దిల్‌ రాజు డ్రీమ్స్‌లో మార్కండేయ | Dil Raju Speech At Markandeya Glimpse Launch Event | Sakshi
Sakshi News home page

దిల్‌ రాజు డ్రీమ్స్‌లో మార్కండేయ

Feb 13 2026 3:24 AM | Updated on Feb 13 2026 3:24 AM

Dil Raju Speech At Markandeya Glimpse Launch Event

సిస్ట్లా, విక్రాంత్, ‘దిల్‌’ రాజు

‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించిన 23 ఏళ్లలో 60 చిత్రాలు పూర్తి చేసిన మా సంస్థకు ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ మరో విభాగం. ‘మార్కండేయ’ మూవీ కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని మా దిల్‌ రాజు డ్రీమ్స్‌ బ్యానర్‌లో తొలి సినిమాగా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అని ‘దిల్‌’ రాజు తెలిపారు. విక్రాంత్‌ హీరోగా సిస్ట్లా వీఎంకే తెరకెక్కిస్తున్న చిత్రం‘మార్కండేయ’. ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా డబ్బు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ‘పెళ్లి పందిరి’ సినిమా నిలబెట్టింది.

‘మార్కండేయ’ మూవీని 2027 మహాశివరాత్రికి విడుదల చేస్తాం. ఈ బ్యానర్‌లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్‌గా రిలీజ్‌ అవుతాయి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ‘ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి’ వంటి సినిమాలు నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి నిలబెడుతున్న రాజుగారికి థ్యాంక్స్‌’’ అని సిస్ట్లా వీఎంకే  పేర్కొన్నారు. ‘‘ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేం చేస్తున్న ఒక మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మార్కండేయ’’ అన్నారు విక్రాంత్‌. ఈ కార్యక్రమంలో కెమెరామేన్‌ జగదీశ్‌ వర్మ భూపతిరాజు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హరి ఎస్‌ఆర్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement