
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. చాలామంది చెప్పే పేరు ప్రభాస్. అప్పుడెప్పటి నుంచో ఇతడు పెళ్లి చేసుకుంటాడు అనే మాట వినిపిస్తూనే ఉంది. కానీ అది అలా వినిపిస్తూనే ఉంది తప్పితే శుభకార్యం జరగట్లేదు. ఓవైపు ప్రభాస్ ఏమో సినిమాలతో బిజీ. మరోవైపు అతడి కుటుంబ సభ్యులు మాత్రం కచ్చితంగా వివాహం జరుగుతుందని చెబుతుంటారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామాలాదేవి ఇతడి పెళ్లి కోసం పూజలు నిర్వహించారు.
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. సోమవారం, కాకినాడలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అలానే దాక్షారామం ఆలయాన్న సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా వాళ్లతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి టాపిక్ రాగా.. 'ప్రభాస్‌కి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి' అని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం తాను చెప్పలేనని పేర్కొన్నారు. అలానే తన కూతుళ్లకు కూడా త్వరలో వివాహం జరిపిస్తామని అన్నారు.
(ఇదీ చదవండి: ధనుష్‌తో డేటింగ్? ఎట్టకేలకు స్పందించిన మృణాల్)
శ్యామలాదేవి చెప్పడం వరకు బాగానే ఉంది ప్రభాస్‌కి నిజంగా పెళ్లి జరుగుతుందా అంటే సందేహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇతడి వయసు 45 ఏళ్లు. చేతిలో ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ(వర్కింగ్ టైటిల్), సలార్ 2, కల్కి 2.. ఇలా లెక్కకు మించి సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల గురించి వినిపిస్తోంది. ఇవన్నీ ఎప్పటికీ పూర్తవుతాయి? ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు?
గతంలో అంటే ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు అనుష్క పేరు వినిపించేది. ఇద్దరు సింగిల్‌గా ఉండటమే కారణం. కానీ తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని పలుమార్లు వీరిద్దరూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా ఆ టాపిక్ వదిలేశారు. కానీ అటు అనుష్క గానీ ఇటు ప్రభాస్ గానీ ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. వీళ్లిద్దరికీ అవుతుందనే గ్యారంటీ కూడా ఫ్యాన్స్‌కి కనిపించట్లేదు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)