కూలీ ఫేమ్‌ రచిత రామ్ 'కల్ట్‌' పోస్టర్‌ విడుదల | Rachita Ram’s Bold Look in New Movie Cult Revealed | Sakshi
Sakshi News home page

కూలీ ఫేమ్‌ రచిత రామ్ 'కల్ట్‌' పోస్టర్‌ విడుదల

Oct 4 2025 11:44 AM | Updated on Oct 4 2025 12:53 PM

Actress rachirta ram cult poster out now

కన్నడ హీరోయిన్‌ రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రీసెంట్‌గా కూలీ సినిమాలో లేడీ విలన్‌గా నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘కల్ట్‌’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీకి ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఇందులో రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆమెకు జోడీగా జైద్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రచిత రామ్ ఒక లవ్ ఫెయిల్యూర్  యువతిగా కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది అనే అంశం చుట్టూ కథ సాగుతుంది.

రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కల్ట్‌ పోస్టర్‌లో ఆమె లేడీ డాన్ లుక్‌లో కనిపించారు. బాత్రూమ్‌లో టాయిలెట్ సీటింగ్‌పై కూర్చొని, సిగరెట్ తాగుతూ.. ఆమె మాస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పక్కన గిటార్ కాలిపోతుండగా, వెనకాల ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కూడా ఉంది. ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే డైలాగ్‌తో పోస్టర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా రచిత రామ్ మరోసారి తన నటనలో విభిన్నతను చూపించబోతున్నారు. ఇలాంటి పాత్రలతో రచిత రామ్ తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement