్లో సర్జాపుర్ రహదారి సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సుదీప్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ ప్రియా ఈ ఏడాది ఆగస్టులో కోర్టును ఆశ్రయించింది. ఇద్దరి అంగీకారంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. శాన్వీ మైనర్ కాబట్టి ఆమె బాధ్యతులు తల్లి ప్రియా చూసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే విడాకులు నేపథ్యంలో ప్రియకు రూ. 19 కోట్ల రూపాయిలు భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ ఒప్పుకున్నాడని సమాచారం. భరణంపై సుదీప్‌ను విలేకర్లు ప్రశ్నించారు. నేను చేస్తున్నదంతా నా కుమార్తె... నా భార్య కోసమే కాదా అని సింపుల్‌గా సుదీప్ చెప్పేశాడు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రం ద్వారా సుదీప్ దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న విషయం విదితమే.


