నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన తెలుగమ్మాయి మాధవీలత ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవుడిపై తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు కారణం.
(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)
సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకుగానూ మాధవీలతపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యాబర్లని ఆదేశించారు.
నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వీళ్లందరి సోషల్ మీడియా అకౌంట్స్‌పై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
(ఇదీ చదవండి: ఏపీలో పర్మినెంట్‌గా పెరగనున్న సినిమా టికెట్ ధరలు)


