ఈ ఏడాది హెల్త్‌కేర్‌ ట్రెండ్స్‌ ఇవి..! | The biggest trends in healthcare 2025 Major Challenges | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది హెల్త్‌కేర్‌ ట్రెండ్స్‌ ఇవి..! సంతరించుకున్న మార్పులివే..!

Dec 28 2025 3:40 PM | Updated on Dec 28 2025 3:54 PM

The biggest trends in healthcare 2025 Major Challenges

వైద్యరంగంలో ఏడాదికేడాదీ చాలా అభివృద్ధులను నమోదు చేస్తోంది. కొత్త కొత్త సాంకేతిక పరిణామాలను, సరికొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించుకుంటోంది. కొన్ని పరిణామాలైతే మొత్తం హెల్త్‌ కేర్‌ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక జబ్బుకు అందరికీ ఒకే రకరమైన స్టాండర్డ్‌ చికిత్స నుంచి... మెల్లగా ఆయా వ్యక్తుల తాలూకు జన్యుస్వభావాలను బట్టి వ్యక్తిగతమైన (పర్సనలైజ్‌డ్‌) చికిత్స వరకు ఇలా రకరకాల మార్పులను నమోదు చేసుకుంటోంది. కొద్దిరోజుల్లోనే 2025 వెళ్లిపోయి... మనమంతా 2026లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హెల్త్‌ కేర్‌ రంగంలో నమోదైన కొన్ని మార్పులను పరిశీలిద్దాం...

పర్సనల్‌ కేర్‌ కొల్హాపూర్‌ టు హిందుస్థాన్‌ యూనిలీవర్‌
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లగ్జరీ హౌజ్‌కు నాయకత్వం వహించడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఆ ఘనత సాధించి సత్తా చాటిన మహిళ...లీనా నాయర్‌. కొల్హాపూర్‌ నుండి లగ్జరీ హౌజ్‌ ‘చానల్‌’ నాయకత్వ బా«ధ్యతల వరకు లీనా నాయర్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది. 

ఇంజినీర్‌ నుండి హెచ్‌ఆర్‌ ప్రొషనల్‌గా మారింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌లో ఎన్నో అడ్డంకులు బద్దలు కొట్టి ఆ ప్రసిద్ధ సంస్థలో మొదటి మహిళా చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ అయింది. ‘ఛానల్‌’ గ్లోబల్‌ సీయివోగా లీనా నాయర్‌  36,000 మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తోంది. తన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఈ సంవత్సరం కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌(సిబిఇ) అవార్డ్‌ అందుకుంది.

కోట్లాది హృదయాలను గెలిచిన... హార్ట్‌ ల్యాంప్
తన కథల సంకలనం ‘హార్ట్‌ ల్యాంప్‌’తో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకుంది బాను ముస్తాక్‌. ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి కన్నడ రచయిత్రిగా చరిత్ర సృష్టించింది. 1990–2023 మధ్య ముస్తాక్‌ రాసిన ఈ కథలు దక్షిణ భారత ముస్లింల కష్టాలను హృద్యంగా ఆవిష్కరిస్తాయి. ప్రాంతీయ కథలకు విశ్వజనీనత ఉంటుంది’ అనే ముస్తాక్‌ నమ్మకాన్ని ‘హార్ట్‌ ల్యాంప్‌’ నిజం చేసింది.

ముస్తాక్‌ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదేళ్ల వయసులో ఆమెను ఒక కాన్వెంట్‌ స్కూల్‌లో చేర్పించాడు. అక్కడ బోధనా మాధ్యమం రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ. కన్నడ భాషలో అనర్ఘళంగా మాట్లాడడానికి ముస్తాక్‌ చాలా కష్టపడింది. ఆ అపరిచిత భాషనే తన సాహిత్య వ్యక్తీకరణగా చేసుకుంది.

అత్యంత నిశితమైన వైద్య చికిత్సలు (ప్రెసిషన్‌ మెడిసిన్‌)...
ఒక జబ్బుకు అందరికీ టోకుగా ఒకేలాంటి చికిత్స అందించడానికి బదులుగా ఆయా వ్యక్తి భౌలిక, మానసిక, జన్యుపరమైన స్వరూప స్వభావాలను బట్టి అతడికి మాత్రమే ఉద్దేశించిన చికిత్స అందించడాన్ని పర్సనలైజ్‌డ్‌ మెడిసిన్‌గా చెప్పవచ్చు. 

అది ఆ వ్యక్తి జబ్బును బట్టి, దాని తీవ్రత ను బట్టి అలాగే అతడి జెనెటిక్స్, అతడుండే వాతావరణం (ఎన్విరాన్‌మెంట్‌), అతడి జీవనశైలి... ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికే పూర్తిగా సరిపడేలా చికిత్స అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే అత్యంత నిశితమైన వైద్య చికిత్స అంటూ ద రాయల్‌ సొసైటీ ఆఫ్‌ థాయిల్యాండ్‌ పేర్కొంటోంది. ఈ రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.

టెలీహెల్త్‌...
నిజానికి టెలీహెల్త్‌ అనే కాన్సెప్ట్‌ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే మునుపు దీని పరిధి చాలా తక్కువ. ఉదాహరణకు హైదరాబాద్‌లో అత్యంత నిపుణులైన, అనుభవజ్ఞులైన  వైద్యులు ఉండవచ్చు. కానీ ఎక్కడో అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెలో ఒక తీవ్రమైన జబ్బు ఉన్న వ్యక్తికి అతడి సేవలు అవసరం. కేవలం టెలీహెల్త్‌ అనే కాన్సప్ట్‌లో మునుపు కేవలం బాధితులను టీవీ ద్వారా / తమ మొబైల్‌ ఫోన్లద్వారా లేదా పర్సనల్‌ కంప్యూటర్లకు అమర్చిన కెమెరాల ద్వారా  చూడటం, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సకు అవసరమైన మందులను సూచించడం మాత్రమే జరిగేది. కోవిడ్‌–19 నేపథ్యంలో నేరుగా బాధితులను తాకడానికీ / లేదా వాళ్లను తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ తరహా టెలీమెడిసిన్‌ చికిత్సలు ఊపందుకున్నాయి. 

అటు తర్వాత ఇలా రిమోట్‌గా ఉన్నవారికి సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు... పెద్ద పెద్ద నగరాల్లోని నిపుణులైన సర్జన్‌లు ఎక్కడో సుదూరంగా ఉన్న చిన్న పట్టణాల్లోని పేషెంట్లకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్జరీలు విజయవంతంగా చేయడం సాధ్యమైంది. అందునా ఇటీవల భారతదేశంలో రోబోటిక్‌ సర్జరీ సహాయాలతో ఇలాంటి సర్జరీలు చేయడం మొదలైంది. ఇదెంత వరప్రదయని అంటే... ఏవైనా కారణాల వల్ల ఒక చిన్న పట్టణంలోకి పేషెంట్‌ను సుదూరంలోని పెద్ద నగరానికి తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో నగరాల్లోని అత్యంత నిపుణులైన డాక్టర్లూ తమ శస్త్రచికిత్స నైపుణ్యాలను అంతదూరంలోని పేషెంట్లకు అందజేయడానికి ఇప్పుడు వీలవుతోంది.

ఉంగరాల్లాంటి ఉపకరణాలతో స్వీయ పరిశీలన...
స్మార్ట్‌ వాచీల సహాయంతో తమ గుండె స్పందనలూ, రక్త΄ోటూ, ఎంతసేపు నిద్ర΄ోయామనే సమాచారం, తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ మేరకు నిద్రలోపించిందీ లేదా ఎక్కువ సేపు నిద్ర΄ోయారా అన్న విషయాలూ... ఇలాంటి స్వీయ ఆరోగ్య విషయాలను తెలుసుకునే ‘ఫిట్‌నెస్‌ ట్రాకర్లు’ వచ్చాయి. ఈ ఏడాది ఇది మరింత ముందుకు వెళ్లి... చిన్న ఉంగరంలాంటిది తొడగడం ద్వారా తమ రక్తంలోని చక్కెర మోతాదులు మొదలుకొని అనేక విషయాల్లో ఆరోగ్యసమాచారాలు తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడుతోంది. 

ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యస్పృహ బాగా పెరిగిన ఈ రోజుల్లో ట్రెండీగా ఉన్న ఈ ఉంగరాలను తొడగడం మామూలైంది. ఇవి... ఒకపక్క ఫ్యాషనబుల్‌గా ఉండటంతో పాటు ఇటు ఆరోగ్య సమాచారాలూ తెలుస్తుండటంతో ΄ాటు ఇంచుమించూ బంగారు ఉంగరం ధరతో సమానంగా ఉండటంతో ఇటీవల వీటిని ధరించి తమ ఆరోగ్య సమాచారాన్ని తామే తెలుసుకోవడం, అవసరమైనప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం వంటి సౌకర్యం ఉండటంతో వీటికి ప్రాచుర్యమూ పెరుగుతోంది.

కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌తో వ్యాధి నిర్ధారణలు, చికిత్సలు...
ఒక డాక్టర్‌ తన జీవితకాలంలో ఓ లక్ష కేసులు చూడగలడని అనుకుందాం. అంటే ఒక లక్షమంది పేషెంట్లను చూసిన చరిత్ర / దాఖలాను బట్టి అతడి అనుభవం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి లక్షమంది అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుభవాలన్నీ క్రోడీకరించి... ఆ అనుభవ సారాన్ని కృత్రిమమేధస్సుకు ఆపాదిస్తే? అలాగే ఆ అనుభవసారంతో విశ్లేషించాల్సిన విషయాలను ఓ యంత్రానికి (మెషిన్‌ లెర్నింగ్‌) నేర్పితే? ఇందువల్ల కోటానుకోట్ల కేసులను చూసిన అనుభవం ఒక యంత్రంలో నిక్షిప్తమై ఉంటుందనీ, దానివల్ల చాలా సంక్లిష్టమైన కేసులనూ సులువుగా విశ్లేషించగలగడం వల్ల పేషెంట్లకు ఎంతో  ప్రయోజనం చేకూరుతుందంటూ కొన్ని ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. 

అయితే దీనికి చాలా పరిమితులు ఉంటాయనీ, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ ఎప్పటికీ మానవ మేధస్సు తాలూకు విశ్లేషణలను సాధించలేదనేది చాలామంది అనుభవజ్ఞులైన డాక్టర్ల మాట. అయినప్పటికీ చాలాకేసుల్లో ఇప్పుడు పేషెంట్‌ తాలూకు ఆరోగ్య చర్రిత, రకరకాల రక్తపరీక్షలూ, మెడికల్‌ ఇమేజింగ్‌ పరిశీలనల ఆధారంగా రోగుల పరిస్థితిపై ఇప్పుడు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌తో విశ్లేషణలు జరిపాక దాన్ని నిపుణులైన డాక్టర్లు తమ అనుభవంతో సరిపోల్చుకుని (కో రిలేట్‌ చేసుకుని) అత్యంత నిశితంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రక్రియల నిర్ధారణ జరుపుతున్నారు.

హోలిస్టిక్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ అప్రోచ్‌... 
ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చిందనుకుందాం. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. ఇటు రక్తప్రసరణ వ్యవస్థలోనూ, అటు ఊపిరితిత్తుల విషయంలోనూ... ఈ రెండే కాకుండా బ్రెయిన్‌కు సరఫరా అయ్యే రక్తం కారణంగా మెదడును ఇలా రకరకాల వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు. అందుకే ఇటీవల వైద్య చికిత్సలు చేస్తున్న వివిధ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు... అంటే కార్డియాలజీ, పల్మునాలజీ, న్యూరాలజీ... ఇలాంటి నిపుణలంతా సంయుక్తంగా తాము నిర్వహించాల్సిన చికిత్సలను సమన్వయ పరచాల్సి ఉంటుంది. 

ఇలా వివిధ ఆరోగ్య వ్యవస్థలకే కాకుండా ఇటు శరీరక ఆరోగ్యం, అటు మానసిక ఆరోగ్యం, మరో వైపున ఆధ్యాత్మిక ఆరోగ్యం... ఇలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటేనే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చె΄్పాలనేది డబ్ల్యూహెచ్‌ఓ నిర్వచనం. అందువల్ల ఓ వ్యక్తి తాలూకు పూర్తి ఆరోగ్య పరిస్థితిని నిర్వహితమయ్యేలా చూడటమనే అంశం కూడా ఈ ఏడాది ప్రయత్నాల్లో ఒకటి.

అడ్వాన్స్‌డ్‌ జీనోమిక్‌ రీసెర్చ్‌...
ఒక వ్యక్తి తాలూకు జన్యుపరమైన అనారోగ్యాలకు అతడి జన్యువులు కూడా కారణమవుతాయి. కొందరిలో ఈ జన్యువుల్లో ఏదైనా తేడాలుంటే... చికిత్సకు సాధ్యం కాని సమస్యలూ, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ (కంజెనిటల్‌ డిసీజెస్‌), వైకల్యాలూ రావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకు చెడి΄ోయిన ఓ జన్యువు కారణమైనప్పుడు... నేరుగా ఆ జన్యువుకే చికిత్స అందించడం ద్వారా ఆ వైకల్యాన్ని తప్పించడం / నివారించడమనే అంశంపైన చికిత్స అందించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. 

ముందుగా పేర్కొన్న టోకు చికిత్స కాకుండా...  వ్యక్తిగత (పర్సనలైజ్‌డ్‌) చికిత్సకూ ఈ అడ్వాన్స్‌డ్‌ జీనోమిక్‌ చికిత్సలు తోడ్పడతాయి. ఈ రంగంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి విజయవంతమైతే గతంలో నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) తప్ప చికిత్స లేని చాలా జబ్బులకు విజయవంతమైన పూర్తి చికిత్స అందే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. పురోగతి కూడా చాలావరకు కనిపించింది.

నైతికాంశాలు, సదస్సులు...
ఈ ఏడాది చోటు చేసుకున్న విప్లవాత్మకమైన పరిశోధనలూ, వైద్య చికిత్సలో, అందులోని పురోగతితో వాస్తవంగా పేషెంట్‌ ఎలాంటి చికిత్సలు ఎంతవరకు అవసరమో అంతే అందేలా, పేషెంట్‌ తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా... అలాగే అతడు సమాచార లోపానికీ, ఆర్థికంగా దోపిడికి గురికాకుండా చూసే నైతికాంశాలపై అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహితమయ్యాయి. 

ఈ పురోగతి పేషెంట్‌కు భారం కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలను ప్రస్తావిస్తూ... ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా నైతికవేత్తలు అనేకానేక ప్రస్తావనలూ, ప్రతిపాదనలూ తీసుకువస్తున్నారు. స్థూలంగా... ఈ ఏడాది 2025లో వైద్యరంగంలో చోటుచేసుకున్న పురోగతి, ఇంకా ఓ అసిధారావ్రతంలా కొనసాగుతున్న పరిశోధనల , సంక్షిప్త వివరాలివి.
డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

(చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement