కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్ రిలీజ్ | Karthi Annagaru Vostaru Telugu Teaser | Sakshi
Sakshi News home page

Karthi: ఫన్నీ పోలీస్.. కార్తీ కొత్త సినిమా టీజర్ చూశారా?

Nov 28 2025 5:46 PM | Updated on Nov 28 2025 5:46 PM

Karthi Annagaru Vostaru Telugu Teaser

కార్తీ.. పేరుకే తమిళ హీరో గానీ మన దగ్గర బోలెడంత మంది అభిమానులున్నారు. దీంతో తన సినిమాలు వచ్చేటప్పుడు తెలుగు రిలీజ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. గతేడాది 'సత్యం సుందరం' అనే మూవీతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'అన్నగారు వస్తారు' చిత్రంతో రాబోతున్నాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

'అన్నగారు వస్తారు'లో కార్తీ.. కాస్త ఫన్ ఎలిమెంట్స్ ఉండే పోలీస్ అధికారిగా కనిపిస్తాడని టీజర్ బట్టి తెలుస్తోంది. కృతిశెట్టి హీరోయిన్‌. నలన్‌ కుమారస్వామి దర్శకుడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశముంది. టీజర్‌ను టాలీవుడ్ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. డైలాగ్స్ ఏం లేనప్పటికీ.. టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది.

(ఇదీ చదవండి: 'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement