breaking news
COOLIE Movie
-
'కూలీ' సెన్సార్ విషయంలో కోర్టుకు సన్ పిక్చర్స్
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 404 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో కలెక్షన్స్‌పై కాస్త ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని గుర్తించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.భారత్‌లో 'కూలీ' సినిమాకి CBFC నుండి A సర్టిఫికేట్ పొందింది. అయితే, విదేశీ సెన్సార్ మాత్రం భిన్నమైన రిపోర్ట్‌ను జారీ చేసింది. ఒక్క కట్ కూడా సూచించకుండా ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రజనీ సినిమాకి A సర్టిఫికేట్ లభించిడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది మొత్తం కలెక్షన్లపై నిజంగానే ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లు పిల్లలను పరిమితం చేశాయి. అయితే, సినిమాలో ఊహించినంతగా హింస లేకపోవడంతో సెన్సార్ వివషయంలో ప్రేక్షకులు తప్పుబట్టారు. ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోయారు.సెన్సార్ ఇచ్చిన ఈ సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తూ సన్ పిక్చర్స్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు కూలీ సర్టిఫికేషన్‌ను ‘U/A’గా ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యంగా వ్యవహరించడంతో, ఇప్పటికే తగినంత నష్టం జరిగిపోయింది. మద్రాస్ హైకోర్టు మేకర్స్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్ తదితరులు నటించారు. -
తమిళ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. 'కూలీ' ఇంటర్వెల్లో నాగార్జున హిట్ సాంగ్
రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' సినిమాలో అక్కినేని నాగార్జున విలన్‌గా నటించారు. అయితే, నాగ్‌కు తమిళ్లో కూడా అభిమానులు ఉన్నారు. కూలీలో ఆయన పాత్రకు అక్కడి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, మూవీ ఇంటర్వెల్లో నాగార్జున నటించిన సినిమా నుంచి ఒక హిట్ సాంగ్‌ను ప్రదర్శించాలని కోరారు. దీంతో థియేటర్ యజమానులు కూడా ఆ పాటను ప్రదర్శించి నాగ్ అభిమానులను ఆనందపరిచారు.కూలీ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, కన్యాకుమారి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీ ప్రదర్శించబడుతున్న థియేటర్స్‌లలో నాగార్జున నటించిన రక్షకుడు (రత్చగాన్) సినిమా పాటను బిగ్ స్క్రీన్‌పై టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 1997లో విడుదలైన రక్షకుడు నుంచి 'సోనియా సోనియా' సాంగ్‌ను ఫ్యాన్స్ కోరారు. దీంతో ఇంటర్వెల్ సమయంలో ఆ పాటను యాజమాన్యం ప్రదర్శించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్కు నాగార్జున, సుష్మితా షేన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ కూడా దుమ్మురేపారు.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ తమిళనాడులో సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఇదే టాప్.. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.As Audience wish, we Screened #Nagarjuna's sir Iconic #SoniyaSoniya song on the Interval of #Coolir and the Audience was totally enjoyed☺️, it added a new vibe ❤️.Book now and enjoy this kinda exclusive btw the Show.#coolieinsribalajicinemas@iamnagarjuna @chay_akkineni pic.twitter.com/7x1EARrCG0— Sri Balaji Cinemas (@BalajiCinemas) August 17, 2025 -
'కూలీ'తో ఓవర్ నైట్ స్టార్డమ్.. ఎవరీ బ్యూటీ?
-
అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్‌కి వింత అనుభవం
సెలబ్రిటీలకు అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. వెంటనే అవి కాస్త వైరల్ అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్‌కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏమైంది? శ్రుతి హాసన్ ఎందుకు బతిమాలాడుకోవాల్సి వచ్చింది.తమిళ బ్యూటీ అయిన శ్రుతి హాసన్.. రీసెంట్ టైంలో ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'కూలీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రిలీజ్ నాడే మూవీ చూద్దామని చెన్నైలో ఓ థియేటర్‌కి వెళ్లగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఈమె ఉన్న కారుని ఆపేశాడు. దీంతో శ్రుతి హాసన్ అవాక్కయింది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)దీంతో సదరు సెక్యూరిటీ గార్డ్‌తో.. 'నేను సినిమాలో ఉన్నాను. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అన్నా. నేనే హీరోయిన్ సార్' అని శ్రుతి హాసన్ బతిమలాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని తమిళ ర్యాపర్ యుంగ్ రాజా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.'కూలీ' విషయానికొస్తే.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ తొలిఆటకే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మాత్రం ఎంతొచ్చింది ఏంటనేది చెప్పలేదు. రూ.85 కోట్ల మేర వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఇప్పటివరకు రూ.240 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్)#ShrutiHaasan 😂😂#Cooliepic.twitter.com/LIB7LlfhBc— Prakash Mahadevan (@PrakashMahadev) August 15, 2025 -
'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?
స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే రెండు కూడా పూర్తిస్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయాయి. కొందరికి ఈ మూవీస్ నచ్చితే.. మరికొందరు మాత్రం ఓకే ఓకే ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ప్రేక్షకులు.. థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ చిత్రాలకు ఎంతెంత వచ్చాయి? ఎవరు ముందున్నారు?'కూలీ' గురించి ముందుగా మాట్లాడుకుంటే.. తొలిరోజు రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తమిళంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన సినిమాగా రికార్డ్ కూడా సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. అయితే మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజు నంబర్లు కాస్త డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రూ.86 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. అంటే రెండు రోజుల్లో కలిపి దగ్గరదగ్గర రూ.240 కోట్ల వసూళ్లు వచ్చినట్లు టాక్.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)'కూలీ' రెండో రోజ వసూళ్లలో తమిళం నుంచి రూ.34 కోట్లు రాగా, తెలుగు-హిందీల నుంచి వరసగా రూ.13.5 కోట్లు, రూ.7.5 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్‌లోనూ తమిళంతో పాటు తెలుగు నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని దీనిబట్టి అంచనా వేయొచ్చు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్.. ఇలా స్టార్స్ ఉండటం ఈ మూవీకి ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతోంది.మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే.. నిర్మాతలు అధికారికంగా వసూళ్ల లెక్కలు ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల్లో కలిసి రూ.115 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెండోరోజు రూ.56.5 కోట్ల నెట్ వచ్చినట్లు వినిపిస్తోంది. మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజే కాస్త పెరుగుదల కనిపించింది. ఓవరాల్‌గా హిందీలో రూ.75 కోట్ల నెట్ రాగా, తెలుగు నుంచి రూ.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే 'కూలీ'నే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి అధికారిక నంబర్లు ప్రకటిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
'కూలీ' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు: స్టార్ హీరో
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో భారీ తారాగణమే ఉంది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుమారు 10 నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్ కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా ఆమిర్ రియాక్ట్ అయ్యారు.కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఆమిర్ ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం కోసం తాను డబ్బు తీసుకోలేదని చెప్పాడు. కేవలం రజనీకాంత్ కోసం మాత్రమే ఇందులో నటించానని తెలిపాడు. ఆపై కూలీ చిత్ర యూనిట్ మీద ఉన్న ప్రేమ వల్ల జీరో రెమ్యునరేషన్‌తో తన రోల్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ మీద ఉన్న ప్రేమ వల్ల కూలీ సినిమా కథ కూడా వినకుండా ఓకే చెప్పానని ఆమిర్‌ఖాన్ గుర్తుచేశాడు. తన కెరీర్లో చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పానన్నాడు.భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో రూ. 230 కోట్ల గ్రాస్ దాటినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో విడుదలైన కూలీ సినిమాకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ మూవీలో కన్నడ నటి రచితా రామ్ 'కల్యాణి' అనే పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. వాస్తవంగా ఆమె కన్నడ సినిమాలో హీరోయిన్.. అయితే, రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడంతో కూలీలో విలన్ పాత్ర చేసింది. ఇందులో ఆమె పాత్రను విక్రమ్ సినిమాలో కనిపించిన ఏజెంట్ 'టీనా' పాత్రకు 'రివర్స్ వెర్షన్'గా ఉంటుందని చెప్పవచ్చు.కూలీ సినిమాలో కల్యాణిగా నటించిన రచితా రామ్ ఎవరంటూ టాలీవుడ్ షోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. “సర్ప్రైజ్ ప్యాకేజ్” అని అభిమానులు అభివర్ణించారు. ఆమె పాత్రతో కథలో ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. కూలీలో రచితా రామ్ పాత్ర ఉపేంద్ర కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ పొందిందంటూ కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా కన్నడలో ఆమె పేరు భారీగా వైరల్ అవుతుంది.రచితా రామ్ 2013లో మొదటిసారి దర్శన్‌తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్స్‌తో నటించింది.తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో సినిమా2022లో తెలుగులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్గా నటించింది. 'సూపర్ మచ్చి' చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఆశించింది. కానీ, ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆమె కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తెలుగులో ఆమెకు మరో సినిమా ఛాన్స్ దక్కలేదు.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్ధతుగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్ధతుగా రచితా రామ్ గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. ' నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శన్.. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు.ప్రెస్మీట్లో బోల్డ్ కామెంట్కన్నడ సినిమా ప్రెస్మీట్లో ఆమె ఒకసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకుంది. ఆమె నటించిన కన్నడ సినిమా ‘లవ్ యూ రచ్చు’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెను చిక్కుల్లో పడేసింది 'బోల్డ్ కంటెంట్‌తో ఉన్న ఇలాంటి సినిమాలో మీరు నటించడానికి గల కారణం ఏమిటి..?' అనే ప్రశ్నకు ‘‘ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వారందరూ పెళ్లైన వారే అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య ఉండే రొమాన్స్‌నే మేము ఈ సినిమాలో చూపించాం. బోల్డ్ సీన్స్‌కీ ఓ కారణం ఉంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడండి..’’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. -
'కూలీ' కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్.. తమిళ్లో ఇదే టాప్
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన 'కూలీ' (Coolie) సినిమా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ్ సినిమాగా కూలీ నిలిచిందంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రీమియర్ షోలు లేకుండా ఆపై తమిళనాడులో టికెట్ ధరలు పెంచకుండానే బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.151+ కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ది రికార్డ్ మేకర్, రికార్డ్ బ్రేకర్ అంటూ షోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాలు వరుసుగా ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో 'కూలీ' సినిమా ఉండగా రెండో స్థానంలో విజయ్ నటించిన లియో (రూ. 148 కోట్లు ) ఉంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (రూ. 110 కోట్లు), రోబో 2.O (రూ. 100 కోట్లు), కబాలి (రూ. 87.5) కోట్లు, జైలర్ (రూ. 87 కోట్లు), పొన్నియన్ సెల్వన్1 (78. 30 కోట్లు), సర్కార్ ( రూ. 75 కోట్లు), బీస్ట్ (రూ. 72.67 కోట్లు), విక్రమ్ (రూ. 66 కోట్లు) టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ కలెక్షన్స్ అన్ని కూడా గ్రాస్ రూపంలో చెప్పబడింది.Superstar Rajinikanth The Record Maker & Record Breaker 🔥🔥🔥#Coolie becomes the Highest ever Day 1 worldwide gross for a Tamil film with 151 Crore #Coolie in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj… pic.twitter.com/k3wLtIMqPn— Sun Pictures (@sunpictures) August 15, 2025 -
‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన తొలి చిత్రం ‘వార్ 2’. భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 14) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. అయినప్పటికీ తొలి రోజు మాత్రం భారీ కలెక్షన్స్‌నే రాబట్టింది.(చదవండి: వార్ 2 మూవీ రివ్యూ)మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా రూ. 29 కోట్లు వసూళ్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్లో వార్ 2 కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ 2 మొత్తంగా రూ. 85-90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. (చదవండి: ‘కూలీ’ మూవీ రివ్యూ)ఇక ఇదే రోజు విడుదలైన కూలీ చిత్రంతో పోలిస్తే..వార్ 2 కలెక్షన్సే తక్కువ. కూలీ చిత్రానికి కూడా తొలిరోజే మిశ్రమ స్పందన వచ్చినా.. అత్యధికంగా రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు చిత్రాలు కలిసి తొలి రోజు రూ. 117.50 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్‌తో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్లో ఈ రెండు చిత్రాల్లో ఏది అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందో చూడాలి. -
50 years of Rajinikanth: సూపర్‌స్టార్‌పై అభినందనల వందన
50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న ఏకై క నటుడు రజనీకాంత్. 1975లో అపూర్వరాగంగళ్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన రజనీ తాజాగా నటించిన కూలీ చిత్రంతో కథానాయకుడిగా 50 వసంతాలను పూర్తిచేసుకున్నారు. 50 ఏళ్లలో తమిళం, తెలుగు ,హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 171 చిత్రాలు చేశారు. ఈయన నటుడిగా 50వ వసంతంలో నటించిన చిత్రం కూలీ. దీంతో రజనీకాంత్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళణిసామి, శశికళ, ఎంపీ కమలహాసన్, దినకరన్‌ల వరకు పలువురు అభినందనలు తెలిపారు.కాగా రజనీకాంత్ తాజాగా నటించిన కూలీ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుధవారమే చూసిన సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, పలువురు రాజకీయ ప్రముఖులు చూసి బాగుందంటూ ప్రశంసించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కూలీ చిత్ర రిజల్ట్ మాట అటు ఉంచితే రజనీకాంత్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల ముందు బ్యాండ్ బాజాలు, డాన్స్‌లతో కోలాహలం సృష్టించారు. ఆగస్టు 15 ముందు రోజునే విడుదలైన కూలీ చిత్రం ఆదివారం వరకు నాలుగు రోజులు వసూళ్లను ఇరగదీస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత చిత్రంలో దమ్మును బట్టి కలెక్షన్ ్స ఉంటాయి. -
రజినీకాంత్ కూలీ తొలి రోజు కలెక్షన్స్.. ఆ సినిమా కంటే తక్కువే!
రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తొలిరోజు అదరగొట్టింది. రిలీజ్‌కు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ కావడంతో కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో కోలీవుడ్ హిస్టరీలోనే రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూలీ నిలిచింది. కూలీ కంటే ముందుగా విజయ్ నటించిన లియో మొదటి రోజే రూ.145 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఇండియాలోనూ కూలీ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తొలి రోజే దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రూ. 30 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ దాదాపు రూ.75 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ వసూళ్ల పరంగా చూస్తే విజయ్ నటించిన 'లియో'ను అధిగమించలేకపోయింది. ఇండియావ్యాప్తంగా దళపతి విజయ్ నటించిన లియో దేశవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు రూ. 76 కోట్లు వసూలు చేసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో కూలీ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
కూలీ థియేటర్లో బ్లాక్‌బస్టర్ ట్రైలర్.. దద్దరిల్లిపోయేలా అరుపులు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల క్రిత రిలీజైన మరోసారి మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. అయితే సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీ హంగులతో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.అంతేకాకుండా ఇవాళ కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా శివ 4కే ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రజినీకాంత్ కూలీ సినిమాకు ముందు శివ ట్రైలర్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. థియేటర్ దద్దరిల్లిపోయేలా శివ పేరుతో మార్మోగిపోయేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్జీవీ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నామని నాగార్జున తెలిపారు. నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లిందని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చిందన్నారు. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం.. శివని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ అని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు..pic.twitter.com/tozHy5t1jC— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2025 -
కూలీ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే!
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)కు భారీగా ప్రమోషన్లు చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున తొలిసారి విలన్‌గా నటించడం.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది.ఓటీటీ వివరాలుఇకపోతే ఈ సినిమా డిజటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం ఇంకా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
కూలి సినిమా రివ్యూ
-
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కూలీ' హడావుడే. సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబో కావడం.. తొలిసారి కింగ్ నాగార్జున విలన్‌గా చేయడం.. దానికి తోడు అనిరుధ్ పాటలు వైరల్ కావడం.. ఇలా ఎక్కడలేని హైప్ అంతా ఈ మూవీపై ఏర్పడింది. అలా భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి అభిమానులు ఆశపడ్డట్లు రజినీకాంత్ హిట్ కొట్టారా? ఇంతకీ 'కూలీ' ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటి?వైజాగ్ పోర్ట్‌లో కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కూలీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. చాలామంది చాలారకాలుగా అంచనా వేశారు. ఇదేదో ట్రైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అని మాట్లాడుకున్నారు. అలానే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌కి కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇది ఫక్తు రివేంజ్ కమర్షియల్ డ్రామా. ఎల్సీయూతో ఎలాంటి లింక్ లేదు. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్రెండ్‌ని ఎవరో చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో.. ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇంతకీ చంపింది ఎవరు అనేదే స్టోరీ.వైజాగ్ పోర్ట్ ఏరియా, అక్కడ సైమన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం, దాన్ని చూసుకునే దయాల్.. ఇలా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సినిమా మొదలైంది. కట్ చేస్తే దేవాగా రజినీకాంత్ ఎంట్రీ. వెంటనే ఓ పాట. కాసేపటికే తన ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడనే వార్త.. ఇది తెలిసి అతడి ఇంటికి దేవా వెళ్లడం, అక్కడేమో రాజశేఖర్ కూతురు ప్రీతి.. కాసేపటికి సైమన్ ఎంట్రీ.. అలా ఒక్కో పాత్ర పరిచయం చేస్తూ వెళ్లారు. తన ఫ్రెండ్‌ని చంపింది ఎవరో తెలుసుకునే క్రమంలో హీరో.. విలన్ గ్యాంగ్‌లో చేరడం, తాను వెతుకుతున్న హంతకుడు ఎవరో తెలియడం లాంటి అంశాలతో తొలి భాగం ముగుస్తుంది. దేవా మ్యాన్షన్లోనే హీరో చేసే ఓ ఫైట్ తప్పితే ఫస్టాప్ అంతా డ్రామానే ఉంటుంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఇంటర్వెల్లో ఫైట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో కాస్త డిఫరెంట్.తొలి సగంలో ఎక్కువగా డ్రామానే ఉంది కదా కనీసం సెకండాఫ్‌లో అయినా యాక్షన్ ఉంటుందా అనుకుంటే అక్కడ కూడా అదే డ్రామాని నడిపించారు. సినిమాలో స్టార్స్ ఎక్కువమంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ప్రయత్నంలో సినిమా మొత్తం కలగాపులగం అయిపోయింది. దయాల్ పాత్రలో ట్విస్టులు బాగున్నాయి. సైమన్ దగ్గర పనిచేస్తూ, అతడి కొడుకుని ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో ట్విస్టులు కూడా బాగున్నాయి. మూవీలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువైపోవడంతో చాలా సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దాహా అనే పాత్రలో ఆమిర్ ఖాన్ ఎంట్రీ పెద్దగా ఇంపాక్ట్ చూపించిందా అంటే లేదు.ఎవరెలా చేశారు?రజినీకాంత్ ఎప్పటిలానే తన స్వాగ్, స్టైల్‌తో ఆకట్టుకున్నారు. విలనిజం చేసిన నాగార్జున.. కాస్త కొత్తగా కనిపించారు. ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది గానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది. సత్యరాజ్, ఉపేంద్ర ఉన్నారంటే ఉన్నారు అంతే. పెద్దగా స్కోప్ దొరకలేదు. శ్రుతి హాసన్ కూడా ఇచ్చినంతవరకు న్యాయం చేసింది. దయాల్‌గా చేసిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. మెస్మరైజ్ చేశాడు. కల్యాణిగా చేసిన కన్నడ నటి రక్షిత రామ్ కూడా చిన్న రోల్ అయినా బాగుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది.సినిమాలో కథ పరంగా పెద్దగా మెరుపులు, హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. రిచ్ విజువల్స్, స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్. అనిరుధ్ గురించి చెప్పుకోవాలి. చాలా సాధారణమైన సన్నివేశాల్ని కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. కొన్నిచోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా అంతా చూసిన తర్వాత ఇది తీసింది లోకేశ్ కనగరాజేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు చాలానే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడం ఆమాడ దూరంలో ఆగిపోయాడు. నిర్మాణ విలువలు టాప్ నాచ్ ఉన్నాయి కానీ కథలో బలం లేకపోతే ఏం లాభం. ఓవరాల్‌గా చెప్పుకుంటే సోషల్ మీడియాలో ఉన్న హైప్‌కి.. 'కూలీ' సినిమాలో స్టోరీకి ఏ మాత్రం సంబంధం లేదు.- చందు డొంకాన -
'కూలీ' సినిమా చూసిన ధనుష్, ఐశ్వర్య.. సంతోషంగా 'రజనీ' సతీమణి (ఫోటోలు)
-
‘కూలీ’ మూవీ ట్విటర్ రివ్యూ.. సెకండాఫ్‌లో నిద్రపోవడమే
సాధారణంగానే రజనీకాంత్ సినిమాలకి తమిళ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున అభిమానులు ఉంటారు. ఇక ఆయన సినిమాలో నాగార్జున లాంటి స్టార్ హీరో విలన్‌గా నటిస్తే..ఇక్కడ అంచనాలు పెరిగిపోవడం స్వరసాధారణమే. అందుకే కూలీ సినిమాపై మొదటి నుంచి టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మపడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? విలన్‌గా నాగార్జున మెప్పించాడా? రజనీకాంత్ ఖాతాలో మరో హిట్ పడిందా? తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. కూలీ సినిమా పవర్-ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అంటూ ఎక్కువమంది ప్రశంసిస్తున్నారు. రజినీకాంత్ నటన, సినిమా కథ, కథనం బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు రజనీకాంత్‌తో పాటు నాగార్జున పాత్ర బాగా సెట్ అయిందని చెబుతున్నారు. ఆయన విలనిజం కథకు చాలా బలంగా ఉందని తెలుపుతున్నారు. అయితే, సెకండాఫ్ మాత్రం పరమ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత నిద్రపోవడమే అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కూలీ, వార్2 సమరంలో వార్2 బాగుందని ఎక్కువమంది తెలుపుతున్నారు.Second half padukobettaduCompletely disappointed#Coolie 2.5/5— Telugu Scribe (@TeluguScribe) August 14, 2025 కూలీ సినిమా కోసం దర్శకుడు లోకేష్ టేకింగ్ అదుర్స్ అంటున్నారు. ఇందులో రజనీకాంత్‌ను ఆయన సరికొత్తగా చూపారని కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, అలాగే సినిమాలో ఉత్కంఠను కొనసాగించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటికి తోడుగా అనిరుధ్ మ్యూజిక్ బాగా కలిసొచ్చిందని తెలుపుతున్నారు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి జీవం పోసిందని అభిప్రాయపడిని నెటిజన్లు ప్రతి ఎలివేషన్ సీన్‌కి అదిరిపోయే రీసౌండ్ ఇచ్చాడని అంటున్నారు.తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన క్రిస్టోఫర్ కనగరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు, కలెక్షన్స్ వివరాలు ఆయన ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన రజనీకాంత్‌ను అభిమానించేలా ఎక్కువ ట్వీట్లు కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఆయన కూలీ సినిమా గురించి ఇచ్చిన రివ్యూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సినిమా యావరేజ్ మాత్రమే అంటూ రివ్యూలో పేర్కొన్నారు. నాగార్జున చాలా స్టైలిష్‌గా ఉన్నప్పటికీ ఆయన పాత్ర సరిగ్గా సెట్ కాలేదని తెలిపారు. రజనీకాంత్ పాత్ర మాత్రమే పర్వాలేదని చెప్పిన ఆయన సినిమాలో ఇంకేమీ లేదన్నారు. అయితే, అనిరుధ్ మ్యూజిక్ అద్భుతమని చెప్పుకొచ్చారు. #Coolie - Charismatic Superstar, Flashback Deaging seq Mass. Shoubin full fledge role. Stylish Nagarjuna, but Poor characterization. Shruthi & Rachita gud Perf. Anirudh superb work. Weak Content & Clumsy screenplay; Its all over the places. Gud Actions. Wannabe Cameos. AVERAGE!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2025 "కూలీ" సినిమా ఫస్టాప్ వరకు మాత్రమే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూలీ ట్రాక్ మారిందని అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని, వాటిని రజనీకాంత్ నటనతో పాటు, నాగార్జున, లోకేష్ డైరెక్షన్ కవర్ చేశారని అంటున్నారు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.కొంతమంది మాత్రం కూలీ సినిమా కథ చాలా బోరింగ్ అంటున్నారు. సినిమా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలుపుతున్నారు. #Coolie Review in single video :#CoolieReview pic.twitter.com/aREXYEjlru— 𝐏𝐬 🐉 (@Prudhvisevveti) August 14, 2025 #Coolie — WashOut .#War2 — Winner 🙌🏆🏆🏆🏆 Congratulations @tarak9999 & @iHrithik .— Leo Dass (@LeoDasVj) August 14, 2025 #Coolie First Half :Entertaining First half with a lot of whistle-worthy momentsThe film dives straight into the story, with Lokesh & his team doing an excellent job in designing banger moments that are perfectly blended into the narrative #Rajinikanth𓃵 as DEVA has a…— IndiaGlitz Telugu™ (@igtelugu) August 14, 2025 #Coolie #CoolieFDFS #CoolieReview 1st half done in Albion Cinemas Toronto.Quite average, with unwanted heavy Ani music. Rajini looks good.Sruthi annoying as always. Concept and story line quite meh. Lokesh worst 1st half in his career. Still movie moving fast.— Behind_Politics 🔍 (@lets_findfaults) August 14, 2025#CoolieReview Story: 🔥🔥🔥🔥🔥Screen play: 🔥🔥🔥🔥🔥BGM: 💥💥💥💥💥💥Surprise elements: 🔥🔥🔥🔥Twist and turns: 🔥🔥🔥🔥🔥Artist performance: 💥💥💥💥Camera work: 🥶🥵🥵🥵ANDRajinikanth: 🔥🔥🔥🔥Aamir Khan: 🥵🥵🥵🥵#Rajinikanth | #SuperstarRajinikanth | #Coolie— DAHAA (@AamirKhanDahaa) August 14, 2025#Coolie 1st half - Superb 👌 Interval Block with great surprise &vintage song KingPin 👑 investigative portions are OK thus far however #SuperstarRajinikanth aura & emotional scene works thus far#Monica song 👌 😍 #PoojaHegde 💃#Coolie #rajinikanth𓃵 #Thalaivar #CoolieReview https://t.co/Tgq770cHlK pic.twitter.com/UIypMkeS6z— Kurosaki (@naathandaleo23) August 14, 2025#Coolie first half knocks it out of the park. gripping drama, full-on fan service, and an interval block that’ll give you goosebumps. #Rajinikanth is pure mass mayhem 🔥— Guppi (@GUppi60) August 14, 2025#Coolie 1st half - Superb 👌 Interval Block with great surprise &vintage song KingPin 👑 investigative portions are OK thus far however #SuperstarRajinikanth aura & emotional scene works thus far#Monica song 👌 😍 #PoojaHegde 💃#Coolie #rajinikanth𓃵 #Thalaivar #CoolieReview pic.twitter.com/4aXCIj4RAf— 🎊🎉 Runner 🎊🎉 (@ThookiSollu) August 14, 2025#COOLIE Very Good First Half 🥵🥵🥵🔥🔥🔥🔥BLOCKBUSTER BANG interval FOR #CoolieThePowerHouse 🔥🔥🔥🔥#Rajinikanth intro 🔥🔥🔥Anirudh music , songs and bgm 🔥gripping drama, full-on fan service#Nagarjuna , #AmirKhan , #ShrutiHaasan good performances#CoolieReview https://t.co/rOOwObMkse— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252 Hands in 2 Pockets.. And 🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️@tollymasti #tollymasti#Coolie #CoolieFDFS #CoolieFromAug14 #Rajinikanth #CoolieReview— Tollymasti (@tollymasti) August 14, 2025 -
అవ్వ - బువ్వ.. ఏదీ తేల్చుకోలేకపోతున్నా: మంచు మనోజ్
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండూ ఒకేరోజు వస్తుండటంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సినీప్రియులు. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఇదే ఇరకాటంలో పడ్డాడు. 'అవ్వ కావాలా? బువ్వ కావాలా?'.. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా.. జోక్స్ పక్కనపెడితే కూలీ, వార్ 2.. ఒకేరోజు రిలీజవ్వడమనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకం. 20 మందిని తీసుకెళ్తా..రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే. మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏది ఫస్ట్ చూడాలని నిర్ణయించుకుంటాను. అంతేకాదు, మీ కామెంట్లలో నుంచి ర్యాండమ్‌గా 20 మందిని సెలక్ట్ చేసి నాతోపాటు మిమ్మల్ని కూడా సినిమాకు తీసుకెళ్తా.. మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. మాటిస్తున్నా అని ట్వీట్ చేశాడు. అలాగే వార్ 2 చిత్రయూనిట్‌కు, కూలీ మూవీ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. “Avva kavala, buvva kavala” ani adagadam lanti situation lo unnanu! 😄Jokes apart, what a historic day for Indian cinema 🎦 🙏🏼❤️🎸💥 #Coolie and #War2 releasing together. Wishing both these cinematic magics to become all-time blockbusters and roar across INDIA. Proud, crazy day… pic.twitter.com/hJBCmedeyx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 13, 2025 చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు! -
Coolie First Review: ‘కూలీ’పై డిప్యూటీ సీఎం రివ్యూ
మరికొన్ని గంటల్లో(ఆగస్ట్ 14) రజనీకాంత్ ‘కూలీ’(Coolie) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చాడు. ఇదొక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు. రేపు విడుదల కానున్న ‘కూలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ని బాగా ఎంజాయ్ చేశా. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని ఉదయనిధి ఎక్స్‌లో రాసుకొచ్చాడు.‘కూలీ’ విషయానికొస్తే..లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. I am truly delighted to congratulate our Superstar @rajinikanth sir on completing 50 glorious years in the film industry.Had the opportunity to get an early glimpse of his much-awaited movie #Coolie, releasing tomorrow. I thoroughly enjoyed this power-packed mass entertainer… pic.twitter.com/qiZNOj5yKI— Udhay (@Udhaystalin) August 13, 2025 -
బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారు: పూజా హెగ్డే
తమిళసినిమా: పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి పూజాహెగ్డే. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా హిందీ భాషల్లో నటిస్తున్నా ఈ అమ్మడికి క్రేజ్ తెచ్చిపెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమనే. అక్కడ వరుస పెట్టి హిట్ చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నారు. దీంతో టాలీవుడ్లో మార్కెట్ డౌన్ అయిపోయింది. అయితే ఈ బ్యూటీని కోలీవుడ్ రెండోసారి అక్కున చేర్చుకుంది. 13 ఏళ్ల క్రితం ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లోనే అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సంబరపడ్డారు. అయితే ఆ చిత్రం కూడా పూర్తిగా నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ కోలీవుడ్ ఈమెను వదులుకోలేదు ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించారు. ప్రస్తుతం మరోసారి విజయ్‌కు జంటగా జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాఘవ లారెన్స్‌తో కాంచన–4 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మధ్యలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. విశేషమేమిటంటే పూజాహెగ్డే ఇప్పటివరకు నటించిన ఏ చిత్రానికి రానటువంటి పాపులారిటీ ఈ ఒక్క పాటకే రావడం. కూలీ చిత్రం గురువారం అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి రానుంది. పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రత్యేక పాటలో నటించడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్లో తనను గ్లామర్‌డాల్‌గానే చూస్తున్నారన్నారు. బహుశా తెలుగు, తమిళ చిత్రాల్లో తను నటించడం వారు చూసి ఉండరేమో అని అన్నారు. తాను ఈ సమయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెట్రో చిత్రంలో తనను రుక్మిణీ కథాపాత్ర గానే మార్చారన్నారు. తనలోని నటనా ప్రతిభను ఆయన నమ్మారని పూజాహెగ్డే పేర్కొన్నారు. -
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
రజినీకాంత్ 'కూలీ' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికైతే 'వార్ 2'తో పోలిస్తే దక్షిణాదిలో ఈ సినిమాకే బోలెడు హైప్ ఉంది. టికెట్ బుకింగ్స్‌లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు హిట్ కొడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే 'కూలీ'కి ఇంత హైప్ ఏర్పడటానికి కారణం ఏంటి? ఇందులో నటించిన స్టార్స్ ఎవరికెంత పారితోషికం ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం.చాన్నాళ్లుగా సరైన హిట్ లేని రజినీకాంత్‌కి 'జైలర్' సక్సెస్ మంచి ఊపు ఇచ్చింది. దీంతో లోకేశ్ కనగరాజ్ చెప్పిన మాస్ యాక్షన్ స్టోరీకి రజినీ ఓకే చెప్పాడు. అలా 'కూలీ' సెట్ అయింది. అయితే ఈ మూవీలో రజినీ, నాగ్, ఆమిర్ ఖాన్.. ఇలా ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, అనిరుధ్ పాటలే చాలావరకు తెలుగులో బోలెడంత హైప్‌కి కారణమని చెప్పొచ్చు.సరే అసలు విషయానికొస్తే ఈ సినిమాని సన్ పిక్చర్స్ దాదాపు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అయితే ఇందులో సగం నటీనటుల పారితోషికాలకే అయిపోయింది. ఎందుకంటే హీరోగా చేసిన రజినీకాంత్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రూ.50 కోట్లు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా లోకేశ్.. తన పారితోషికం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్)ఇక విలన్‌గా చేసిన నాగార్జునకు రూ.20-24 కోట్లు, తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్‌కి రూ.20 కోట్లు.. కీలక పాత్రలు చేసిన సత్యరాజ్, ఉపేంద్రకు తలో రూ.5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో కీ రోల్ చేసిన శ్రుతి హాసన్ రూ.4 కోట్లు అందుకున్నట్లు టాక్. అలానే ఈ సినిమాకు అదిరిపోయే పాటలిచ్చిన అనిరుధ్‌కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా సగానికి పైగా బడ్జెట్ పారితోషికాలకే పోగా.. మిగిలిన మొత్తంతో సినిమాని నిర్మించినట్లు తెలుస్తోంది.'కూలీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళం నుంచి తొలి రూ.1000 కోట్ల సినిమా కాబోతుందని జోస్యాలు చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు నిజం కాబోతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. గురువారం(ఆగస్టు 14) ఉదయం 6-7 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలో పడనున్నాయి. ఇప్పటికే టికెట్స్ ఆన్ లైన్లో పెట్టగా బాగానే సేల్ అవుతున్నాయి. మరి ఈ 'కూలీ'.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!) -
రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!
రజినీకాంత్ నటించిన కూలీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో విపరీతమైన క్రేజ్ వస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ కొద్ది నిమిషాల్లోనే బుక్కైపోతున్నాయి. తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇవాళ తెలంగాణలోనూ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా అదే దాదాపు అదే పరిస్థితే. రిలీజైన నిమిషాల్లోపే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా బుకింగ్ కోసం ఎగబడ్డారు. బుక్‌మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌లోనూ కూలీ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తెలంగాణలో అయితే ఎలాంటి టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కంటే ముందుగా అదనంగా ఒక్క షోకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ మూవీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సైతం అదే రోజు విడుదలవుతోంది.Telangana Bookings Open Now!💥🍿🌟Book your tickets now: https://t.co/vFx0Jf1W9g#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/cT2jrHZv9c— Sun Pictures (@sunpictures) August 12, 2025 -
‘కూలీ’ కోసం హాలీడే, ఫ్రీ టికెట్.. ఇది కదా రజనీ క్రేజ్!
రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ సంబరాలు మొదలవుతాయి. జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో రజనీకాంత్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఇండియాలో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాక అంతటా ఆయనకు అభిమానులు ఉన్నారు. తొలి రోజు ఆయన సినిమా చూసేందుకు వేలల్లో ఖర్చు పెట్టిమరీ టికెట్ కొనేవాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా రిలీజ్ రోజు చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీస్‌కి సెలవు పెడతారు. బాస్‌కి ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజు ఆఫీస్‌కి డుమ్మా కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా ఎందుకు అనుకుందో ఏమో కానీ..ఓ కంపెనీ ఏకంగా తమ ఉద్యోగస్తులకు హాలీడేనే ప్రకటించింది. (చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)సౌత్‌తో పాటు ఇండియా వ్యాప్తంగా పలు బ్రాంచ్‌లు కలిగి ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ రజనీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’(Coolie Movie) రిలీజ్ రోజు(ఆగస్ట్ 14) తమ ఉద్యోగులకు వేతనంతో కూడా సెలవును ప్రకటించింది. అంతేకాదు రిలీజ్ రోజు తమ ఎంప్లాయిస్‌కి ఉచితంగా టికెట్‌ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో పాటు రజనీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్‌ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కంపెనీపై తలైవా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.(చదవండి: రెమ్యునరేషన్‌తో ఆర్ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్)కూలీ విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి.As usual Holiday being declared for offices as COOLIE releasing 😂🫨🦖🔥 pic.twitter.com/pj54B8uqA2— Hello (@RockinggRAJINI) August 9, 2025 -
రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్
రజినీకాంత్ 'కూలీ' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో జోరుగా బుకింగ్స్ సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా టికెట్ రేట్ల పెంపు జీవో రావాల్సి ఉంది. అయితే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. తమిళనాడు నుంచి ఈ రికార్డ్ సృష్టించిన తొలి సినిమాగానూ నిలిచింది.రజిని సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లోని కొన్ని దేశాల్లో కాస్త బజ్ ఉంటుంది. కానీ 'జైలర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హీరో చేసిన మాస్ మూవీ కావడం, దానికి లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్.. ఇలా చాలా ఎలిమెంట్స్ కారణంగా హైప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించి, పోస్టర్ విడుదల చేసింది.(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ పరమేశ్వరన్)అప్పట్లో రజినీ 'కబాలి' రిలీజ్ టైంలో చాలా హడావుడి నడిచింది. ఇదే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ 1.6 మిలియన్ డాలర్స్ వరకు వచ్చాయి. తర్వాత చాలా తమిళ చిత్రాలు వచ్చాయి కానీ ఏవి కూడా ఈ మార్క్‌ని అందుకోలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు రజినీకాంత్ తన 'కూలీ'తో ఈ నంబర్ దాటేశారు. చూస్తుంటే తొలిరోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ నంబర్స్ నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది.'కూలీ'లో రజినీకాంత్‌కి హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. నాగార్జున విలన్ కాగా సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. 'కూలీ, 'వార్ 2'తో తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?) -
ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?
మరో రెండు రోజుల్లో రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఎవరెంత చెప్పినా సరే ఇవి స్ట్రెయిట్ మూవీస్ కావు. కాకపోతే రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ పుణ్యమా అని 'కూలీ' చిత్రానికి.. తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ అని 'వార్ 2'కి తెలుగులో రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. అలా అని మన దగ్గర ఏమైనా తక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతారా అంటే లేదు. ఇప్పుడీ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?'కూలీ' సినిమాకు చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లో ఈ మూవీ టికెట్ గరిష్ఠ ధర రూ.183 నిర్ణయించారు. కానీ హైదరాబాద్‌లో ఇదే గ్రూప్ మల్టీప్లెక్స్‌లో రూ.350 నుంచి రూ.453 మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో జీవో రాబోతుంది. 'కూలీ'కి మాత్రమే కాదు 'వార్ 2'కి కూడా దాదాపు ఇదే ధరలు ఉండనున్నాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ కంటే మన దగ్గర రిలీజయ్యే డబ్బింగ్ వెర్షన్‌కే ఎందుకింత ఎక్కువ టికెట్ రేట్లు?(ఇదీ చదవండి: ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!)తెలుగు ప్రేక్షకులు.. ఏ భాష సినిమా అయినా సరే బాగుంటే చాలు చూసేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ఈ విషయాన్ని గ్రాంటెడ్ తీసుకుంటే.. రాబోయే రోజుల్లో నష్టపోయేది నిర్మాతలే. ఎందుకంటే 'బంగారు బాతు గుడ్డు' కథ మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పటితో పోలిస్తే చాలా తగ్గించేశారు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల టికెట్ ధరలు కూడా ఒరిజినల్ కంటే ఎక్కువగా పెడితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు గడ్డుకాలం గ్యారంటీ!ప్రేక్షకుడు ఎప్పుడూ కోరుకునేది ఒకటే. సినిమా బాగుండాలి. టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి. నిర్మాతలు ఈ విషయం గుర్తుంచుకుని.. అందుకు తగ్గ మూవీస్ తీస్తే చాలు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అలా కాదని వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలని ఆశపడితే ప్రస్తుతానికి పర్లేదు కానీ రాబోయే రోజుల్లో అంతే సంగతులు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
ఆ విషయంలో గెలుపు నాగార్జునదే.. టాలీవుడ్ చరిత్రలో తొలిసారి!
అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni ) అకస్మాత్తుగా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా వైరల్‌గా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా నటించిన కూలీ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ లాంచ్ అయి సూపర్ డూపర్ హిట్ అంచనాలను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ టీజర్లో నాగార్జున లుక్ బాగా క్లిక్ అయింది. నాగార్జున తన సినీ జీవితంలో తొలిసారిగా విలన్ గా నటిస్తుండడం దక్షిణాది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకు తగ్గట్టే నాగార్జున రోల్ అత్యంత స్టైలిష్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుండడం కూడా నాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. నిజానికి ఈ సినిమా లో విలన్ పాత్ర ను ఎంచుకోవడం పట్ల మొదట్లో నాగ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారనేది నిర్వివాదం. అయితే తాజా అప్ డేట్స్‌తో వారిలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది.ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తన వయసులో సగం తగ్గిపోయినట్టు కనపడ్డారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని నాగ్ స్వయంగా చెప్పడం, తాను నాగార్జున అభిమానినని లోకేష్ అనడం... కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రీ రిలీజ్లో నాగ్ లుక్, ఆయన మాటలు ఆయన గురించి తలైవా రజనీ కాంత్ పొగడ్తలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్లో నాగార్జున తన హెయిర్‌ని కుడి చేత్తో వెనక్కి తోస్తున్న బిట్‌ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఏతావాతా కూలీ సినిమా విడుదలకు ముందే ఒక విషయం మాత్రం రూఢీ అయిపోతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అనూహ్యంగా ఉండబోతోందని. రజనీకాంత్ లాంటి వీర మాస్ హీరోకి సమ ఉజ్జీగా ఆయన తెరపై విలన్ రోల్లో దుమ్మురేపనున్నారని.ఈ నేపధ్యంలో మరోసారి సీనియర్ హీరోల పాత్రల ఎంపిక ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో పాటు ఆయన సమకాలీకులు ఒకనాటి అగ్ర హీరోలు ముగ్గురు ఇంకా ఫుల్ యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరెవరూ సాహసించని రీతిలో నాగార్జున తన పాత్రల ఎంపికను అమాంతం మార్చుకుని ఈ విషయంలో అందర్నీ దాటేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున గ్లామర్‌తో పోటీపడే వారు ఎవరూ లేరనేది నిజం. అయినప్పటికీ వయసుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించి, కూలీ లో ఏకంగా విలన్ పాత్రకు కూడా సై అనడం ద్వారా ఒక నటుడికి సినిమా కలెక్షన్లు, ఇమేజ్‌లు మాత్రమే కాదు వైవిధ్య భరిత పాత్రల్లో నటించానన్న తృప్తి కూడా చాలా అవసరమని చెప్పకనే చెప్పారు. నిన్నే పెళ్లాడుతా తో గ్రీకు వీరుడి ఇమేజ్ తెచ్చుకుని వెంటనే అన్నమయ్య లాంటి పాత్ర చేసిన నాటి దమ్మూ ధైర్యం, తెగువనే ఇప్పటికీ చూపిస్తున్నారు నాగార్జున. అందుకే.. టాలీవుడ్ చరిత్ర లో తొలిసారిగా... సినిమా విడుదల కాకముందే జనం మనసులు గెలిచిన విలన్ అనిపించుకుంటున్నారు. -
రజినీకాంత్ వీరాభిమాని.. హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?
తలైవా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ అవైటేడ్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. కేరళ ఫ్యాన్స్ ఏకంగా థియేటర్లకు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే తలైవాకు ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తమిళనాడులో అయితే ఆయనంటే పడిచచ్చేంత అభిమానులు ఉన్నారు. అంతే కాదండోయ్ ఆయనకు ఏకంగా గుడినే కట్టేశారు. 2023లో మధురైకి చెందిన కార్తీక్ ఇంటి పక్కనే రజినీకాంత్‌కు ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 250 కేజీల బరువైన రజినీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి అరుల్మిగు శ్రీ రజినీ టెంపుల్ అని నామకరణం చేశారు.తాజాగా ఈ వీరాభిమాని రజినీకాంత్ విగ్రహానికి పూజలు చేశారు. ఆయన విగ్రహానికి పాలు, నెయ్యితో అభిషేకం నిర్వహించారు. సూపర్ స్టార్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆలయంలో దాదాపు 5500 పోస్టర్లతో అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానం అంటే కేవలం సినిమాలు చూడడమే కాదు.. ఇలా ఏకంగా గుడి కూడా కట్టించే ఫ్యాన్స్ ఉన్నారంటే విశేషమే.కాగా.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ.. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ 'వార్-2తో పోటీ పడనుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజవుతున్నాయి. కూలీ మూవీకి సంబంధించి కేరళలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.#WATCH | Madurai, Tamil Nadu: A die-hard fan of Rajinikanth, Karthik celebrated 50 years of the superstar by adorning the Arulmigu Sri Rajini Temple, a temple dedicated to Rajinikanth, with over 5,500 photos of the superstar and performing abhishekam. (07.08) pic.twitter.com/bYDN2wZUYS— ANI (@ANI) August 8, 2025 -
కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున బిగ్ సర్ప్రైజ్!
అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.4కెలో శివ ..అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది. శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ప్లాన్‌తో వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు.కూలీ థియేటర్లలో ట్రైలర్..అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ రోజే నాగార్జున్ ఈ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ రీ రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు.Hey @iamnagarjuna CONGRATS to #ShivaTeam ,and all your FANS #Shiva4KDolbyAtmos https://t.co/6zfsam7uvr— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2025 -
రజిని ఫ్యాన్స్ ని భయపెడుతున్న Coolie
-
'వార్2'కు పోటీగా 'కూలీ'.. హిందీలో ఆమిర్ బిగ్ ప్లాన్
తమిళంలో విడుదల కానున్న ' కూలీ ' సినిమా హిందీ రిలీజ్ పంపిణీ వ్యవహారాల్లో ఆమిర్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఎకెపి) ప్రతినిధి స్పందించారు. హీందీలో కూలీ సినిమా పంపిణీ వ్యూహంలో ఆమిర్ ఖాన్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఖాన్ అతిధి పాత్రలో మాత్రమే నటిస్తున్నారని తన టీమ్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో కూలీ సినిమా పంపిణీ విషయంలో ఖాన్, అతని టీమ్ నుంచి ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. మిస్టర్ ఖాన్ ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌కు ఎటువంటి కాల్స్ చేయలేదని తెలిపారు.వార్2 సినిమాకు పోటీగా దేశవ్యాప్తంగా కూలీ ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని ఆమీర్ ప్లాన్ చేశాడని, ఈ క్రమంలోనే PVR-Inox CEO అజయ్ బిజ్లీకి నేరుగా ఫోన్ చేసినట్లు ఒక వార్త వైరల్ అయింది. అంతే కాకుండా కూలీ మూవీ కోసం ప్రైమ్ స్లాట్లను ఆయన కోరినట్లు చెప్పుకొచ్చారు. వార్2ను దెబ్బకొట్టేందుకే ఆమీర్ ఇలాంటి ప్లాన్ చేస్తున్నారని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో నేరుగా అమీర్ టీమ్ రంగంలోకి దిగింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపింది.కూలీ చిత్రంలో అతిధి పాత్రలో నటించాలని కోరినప్పుడు ఆమీర్ వెంటనే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్, రజనీకాంత్‌తో ఆయనకున్న బంధానికి ఇదొక నిదర్శనమని క్లారిటీ ఇచ్చారు. కూలీ, వార్2 రెండు చిత్రాలు ఆగష్టు 14న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అరుణాచలం శివున్ని దర్శించుకున్న లోకేశ్ కనగరాజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూలీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.కూలీ రిలీజ్‌కు ముందు దర్శకుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలయంలో లోకేశ్‌ను చూసిన పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ కనగరాజ్ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు.రజినీకాంత్ హీరోగా నటించిన కూలీలో నాగార్జున విలన్‌గా కనిపిచనున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2తో పోటీ పడనుంది. திருவண்ணாமலை அண்ணாமலையார் கோயிலில் சாமி தரிசனம் செய்த #lokeshkanagaraj #coolie #coolieunleashed #rajinikanth #thiruvannamalai #nagarjuna #aamirkhan #soubinshahir #upendra #anirudhravichander #anirudh #kalanithimaran #sathyaraj #shruthihaasan #powerhouse #monica #disco… pic.twitter.com/Sj9rN7YRIh— Cineulagam (@cineulagam) August 7, 2025 -
'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా తలపై జుట్టు ఊడిపోయింది.. నాగార్జున మాత్రం: రజనీకాంత్
రజినీకాంత్‌లో కాస్త హస్య చతురత ఎక్కువే. సినిమా ఈవెంట్స్‌లో మాట్లాడుతూ తనపై తానే జోకులు వేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌లో సోమవారం.. 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రుతిహాసన్, నాగార్జున, సత్యరాజ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పాల్గొన్నారు. రజినీకాంత్ మాత్రం వీడియో బైట్ రూపంలో మాట్లాడారు. అయితే నాగ్ ఫిజిక్ గురించి చెబుతూ రజినీకాంత్ తన బట్టతల గురించి జోకులు వేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.'తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను నటించిన 'కూలీ' ఆగస్టు 14న రిలీజ్ కానుంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్. ఈ చిత్రంలో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. అసలు 'కూలీ' సబ్జెక్ట్ విన్న వెంటనే సైమన్ పాత్ర నేనే చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురుచూశాను. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. నాగార్జునని ఈ పాత్ర కోసం తీసుకున్నామని లోకేశ్ చెప్పగానే ఆశ్చర్యపోయాను. చాలా సంతోషంగా అనిపించింది'(ఇదీ చదవండి: రూ. 2 కూలీ ఇచ్చి స్నేహితుడే అవమానించాడు: రజనీకాంత్)'నాగార్జున.. డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు విలన్‌గా చేయాల్సిన అవసరం లేదు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఓ సినిమా చేశాం. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. నా జుట్టు ఊడిపోయింది. నాగార్జునతో పనిచేస్తుండగా.. మీ ఆరోగ్యం రహస్యం ఏంటి అని అడిగా. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోని ఎలానో కూలీ-సైమన్ అలా ఉంటుంది' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న 'కూలీ' ట్రైలర్ శనివారమే రిలీజ్ చేశారు. కానీ ఇది కాస్త నిరారపరిచిందనే చెప్పొచ్చు. మరీ హై మూమెంట్స్ అయితే ఏం కనిపించలేదు. సినిమాలోనే ఏమైనా సర్ప్రైజులు ఉంటాయేమో చూడాలి? అదే రోజుల రిలీజ్ కానున్న ఎన్టీఆర్ 'వార్ 2' పోలిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 'కూలీ'కే ఎక్కువ హైప్ ఉంది. (ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)Superstar @rajinikanth garu shares a heartfelt message with all the lovely Telugu audience and talks about his experience working on #Coolie ❤️🔥❤️🔥#CoolieFromAug14 @iamnagarjuna #AamirKhan @Dir_Lokesh @anirudhofficial @sunpictures #TeluguFilmNagar pic.twitter.com/OP1ozqM98G— Telugu FilmNagar (@telugufilmnagar) August 4, 2025 -
రూ. 2 కూలీ ఇచ్చి స్నేహితుడే అవమానించాడు: రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితాన్ని ఒక సినిమాగా తెరకెక్కిస్తే బ్లాక్‌బస్టర్ సినిమా అని చెప్పవచ్చు. తలైవా గతం అంతా కష్టాలతోనే నిండి ఉందని అందరికీ తెలుసు.. ఎన్నో ఆటుపోట్లతో పాటు అవమానాలు భరించి నేడు ఆయన ఈ స్థానంలో ఉన్నారు. బస్ కండక్టర్‌గా, కార్పెంటర్ గా కూడా పనిచేశారు. రజనీకాంత్ నటించిన కొత్త సినిమా 'కూలీ' విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకున్నారు. తన కుటుంబం కోసం ఒకసారి కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, తాను ఎదుర్కొన్న హేళనను గుర్తుచేసుకున్నారు.సినీ పరిశ్రమకు రాకముందు తాను కూలీగా కూడా పనిచేశానని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. 'కాలేజీ రోజులు పూర్తి అయిన తర్వాత ఒకరోజు నేను రోడ్డుపై ఉండగా.. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి పిలిచాడు. తన లగేజ్‌ను కారు వరకు తీసుకెళ్తావా అని అడిగాడు. దీంతో నేను కూడా సరేనన్నాను. అతని మాటలు నాకు చాలా పరిచయంగా ఉన్నట్లు అనిపించింది. కొంత సమయం తర్వాత మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నట్లు అర్థం అయింది. కాలేజీ రోజుల్లో అతన్ని సరదాగా ఏడ్పించేవాడిని. అయితే, లగేజ్‌ను కారు వద్దకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ. 2 చేతిలో పెడుతూ ఒక మాటన్నాడు. మనం చదువుకుంటున్న రోజుల్లో నీకు చాలా అహంకారం ఉండేదన్నాడు. అంత అహంకారంతో ఎవరూ ఉండేవారు కాదన్నాడు.. ఆపై నీకు ఆరోజులు గుర్తుకున్నాయా..? అన్నాడు. దీంతో మొదటిసారి జీవితంలో ఏడ్చాను. నేను కూలీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను.నేను జీవించడానికి అలాంటి చిన్న చిన్న పనులు ఎన్నో చేశాను. నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇదంతా చేశాను. పేదరికం అంటే ఏమిటో నాకు మాత్రమే తెలుసు.. దానిని చూడటం, వివనడం ద్వారా కాదు. అనుభవించడం ద్వారానే తెలుసుకున్నాను.' అని పేర్కొన్నారు. ఒకప్పుడు డబ్బు కష్టాల వల్ల కార్పెంటర్‌గా, బస్ కండక్టర్‌గా రజనీ పనిచేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నిరాశల వల్ల తీవ్రంగా బాధపడ్డారు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా రజనీ నిర్ణయించుకున్నారట, అయితే, తనకు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పెయింటింగ్ ఒకటి కనిపించడం.. అందరూ అక్కడ నమస్కరించి వెళ్తుండటంతో తనలోని ఆధ్యాత్మిక మార్పుకు తొలి అడుగు అక్కడే పడిందట. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగిందని రజనీ చెప్పుకొచ్చారు. -
విలన్‌గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్
రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కూలీ. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను లోకేష్ కనకరాజ్ నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చెన్నైలో తాజాగా జరిగిన ఈ సినిమా వేదికపై నటుడు నాగార్జున మాట్లాడుతూ.. కూలీ చిత్రాన్ని భాషా సినిమాతో పోల్చారు. ఏకంగా వంద 'బాషా' సినిమాలతో సమానంగా కూలీ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశారు. రజనీకాంత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఓజి అని నాగ్ తెలిపారు. ఆపై రజనీకాంత్ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ ‘అబ్బా ఏం కలర్, ఏం స్కిన్, హాయ్ అని అలాగే చూస్తుండి పోయాను. నాకు జుత్తు అంతా ఊడిపోయింది. మీ సీక్రెట్ ఏమిటని నాగ్‌ను అడిగాను. అందుకు ఆయన ఏమీ లేదు శారీరిక కసరత్తులే చెప్పారు’ అని తెలిపారు.విలన్‌గా నాగ్ ఎందుకు చేశారంటే..కూలీ చిత్రంలో విలన్‌గా నాగార్జున నటించడానికి కారణం ఒక సినిమా డైలాగ్ అంటూ రజనీకాంత్ ( Rajinikanth) ఇలా చెప్పారు.' వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంబ్లర్' చిత్రంలో అజిత్ చెప్పిన ఒక డైలాగ్ 'ఎంతకాలం మంచివాడిగా నటించేది' మాదిరి నాగార్జున కూడా ఈ చిత్రంతో విలన్‌గా మారారు. కమలహాసనే ఆశ్చర్యపడేలా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. నా విజయం రహస్యం శ్రమ మాత్రమే కాదు. భగవంతుడి ఆశీస్సులు కూడా.. నేను బస్ కండక్టర్‌గా పని చేస్తున్నప్పుడు మిత్రుడు ఒకరు బంగారు చైన్ ఇచ్చి సినిమాల్లో నటించమని చెప్పారు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ధనం, పేరు ఉన్నా, ఇంట్లో ప్రశాంతత, బయట గౌరవం లేకపోతే ఏది లేదు.' అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర, పలువురు చిత్ర ప్రముఖులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
రజినీకాంత్ కూలీ.. అమిర్ ఖాన్ మేకోవర్ వీడియో చూశారా?
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమిర్ ఖాన్ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అమిర్ ఖాన్ మేకోవర్ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు అమిర్ ఖాన్. శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సైతం చేతి నిండా పచ్చబొట్టుతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025 -
ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు
ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి నటీనటులు చాలామంది నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ల దగ్గర నుంచి షూటింగ్ జరిగే సమయంలో సదుపాయాల వరకు నిర్మాతని చాలానే ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే వీటి గురించి చెప్పుకొంటే మళ్లీ ఎక్కడ సినిమా సమస్యల్లో పడుతుందోనని నిర్మాతలు సైలెంట్‌గా ఊరుకుంటున్నారు. అలాంటిది 'కూలీ' ప్రొడ్యూసర్ కళానిధి మారన్ మాత్రం కుండ బద్దలు కొట్టేశారు. కొందరు హీరోల నిజస్వరూపం గురించి చెప్పి, సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శనివారం సాయంత్రం చెన్నైలోని జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత కళానిధి మారన్.. 'ఈ రోజుల్లో కొందరు సక్సెస్ఫుల్ యాక్టర్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. రెండు హిట్స్ పడగానే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొందరైతే ప్రైవేట్ జెట్స్ అడుగుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. దేశంలోని ఒకే ఒక్క సూపర్‌స్టార్ ఈయనే' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ‘ఢీ’ కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు, అరెస్ట్!)రజినీకాంత్ గురించి నిర్మాత చెప్పడం, ఆయన ఎలివేషన్లు ఇవ్వడం బాగానే ఉంది. మరి కళానిధి మారన్.. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరి హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈయన వాళ్ల గురించి చెప్పారా? లేదా జనరల్‌గా ఇండస్ట్రీలో హీరోల తీరు గురించి చెప్పారా అనేది సస్పెన్స్.'కూలీ' విషయానికొస్తే రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. శనివారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాకపోతే పెద్దగా హై అనిపించలేదు. కానీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంపై హైప్ గట్టిగానే ఉంది. మరి ఆగస్టు 14న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్‌లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్‌లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్‌ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్
చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్‌ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం.లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. -
రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఇప్పుడొచ్చిన ట్రైలర్, ఉన్న హైప్‌ని మరింత పెంచేలా ఉంది. రజనీ మాస్ షాట్స్, అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ ఈసారి మరింత మాస్ మూవీతో రాబోతున్నాడని ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)ఈ సినిమా అంతా వాచీల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇందులో రజినీకి విలన్‌గా నాగార్జున నటించారు. వీళ్లతో పాటు ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి) -
రజినీకాంత్ కూలీ అప్డేట్.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.తాజాగా కూలీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రజినీకాంత్ పోస్టర్‌ను షేర్ చేస్తూ సెన్సార్ తమకు ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K— Sun Pictures (@sunpictures) August 1, 2025 -
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. పవర్‌హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)కాగా.. కూలీ ట్రైలర్‌ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
అనిరుధ్ ఫైనల్ సంగీత కచేరి.. వివరాలు ఇవే
సంగీత దర్శకుడిగా దక్షిణాదిని దున్నేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ , జైలర్–2 చిత్రంతో పాటు కింగ్డమ్ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కింగ్డమ్, కూలీ చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్లాయి. రాక్‌స్టార్ అనిరుధ్ మరో పక్క సంగీత కచేరీలతోనూ దుమ్ము రేపుతున్నారు. ఈయన ఇప్పటికే పలు దేశాలలో హుకుమ్ చెన్నై ఇసై(సంగీతం) పేరుతో సంగీత కచేరీలను నిర్వహించారు. ఫైనల్‌గా ఆగస్టు 23వ తేదీన చెన్నైలో సంగీత కచేరీని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనిరుధ్ జైలర్ చిత్రంలో రజనీకాంత్ చెప్పిన హుకుమ్ అనే డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అదే పేరుతో అనిరుధ్ హుకుమ్ చెన్నై ఇసై పేరుతో సంగీత కచేరీలను నిర్వహిస్తున్నారు. చెన్నై అభిమానుల కోరిక మేరకు ఇప్పుడు స్థానిక సముద్ర తీరంలోని కూవంరూర్ ప్రాంతంలో ఉన్న మార్గ్ స్వర్ణభూమి ప్రాంతంలో భారీ ఎత్తున సంగీత కచేరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది ఇంత వరకూ చెన్నై సంగీత ప్రియులు కనీవినీ ఎరుగనటువంటి రీతిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంగీత కచేరీకి సంబంధించిన పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయని అనిరుధ్ తెలిపారు. అదే విధంగా ఆగస్టు 4వ తేదీ నుంచి టిక్కెట్ల విక్రయం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
'విలన్‌గా నాగార్జున.. అసలు ఎలా ఒప్పించారు': లోకేశ్ సమాధానం ఇదే
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం కూలీ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో డైరెక్టర్ లోకేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో నాగార్జునను విలన్‌గా ఎంపిక చేయడంపై ప్రశ్న ఎదురైంది. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీసే నాగార్జునను విలన్‌గా ఎలా తీసుకున్నారని లోకేశ్‌ను ప్రశ్నించారు. దీని వెనుక కారణాలను లోకేశ్ వివరించారు. తాను నాగార్జున సార్‌కు వీరాభిమానిని అని లోకేశ్ తెలిపారు. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని అన్నారు. విలన్‌గా ఒప్పించేందుకు చాలా రోజులు పట్టిందని ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ..' నేను కాలేజీకి వెళ్లే రోజుల్లోనే నాగార్జున సినిమాలు చూసేవాడిని. ఆయన నటించిన రక్షకుడు మూవీ తన ఫేవరేట్. ఆ సినిమాలో నాగ్ హెయిర్ స్టైల్ లుక్ తనను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అదే స్టైల్లో కటింగ్ చేయించుకున్నా. శివ మూవీ కూడా చాలాసార్లు చూశా. గీతాంజలి, అన్నమయ్య లాంటి చిత్రాలకు ఫిదా అయిపోయా. కూలీ సినిమా కోసం నాగార్జునను ఒప్పించడం కోసం చాలా కష్టపడ్డాం. ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండని అడిగాను. దాదాపు ఏడుసార్లు నాగార్జున వెంటపడ్డాకే నాగ్ సార్ ఒప్పుకున్నారు.' అని తెలిపారు.RB: నాగార్జున ని విలన్ గా ఎందుకు అనుకున్నావు ఫ్యామిలీ మూవీస్ తీసేవాడు కదా Lokesh: నేను నాగార్జున సార్ కి పెద్ద ఫ్యాన్ ని నా కాలేజ్ డేస్ లో రక్షకుడు సినిమా చూసి ఫంక్ హైర్ స్టైల్ ఫాలో అయ్యే వాడిని శివ అంటే ఇష్టం pic.twitter.com/QaVjYE7kqO— Яavindra (@Nag_chay_akhil) July 24, 2025 -
రజనీకాంత్‌గారిని విలన్‌గా చూపించాలనుకున్నా!: దర్శకుడు లోకేశ్ కనగరాజ్
రజనీకాంత్‌ను ఓ పవర్ఫుల్ విలన్‌గా చూపించే ప్రయత్నం మిస్ అయ్యిందని అంటున్నారు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. నాగార్జున, శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘కూలీ’ సినిమా ప్రయాణం గురించి లోకేశ్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘కూలీ’ సినిమా కంటే ముందు రజనీకాంత్‌గారికి ఓ పెద్ద కథ చెప్పాలనుకున్నాను. అందులో రజనీకాంత్‌గారిది విలన్ పాత్ర. మిగతా లీడ్ రోల్స్ హీరో పాత్రల మాదిరిగా ఉంటాయి. అయితే ఈ సినిమా నేను చేయడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. రజనీకాంత్‌గారు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నా సినిమా కోసం ఆయన రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేయడం నాకు ఇష్టం లేదు.అదే సమయంలో నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ సినిమాను వద్దనుకుని, ‘కూలీ’ సినిమా కథ చెప్పగా, రజనీకాంత్ గారు ఓకే చేశారు. అలా ఆయనతో ‘కూలీ’ సినిమా చేయడం జరిగింది. అయితే నా ‘ఎల్సీయూ’ (లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ‘కూలీ’ భాగం కాదు. అలాగే ‘కూలీ’ సినిమాలో ఓ మంచి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఈ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఇక ‘కూలీ’ సినిమా తర్వాత లోకేశ్ డైరెక్షన్లో ‘ఖైదీ 2’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్. ఇంకా కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ వంటి సినిమాలు లైనప్‌లో ఉన్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు లోకేశ్. -
'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?
కూలీ సినిమా (Coolie Movie)కు బాగా హైప్ తెచ్చిన సాంగ్ మోనికా. పూజా హెగ్డే (Pooja Hegde) వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవుతోంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అని అందరూ ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది. అయితే శివరాత్రిరోజే ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట! అందులోనూ ఆరోజు పూజాకు ఉపవాసం. అయినా సరే ఖాళీ కడుపుతోనే సెట్లోకి అడుగుపెట్టి ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసింది. తన కష్టానికి ప్రతిఫలంగా మోనికా సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.ఫస్ట్ ఆయన్నే అనుకున్నా..అయితే ఈ సాంగ్‌లో పూజాతోనే పోటీపడుతూ స్టెప్పులేశాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. తొలిసారి ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో సౌబిన్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ నోరెళ్లబెట్టారు. నిజానికి సౌబిన్ స్థానంలో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఉండాల్సిందట! ఈ విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా వెల్లడించాడు. ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్.. ఫహద్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాసినట్లు తెలిపాడు. బిజీగా ఉండటంతో..తీరా ఫహద్‌ను సంప్రదించగా.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాడు. అందువల్లే సౌబిన్ను ఎంపిక చేశామని వెల్లడించాడు. లోకేశ్ డైరెక్ట్ చేసిన కూలీ మూవీలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించాడు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత -
నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు రెమ్యునరేషన్!
స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే బాక్సాఫీస్ వద్ద యుద్ధం మొదలు కానుంది. ఆగస్టు 14న రజనీకాంత్ 'కూలీ' (Coolie Movie), హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల 'వార్ 2'చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వార్‌లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ విషయానికి వస్తే ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ.350 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఆయన పారితోషికం గురించి చెప్పలేనుహీరో రజనీకాంత్ రూ.150 కోట్లు, దర్శకుడు లోకేశ్ రూ.50 కోట్లు రెమ్యునరేషన్ (Lokesh Kanagaraj Salary) తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ.. రజనీకాంత్ సర్ పారితోషికం గురించి నేనేం చెప్పలేను. అయితే మీరు అంటున్నట్లుగా నేను రూ.50 కోట్లు తీసుకుంటున్నాను. నా గత సినిమా లియోకు తీసుకున్నదానికంటే ఇది రెట్టింపు రెమ్యునరేషన్. అందుకే డబుల్ తీసుకుంటున్నా..లియో సినిమా రూ.600 కోట్లకు పైగానే వసూలు చేసింది. కాబట్టి నేను గత సినిమాకంటే డబుల్ పారితోషికం తీసుకుంటున్నాను. ఇది నా రెండేళ్ల జీవితం. అన్నింటినీ త్యాగం చేసి రెండేళ్లుగా కూలీకే అంకితమయ్యాను, అది నా బాధ్యత కూడా అని పేర్కొన్నాడు. కూలీ మూవీ విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌంబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందించాడు.చదవండి: ‘బాహుబలి’ రీరిలీజ్: రన్‌టైమ్‌పై పుకార్లు.. రానా ఏమన్నారంటే..? -
'మోనికా' పాటతో ట్రెండింగ్‌లో పూజా హెగ్డే (ఫొటోలు)
-
మోనికా సాంగ్.. డ్యాన్స్‌తో డామినేట్ చేసిన నటుడు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా (Coolie Movie)పై భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు భాగం కావడంతో కూలీ మూవీ గురించి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించిన మోనికా అనే ఐటం సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే అందంతో, డ్యాన్స్‌తో అదరగొట్టింది. అప్పుడు జిగేలు రాణి.. ఇప్పుడు మోనికాఇలా స్పెషల్ సాంగ్స్ చేయడం పూజకు కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం మూవీలో జిగేలురాణి పాటకు సూపర్‌గా డ్యాన్స్ చేసింది. ఎఫ్ 3 మూవీలోనూ లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె కనిపించిన చివరి సినిమా అదే! ఇటీవల తమిళ రెట్రో మూవీలో కథానాయికగా అలరించింది. కన్నిమా పాటకు ఎక్స్ప్రెషన్, గ్రేస్‌తో అదరగొట్టేసింది. ఇప్పుడు కూలీలో మోనికాగా సెన్సేషన్ సృష్టిస్తోంది. దడదడలాడించిన సౌబిన్అయితే ఈ పాటలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) పూజానే డామినేట్ చేస్తున్నాడు. హీరోయిన్‌తో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు. మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్‌లో యాక్ట్ చేశాడు. ఇప్పుడు మోనికా పాటలో సింపుల్ లుక్‌లోనే సూపర్ స్టెప్పులేస్తూ ఫుల్ హైలైట్ అవుతున్నాడు. స్పెషల్ సాంగ్‌లో సౌబిన్‌తో స్టెప్పులేయించాలన్న ఆలోచన రావడమే గ్రేట్ అంటూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు. చదవండి: 'బిగ్‌బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆమె కూడా! -
'కూలీ' నుంచి మోనికా.. స్పెషల్ సాంగ్ రిలీజ్
సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్‌లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్‌ఫుల్‌గానే ఉంది.(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్‌పై చాలా కోపం.. నన్ను వేస్ట్ చేశాడు: సంజయ్ దత్)ఈ పాటని వైజాగ్ పోర్ట్‌లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న 'కూలీ'లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ) -
శ్రుతీహాసన్ షాకింగ్ నిర్ణయం.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్(Shruti Haasan) ఒకరు. సినిమా అప్డేట్స్తో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఇన్‌స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్‌కి తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్‌ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.రజినీకి భారీ పారితోషికం..ఈ మూవీ బడ్జెట్‌తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.#Chikitu 💃🕺 - https://t.co/TcCvuNmTSE#Coolie #CoolieFirstSingle Superstar @rajinikanth in a @Dir_Lokesh directorial 💥 @sunpictures ⚡️With the legendary TR sir, the genius @Arivubeing and thank you @iamSandy_Off for making us dance🙏🏻#Coolie releasing worldwide August… pic.twitter.com/KGjY2S3v8g— Anirudh Ravichander (@anirudhofficial) June 25, 2025 -
పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున
నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్‌తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్‌గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్‌లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్‌లో చూడొచ్చేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) #Nagarjuna: Coolie Vs Kubera #Coolie: Lokesh is larger than life Filmmaker🔥. Loki says Walk in like a Tiger, people should scared with ur Look🐯👿#Kubera: Sekhar is very realistic filmmaker🫶. Director says you are waking like a Hero bring it down😀 pic.twitter.com/lVkVCkYE1r— AmuthaBharathi (@CinemaWithAB) June 13, 2025 -
స్టార్ హీరోతో 'లోకేష్ కనగరాజ్' కొత్త సినిమా ప్రకటన
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్‌లో విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు.ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్‌తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు. అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్‌హీరో జానర్లో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని ఆమిర్ ఖాన్ సూచించారు.‘పీకే 2’ సినిమా గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమిర్ ఖాన్ అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే, 'దాదా సాహెబ్ ఫాల్కే'పై సినిమా చేస్తున్నామని, రాజ్ కుమార్ హిరాణీతో చర్చలు జరుగుతున్నాయిని చెప్పారు. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్ అంటూ ఆమిర్ ఖాన్ తెలిపారు. అదొక యజ్ఞంలా చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని ఆమిర్ అన్నారు.ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ మరో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని ఆమిర్ సినిమా చేయనున్నారు. -
అఫీషియల్: 'కూలీ' రిలీజ్ డేట్.. 'వార్ 2'తో పోటీ
కొన్నిరోజుల నుంచి అనుకున్నదే జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' (Coolie Movie).. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాకు పోటీగా నిలిచింది. సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఉన్నాడని సమాచారం. ఇదివరకే షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. ఆగస్టు అంటే చాలా టైమ్ ఉంది కాబట్టి అన్ని పనులు అంతలోపు పూర్తి చేస్తారు.మరోవైపు ఆగస్టు 14నే ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2 Movie) రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. నార్త్ లో దీనికి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు గానీ దక్షిణాదిలో మాత్రం 'కూలీ' పోటీ గ్యారంటీ. తొలుత కూలీ వారం లేటుగా రావొచ్చేమో అన్నారు కానీ లాంగ్ వీకెండ్ దృష్ట్యా ఆగస్టు 14నే వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రజినీ vs తారక్ ఖరారైంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 #Coolie worldwide from August 14th 😎 @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/KU0rH8kBH7— Sun Pictures (@sunpictures) April 4, 2025 -
కూలి VS వార్-2
-
కూలీ కంప్లీట్
‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, షౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గెస్ట్ రోల్లో ఆమిర్ ఖాన్, స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే నటించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.కాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ధృవీకరించారు మేకర్స్. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. -
రజినీకాంత్ 'కూలీ' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
భారీ రేటుకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’ (Coolie). ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేయలేదు. కానీ..అప్పుడే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయట.ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయట. చివరకు ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
రెండు వారాల్లో రజనీకాంత్ 'కూలీ' నుంచి అదిరిపోయే గిఫ్ట్
అభిమానులే కాదు, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూసే కథానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కూలీ ఒకటి. కారణం ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కావడమే. అంతేకాదు. లోకేశ్ కనకరాజ్ వంటి క్రేజీ దర్శకుడు, సన్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థ చేస్తున్న చిత్రం ఇది. ఇకపోతే నటి శృతిహాసన్, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, తెలుగు స్టార్ నటుడు నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటూ ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూడా కీలక పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు క్రేజీ నటి పూజాహెగ్డే ఒక ప్రత్యేక పాటలో మెరుపులు మెరిపించనున్నారని సమాచారం. ఇక అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై ఎవరికై నా ఎందుకు ఆసక్తి ఉండదు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరికుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా కూలీ చిత్ర వర్గాల నుంచి వచ్చిన ఓ అప్డేట్ ఈ చిత్ర టీజర్‌ను రెడీ చేశారట. ఈ చిత్ర టీజర్ చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు ఫుల్‌జోష్‌లో ఉన్నారట. దీన్ని మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం. మార్చి 14న లోకేశ్ కనగరాజ పుట్టినరోజు ఉంది. అదే రోజున కూలీ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు. -
రజనీకాంత్‌తో ‘జిగేల్ రాణి’ స్టెప్పులు.. పూజాకి ‘సూపర్’ ఛాన్స్
పూజా హెగ్డే(Pooja Hegde ).. మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దూసుకెళ్లడంతో కాస్త వెనుకబడింది. దీంతో టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ పొడుగు కాళ్ల సుందరికీ నిరాశే ఎదురైంది. దీంతో పూజాకి అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు లభించట్లేదు. కోలీవుడ్‌లో మాత్రం రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగణ్’తో పాటు కాంచన 4లోనూ పూజా హీరోయిన్గా నటిస్తోంది. ఆ రెండు చిత్రాలు తప్ప పూజా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో పూజాగా ఓ ‘సూపర్’ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేయబోతుందట.‘కావాలయ్యా’తరహాలో ..రజనీకాంత్(Rajinikanth ) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’(Coolie Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటకి పూజా హెగ్డేతో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించారట. పాట నచ్చడంతో పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని సమాచారం.పూజాకి కొత్తేమి కాదుస్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయింది. ఇక కూలీ విషయానికొస్తే.. లోకేశ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీ సరికొత్తగా కనిపించబోతున్నాడట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ఈప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్‌లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు. -
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
ఎల్‌సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
నాగార్జున ప్లాన్ వర్కవుట్ అవుతుందా.? నాగ్ ప్లాన్ ఏంటి.?
-
రజినీకాంత్ మూవీ షూటింగ్ లో పేలిన లిథియం కంటైనర్
-
'కూలీ' షూటింగ్.. కొద్దిలో తప్పిన అగ్ని ప్రమాదం
తమిళ స్టార్ హీరో రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తీస్తున్న సినిమా 'కూలీ'. ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే చిత్రబృందానికి ఇప్పుడు కొద్దిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో కంటైనర్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. చైనా నుంచి గత నెలలో వచ్చిన లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్ ఇది. తొలుత కంటైనర్ లోపల నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. అలా ఫైరింజన్లు వచ్చే సమయానికి కంటైనర్ లోని చాలా బ్యాటరీలని బయటకు లాగేశారు. కానీ కొన్ని బ్యాటరీలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే రజినీకాంత్ 'కూలీ' షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఊహించని ప్రమాదం జరగడంతో సెట్లో ఉన్నవాళ్లందరూ భయబ్రాంతులకు గురయ్యాడు. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇకపోతే 'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. 'విక్రమ్', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ ఈసారి అదరగొట్టేస్తాడనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఇది థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు) -
రజనీకాంత్ 'కూలీ' సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్- దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ కింగ్ నాగార్జున సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆయన లుక్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు.కూలీ సినిమాలో సిమాన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే, అదీ రజనీకాంత్‌ను ఢీ కొట్టే పాత్ర అని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్‌తో మొదటిసారి నాగార్జున కనిపించనున్నారు. విలన్ పాత్ర నిజమే అయితే.. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భారీగానే ఉంటాయని అప్పుడే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.రజనీకాంత్ చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలకు ఇతర భాషా నటీనటులు పేరిగిపోతున్నారనే చెప్పాలి. ఈయన నటించిన జైలర్ చిత్రంతో ఈ ఫార్ములా మొదలైందని చెప్పవచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాష్, టాలీవుడ్ నటుడు సునిల్ వంటి వారు కీలక పాత్రల్లో నటించి ఆ చిత్రానికి స్టార్ విలువ పెంచేశారు. అదేవిధంగా తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఉపేంద్ర, నాగార్జున నటిస్తున్నారు. కన్నడ నటి రచితరామ్ కూడా కూలీ సినిమాలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. కూలీ సినిమాకు అనిరుధ్ సంగీత అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) -
రజినీకాంత్ తో కయ్యానికి సిద్దమైన నాగ్..
-
రజినీకాంత్ ని లెక్కచేయని ఫహాద్ ఫాజిల్
-
కోలీవుడ్‌కు కూలి 1000 కోట్లు.. పక్కనా..?
-
రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ప్రత్యకమైన స్థానం ఉంది. ఎందరో యువ సంగీత దర్శకులకు ఆయన ఒక ఆదర్శం. తన సంగీతంతో మూడు తరాల ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే, ఇళయరాజా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ 'కూలీ' సినిమా మేకర్స్‌కు ఆయన నోటీసులు పంపడం కూడా ఒకటి అని చెప్పవచ్చు.ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఎవరైనా ఉపయోగించుకుంటే వారికి కాపీరైట్, రాయల్టీ వంటి విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ తరచుగా కోర్టు నోటీసులు ఆయన పంపడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి స్టార్ సింగర్‌కు కూడా ఆయన గతంలో నోటీసులు పంపారు. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నారని బాలుకు నోటీసులు పంపడం అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. తన పాటలతో ఉన్న ఒప్పందం గడువు ముగిసినా కూడా ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నాయని కొద్దిరోజుల క్రితం నోటీసులు పంపారు.తాజాగా ఇదిలా ఉంటే.. రజనీకాంత్ సినిమా 'కూలి' మేకర్స్‌కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన 'తంగమగన్' సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. 'వా వా పక్కం వా' అనే సాంగ్ 'కూలి' టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్‌ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్లో సాంగ్‌ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది. -
Coolie: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా?
కాయకష్టం చేసుకుని బతుకును భారంగా ఈడ్చే వ్యక్తినే కూలీ అంటారు. అంతే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పని చేసేవారినైనా కూలీనే అంటారు. వీటిలో నటుడు రజనీకాంత్ ఏ కోవకు చెందుతారో తెలియదు గానీ, ఇప్పుడు కూలీ పేరు మాత్రం నలుమూలలా మారుమ్రోగుతోంది. సినీ పరిశ్రమలో కూలీ టైటిల్ సక్సెస్‌కు అడ్రస్ అనుకుంటా. హిందీలో అమితాబచ్చన్ ఇదే పేరుతో చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం కూడా సూపర్‌హిట్ అయ్యింది. అలాగే తమిళంలోనూ నటుడు శరత్‌కుమార్ కూలీ పేరుతో చిత్రం చేశారు.తాజాగా ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ రంగప్రవేశం చేస్తున్నారు. అవును ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు లోకేకనకాజ్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నారని, మరో ముఖ్యపాత్రలో క్రేజీ నటి శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్‌సింగ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇది వరకే విడుదల చేయగా అందులో రజనీకాంత్ గెటప్‌ను చూసి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సమీప కాలంలో చిత్ర టైటిల్‌తోపాటు టీజర్‌ను విడుదల చేశారు. కూలీ టైటిల్, టీజర్లను చూస్తుంటే సరికొత్త రజనీకాంత్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరపై ఆవిష్కరించనున్నారనేది సుస్పష్టం అవుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ కూలీ ప్రకంపనలు సృష్టిస్తోంది.లోకేష్ కనకరాజ్‌కు తన చిత్రాల షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్‌ను విడుదల చేసి, సెన్సేషనల్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ చిత్రం టీజర్లో ఆరంబిక్కలామా అనే డైలాగ్‌తో టీజర్‌ను రూపొందించి ఎగ్జైటింగ్కు గురి చేశారు. ఆ తరువాత విజయ్‌తో చేసిన లియో చిత్ర టీజర్లో బ్లడీ స్వీట్ అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు.తాజాగా రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్‌గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్కనకరాజ్నే అవుతారు. కాగా కూలీ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించగానే నటుడు ధనుష్ తన ఎక్స్ మీడియాలో మాస్ అని పేర్కొనడం మరో విశేషం.