దెయ్యం సినిమాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి గానీ వాటిలో భయపెట్టేవి చాలా తక్కువ. రీసెంట్‌గా మలయాళంలో రిలీజైన ఓ మూవీ.. హారర్ చిత్రాలంటే ఇష్టపడే ప్రేక్షకుల్ని కూడా భయపెట్టింది. థియేటర్లలో ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ వణికించేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
మలాయళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కూడా అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైంలో 'డీయస్ ఈరే' అనే హారర్ చిత్రంలో నటించాడు. 'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్‌గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)
థియేటర్లలో అలరించిన 'డీయస్ ఈరే' సినిమా.. ఇప్పుడు డిసెంబరు 05 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మీరు హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. చిల్ మూమెంట్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి.
'డీయస్ ఈరే' విషయానికొస్తే.. రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్‌మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్.. కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట వింతైన శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భయపడుతుంటాడు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? రోహన్ వెంటే ఎందుకు పడుతోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
(ఇదీ చదవండి: తెలుగు కామెడీ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్)
The Day of Wrath is here.
Diés Iraé will be streaming from December 5 only on JioHotstar.@impranavlal @rahul_madking @StudiosYNot @chakdyn @sash041075 @allnightshifts @studiosynot #DiésIraé #DiésIraéOnHotstar #PranavMohanlal #Horror #Thriller #Suspense #JioHotstar… pic.twitter.com/AYBPyGwfsL— JioHotstar Malayalam (@JioHotstarMal) November 28, 2025


