ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్‌గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.
అలాంటిది సడన్‌గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్‌కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
🕊️ Rest in Peace, Actress Nandini🙏😢
Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025


