
రజినీకాంత్ 'కూలీ' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఓవర్సీస్‌లో జోరుగా బుకింగ్స్ సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా టికెట్ రేట్ల పెంపు జీవో రావాల్సి ఉంది. అయితే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. తమిళనాడు నుంచి ఈ రికార్డ్ సృష్టించిన తొలి సినిమాగానూ నిలిచింది.
రజిని సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోని కొన్ని దేశాల్లో కాస్త బజ్ ఉంటుంది. కానీ 'జైలర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హీరో చేసిన మాస్ మూవీ కావడం, దానికి లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్.. ఇలా చాలా ఎలిమెంట్స్ కారణంగా హైప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లో సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించి, పోస్టర్ విడుదల చేసింది.
(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ పరమేశ్వరన్)
అప్పట్లో రజినీ 'కబాలి' రిలీజ్ టైంలో చాలా హడావుడి నడిచింది. ఇదే ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ 1.6 మిలియన్ డాలర్స్ వరకు వచ్చాయి. తర్వాత చాలా తమిళ చిత్రాలు వచ్చాయి కానీ ఏవి కూడా ఈ మార్క్‌ని అందుకోలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు రజినీకాంత్ తన 'కూలీ'తో ఈ నంబర్ దాటేశారు. చూస్తుంటే తొలిరోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ నంబర్స్ నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది.
'కూలీ'లో రజినీకాంత్‌కి హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. నాగార్జున విలన్ కాగా సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. 'కూలీ, 'వార్ 2'తో తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)
