breaking news
Pranav Mohanlal
-
Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
గత కొన్నేళ్లుగా హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. కానీ దీనికి కామెడీ మిక్స్ చేసి తీస్తున్నారు. అలా కాకుండా కేవలం హారర్ ఎలిమెంట్స్‌తో తీసి వేరే లెవల్లో భయపెట్టిన చిత్రాలంటే అరుదు. ఇప్పుడు అలా ప్యూర్ హారర్ కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'డీయస్ ఈరే'. ఇదో మలయాళం సినిమా. అక్టోబరు 31న అక్కడ రిలీజైంది. వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ)కథేంటి?రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్ కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట గజ్జెల శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భావిస్తుంటాడు. అసలు ఈ ఆత్మ ఎవరిది? ఎందుకు రోహన్ వెంటపడుతోంది? కని పొరుగింటి వ్యక్తి మధు(జిబిన్ గోపీనాథ్), రోహన్‌కి ఎలాంటి సాయం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?హారర్ సినిమా అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. ఓ దెయ్యం, దానికో ఫ్లాష్ బ్యాక్, అది హీరో లేదా హీరోయిన్ని వేధించడం.. చివరకు దాని నుంచి బయటపడటం.. దాదాపు ఇదే పాయింట్‌తో చాలా వరకు తీస్తుంటారు. 'డీయస్ ఈరే' కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. కానీ చూస్తున్న ప్రేక్షకుడిని ఎంతవరకు భయపెట్టామా అనేది కీలకం. ఈ విషయంలో 'డీయస్ ఈరే' టీమ్‌కి నూటికి నూటి మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఆ రేంజులో భయపెట్టారు. కొన్ని సీన్లలో అయితే వణికిపోతాం.సినిమా మొదలైన కాసేపటివరకు కథలో పెద్ద కదలిక ఉండదు. రోహన్, అతడు చుట్టూ ఉంటే ప్రపంచాన్ని పరిచయం చేశారు. కని ఆత్మహత్య చేసుకోవడం, ఆమె ఇంటికి రోహన్ వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. కని హెయిన్ పిన్ని రోహన్ తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి ఓ ఆత్మ రోహన్‌ని భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం చూపించే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో దెయ్యం ఎవరు? దాన్ని రోహన్ ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలు చూపిస్తారు. అయితే సెకండాఫ్‌లో ప్రతి సీన్లోనూ నెక్స్ట్ ఏం జరగబోతుందా అని ఒకటే ఆత్రుత. చివరి 20 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సీటు నుంచి మనల్ని కదలం. ఊపిరి కూడా తీసుకోకుండా చూస్తాం. అప్పటివరకు నిదానంగా సాగిన సినిమా కాస్త క్లైమాక్స్‌లో పరుగెడుతుంది.(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ)ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ (చెబితే స్పాయిలర్ అవుతుంది)ని పలు సందర్భాల్లో మనం వార్తల్లో చూసే ఉంటాం. ఇంత చిన్న పాయింట్‌ని తీసుకుని ఓ హారర్ మూవీ తీయడం అంటే మాటలు కాదు. అదే టైంలో మలయాళ చిత్రాలపై ఎప్పుడు ఉండే కంప్లైంట్ ఇందులోనూ ఉంటుంది. చాలా అంటే చాలా నిదానంగా మూవీ సాగుతుంది. అసలు కని ఏ కారణంతో చనిపోయిందో రివీల్ చేయలేదు. చివర్లో పార్ట్ 2 ఉంటుందనే హింట్ ఇచ్చారు. బహుశా సీక్వెల్లో ఆ విషయం రివీల్ చేస్తారేమో?కని తమ్ముడు ఓ సందర్భంలో రోహన్ ఇంటికొస్తాడు. అక్కడి ఆత్మ కారణంగా కిరణ్ పై ఫ్లోర్ నుంచి కిందపడిపోతాడు. ఆ విజువల్స్ చూస్తే మన ఒళ్లు జలదరిస్తుంది. క్లైమాక్స్‌లో కని పొరుగింటికి రోహన్ వెళ్తాడు. ఆ సీన్స్ చూస్తున్నంతసేపు కళ్లు తిప్పుకోలేం. ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు భయమేస్తుంది.ఎవరెలా చేశారు?ఇందులో పాత్రలు చాలా తక్కువ. లీడ్ రోల్ చేసిన ప్రణవ్ మోహన్‌లాల్ ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో ఎల్సమ్మ పాత్రలో జయ కురుప్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవల్. ఓ రకంగా ఆమె సర్ప్రైజ్ చేస్తుంది. మధు పాత్రలో జిబిన్ గోపీనాథ్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు అందరూ న్యాయం చేశారు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ గురించి చెప్పుకోవాలి. గతంలో భూతకాలం, భ్రమయుగం అనే హారర్ మూవీస్‌తో భయపెట్టిన ఈయన.. ఇప్పుడు ఈ చిత్రంతో ఇంకాస్త భయపెట్టాడు. అసలు స్టోరీ ఏం లేనప్పటికీ ఏదో ఉందనే భ్రమ కల్పించి, తనదైన మ్యాజిక్ చేశాడు.మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ ఈ సినిమాకు మరో హీరో. ఎందుకంటే సాధారణంగా హారర్ సినిమాల్లో జంప్ కట్స్, స్కేరీ మూమెంట్స్ ఎక్కడొస్తాయో ఇప్పటి ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారు. అలా పండిపోయిన హారర్ మూవీ ప్రేమికుల్ని కూడా తనదైన నేపథ్య సంగీతంతో భయపెడతాడు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కి తోడు సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ వేరే లెవల్ డ్యూటీ చేశాడు. సీన్ మూడ్ ఎలివేట్ చేసేలా, లైటింగ్‌తో.. ఇదెక్కడి హారర్ మూవీ బాబోయే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీ ఇది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి అయ్యో దీన్ని థియేటర్లో మిస్ అయిపోయామే అనుకోవచ్చు. వీలుంటే మాత్రం బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయండి. ఇకపోతే 'డీయస్ ఈరే' అనేది లాటిన్ పదం. తన కోపం చూపించే రోజు, శిక్షాదినం అని దీనికి అర్థం.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?) -
మోహన్‌లాల్ కుమారుడి థ్రిల్లర్ సినిమా ( ట్రైలర్)
మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ (Pranav Mohanlal) హీరోగా నటిస్తున్న చిత్రం డియస్ ఈరే.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. -
స్టార్ హీరో తనయుడి మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ రిలీజ్
మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణవ్. హృదయం మూవీతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా డియాస్ ఇరాయ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ డియాస్ ఇరాయ్ని విడుదల చేస్తోంది.మలయాళ సినిమాలకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు.ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న విడుదల కానుంది. తెలుగు వర్షన్‌ను నవంబర్ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా.. గతంలో రిలీజైన ప్రేమలు', '2018', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కొత్త లోక' లాంటి మలయాళ సినిమాలు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా?
స్టార్ హీరోయిన్లు వరస సినిమాలతో బిజీగా ఉంటారు. అదే టైంలో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. ఫన్నీ కామెంట్స్‌కి కూడా తమదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది కూడా తన ఫ్రెండ్, యంగ్ హీరోకి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే విషెస్ కంటే తన గుండు గురించే ఎక్కువగా అడుగుతున్నారని తెగ బాధపడిపోతోంది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కల్యాణి ప్రియదర్శన్. అదేనండి తెలుగులో అఖిల్ రెండో సినిమా 'హలో'లో హీరోయిన్గా చేసింది. చిత్రలహరి మూవీలోనూ నటించిందిగా. ఆమెనే ఈమె. ఈ రెండు చిత్రాల తర్వాత తెలుగుకి పూర్తిగా దూరమైపోయింది. మాతృభాష మలయాళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాంటిది తన ఫ్రెండ్, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కల్యాణిని చూసి భలే ముద్దుగా ఉందే అని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)కల్యాణి వ్యక్తిగత విషయానికొస్తే.. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిసీల సంతానం ఈ బ్యూటీ. ఈమెకు సిద్ధార్థ్ అని సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం కల్యాణికి 30 ఏళ్లు దాటిపోయాయి. ఇప్పుడు ఎవరి గురించి అయితే పోస్ట్ పెట్టిందో.. అతడితోనే ఈమె రిలేషన్లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే ప్రణవ్-కల్యాణి స్నేహితులు మాత్రమేనని కొన్నిరోజుల క్రితం స్వయంగా ప్రణవ్ తల్లినే చెప్పుకొచ్చింది.హీరోయిన్గా తెలుగు చిత్రాలతోనే కెరీర్ ప్రారంభించినప్పటికీ.. కల్యాణి ఎందుకో తర్వాత పూర్తిగా మలయాళ, తమిళ చిత్రాలపైనే పూర్తిగా ఫోకస్ చేసింది. మరి అవకాశాలు రాకపోవడమా లేదంటే కావాలనే ఇలా చేసిందా అనేది తెలియదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్) -
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
మలయాళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. కొన్నిరోజుల క్రితం 'ఎల్ 2:ఎంపురాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన గురించి పక్కనబెడితే కొడుకు ప్రణవ్(Pranav Mohanlal) గురించి ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోహన్ లాల్ కొడుకు కూడా హీరోనే. కాకపోతే చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. అతడి పేరు ప్రణవ్ మోహన్ లాల్. తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి నచ్చిన మలయాళ మూవీ 'హృదయం'లో హీరో ఇతడే. అయితే ఇదే చిత్రంలో నటించిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శినితో(Kalyani Priyadarshan) ఇతడు ప్రేమలో ఉన్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వినిపించేవి. కానీ అవి నిజం కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మలయాళ డైరెక్టర్ అల్లెప్పీ అష్రఫ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రణవ్ ఓ జర్మన్ అమ్మాయితో డేటింగ్(Pranav Girlfriend)లో ఉన్నాడు. కల్యాణితో కాదు. కల్యాణి ప్రియదర్శన్ తల్లి లిసీతో నేను మాట్లాడాను. ప్రణవ్-కల్యాణి అన్నాచెల్లి లాంటి వారని ఆమె చెప్పింది అని అన్నాడు.హీరోగా కంటే ప్రకృతి ప్రేమికుడిగా ప్రణవ్ ఫేమస్. ఎందుకంటే ఎప్పుడు దేశాలు తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయా ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం స్పెయిన్ టూర్ కి వెళ్లినప్పుడు అక్కడే ఓ పశువుల సాలలోనూ పనిచేశాడు. అయితే సదరు జర్మన్ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం) -
కూలీ పనికి వెళ్తున్న స్టార్ హీరో తనయుడు!
మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.ఆల్ రౌండర్ ప్రణవ్మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్‌కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్‌గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.స్పెయిన్‌లో కూలీగా..‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.కష్టమైన పని చేయడం ఇష్టంప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్‌ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్‌కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్‌కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Pranav Mohanlal (@pranavmohanlal) -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో హిట్ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గత నెలల థియేటర్లలోకి వచ్చిన 'వర్షంగల్కు శేషం' అనే మలయాళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన దీన్ని 80ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మూవీస్‌కి రిలేట్ అయ్యే కథలంటే ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చేస్తుంది!'వర్షంగల్కు శేషం' కథ విషయానికొస్తే.. 80-90ల్లో కేరళ. వేణు(ధ్యాన్ శ్రీనివాసన్)కి చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి. వీటి ద్వారానే సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయమవుతాడు. ఇతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుంగదని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చెన్నై (ఒకప్పటి మద్రాసు) వెళ్తారు. మురళి ప్రయత్నంతో వేణు దర్శకుడు అవుతాడు. కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా ఎలా చేశారు? చివరకు ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఆ బడా నిర్మాతకు మలయాళం రొమాంటిక్ మూవీ రైట్స్..
Karan Johar Acquire Malayalam Movie Hridayam Rights: ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ మలయాళం బ్లాక్ బ్లస్టర్ హిట్ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ సినిమా ఏంటంటే.. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హృదయం' చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్, దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సోషల్ మీడియాతోపాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మనసు గెలుచుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుుకన్నారు. సోషల్ మీడియా వేదికగా 'నేను మీతో ఈ వార్తను పంచుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్డూడియోస్ మలయాళం న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హృదయం సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల హక్కులను పొందాయి.' అని కరణ్ జోహార్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం రణ్వీర్ సింగ్, అలియా భట్లు హీరోహీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా నటించున్నారని సమాచారం. I am so delighted and honoured to share this news with you. Dharma Productions & Fox Star Studios have acquired the rights to a beautiful, coming-of-age love story, #Hridayam in Hindi, Tamil & Telugu – all the way from the south, the world of Malayalam cinema. pic.twitter.com/NPjIqwhz8l — Karan Johar (@karanjohar) March 25, 2022 -
ప్రణవ్, కల్యాణి లవ్‌లో ఉన్నారా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఆప్త మిత్రులు. ఒకరి కెరీర్ కి ఒకరు ఎంతగానో సహాయపడ్డారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శన్ కూతురు కల్యాణీ ప్రియదర్శన్ తెలుగు సినిమా ‘హలో’ ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ప్రణవ్, కల్యాణి మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. ఆ మధ్య ప్రణవ్, కల్యాణి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు మలయాళం ఇండస్ట్రీ లో వార్తలు మొదలయ్యాయి. ‘‘ప్రణవ్, కల్యాణి లవ్ లో ఉన్నారా? అనే ప్రశ్న మోహన్ లాల్ వరకూ వెళ్లింది. ఈ విషయం గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ – ‘ప్రణవ్, కల్యాణి బెస్ట్ ఫ్రెండ్స్. నేను, ప్రియదర్శన్ ఎలానో వాళ్లిద్దరూ అలా. ఒక్క సెల్ఫీ వల్ల ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎలా ఊహించుకుంటారు? అనవసరమైన వార్తలు ప్రచారం చెయ్యొద్దు. నమ్మొద్దు’’ అని ఈ వార్తలను కొట్టిపారేశారు. మోహన్ లాల్ నటించిన ‘అరబికడలింటే సింహం: మరాక్కర్’లో ప్రణవ్, కల్యాణి కూడా నటించారు. అలానే ‘హదయమ్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. -
ఆర్చ... అదరహా
మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ మలయాళ మూవీ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్‌లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్. ఆమె క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్ ఆదరహా అంటోంది మాలీవుడ్. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -
ప్రయాణం మొదలైంది
భారీ నౌక ప్రయాణానికి సిద్ధమయ్యారు కల్యాణి ప్రియదర్శన్. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది కూడా. మరి ఈ ప్రయాణం విశేషాలేంటో తెలుసుకోవాలంటే ‘కుంజలీ మరక్కార్’ చిత్రం చూడాల్సిందే. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. మోహన్‌లాల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ టైమ్ తండ్రి దర్శకత్వంలో నటిస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. అందుకే ఈ సినిమా తనకు స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ షూట్లో శనివారం జాయిన్ అయ్యారు కల్యాణి. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
పడవలు సిద్ధం!
పెద్ద పెద్ద పడవలను రెడీ చేస్తున్నారు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్. ఆల్రెడీ కొన్ని పడవలను సిద్ధం చేశారు కూడా. ఆయన కొత్త వ్యాపారం ఏం మొదలుపెట్టలేదు. ‘మరాక్కర్–అరబ్బికడలింటే సింహం’ అనే సినిమా కోసమే ఇదంతా. మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేశ్, కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ‘బాహుబలి’ ఫేమ్ సాబు శిరిల్ ఆధ్వర్యంలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ సెట్ ఫొటోలను సోషల్æమీడియాలో షేర్ చేశారు కల్యాణి ప్రియదర్శన్. అలాగే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారామె. సముద్రపు దొంగల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఇప్పుడు అర్థం అయ్యింది కదా... దర్శకుడు ప్రియదర్శన్ పడవలను ఎందుకు తయారు చేస్తున్నారో! -
కావలి కాస్తా!
సముద్రతీరం నుంచి దేశం లోపలికి వచ్చే శత్రువులను అడ్డుకోవడానికి కావలి కాయనున్నారట మలయాళ స్టార్ మోహన్‌లాల్. ఇది ఆయన కొత్త సినిమాలో భాగంగానే. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ టైటిల్ రోల్లో ‘మరాక్కర్: అరబికడలింటే సింహమ్’ అనే బహు భాషా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దంలో కాలికట్ ప్రాంతంలో (ఇప్పటి కేరళ) ఉన్న కుంజాలి మరాక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని మాలీవుడ్ టాక్. ఇందులో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ టీమ్‌లోకి ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి జాయిన్ అయ్యారు. కేరళ పిరవి డే సందర్భంగా ఈ సినిమా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో స్టార్ట్ అవుతుందని టాక్. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారట. -
అలలతో ఆటలాడుతూ..
ఎల్తైన బిల్డింగ్ మీద నుంచి దూకడం, సముద్రంలో సర్ఫింగ్ చేయడం.. ఇలాంటి రిస్క్‌లు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడటంలేదు ప్రణవ్.. సన్నాఫ్ మోహన్‌లాల్. అవును మరి.. మంచి నటుడు అనిపించుకోవాలంటే సీన్ ఏది డిమాండ్ చేస్తే అది చేయాలి కదా. పైగా తండ్రిలానే మంచి యాక్టర్‌గా పేరు సంపాదించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు ప్రణవ్. ఫస్ట్ సినిమా ‘ఆది’ కోసం ‘పార్కౌర్’ (బిల్డింగ్స్ మీద నుంచి వేగంగా రన్నింగ్, జంపింగ్ చేయడం) నేర్చుకున్నారు. ఇప్పుడు తన సెకండ్ సినిమా ‘ఇరుపత్తియొన్నాం నూట్టాండు’ సినిమా కోసం సముద్రపు అలలతో ఆటలాడే ‘సర్ఫింగ్’ గేమ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు అరుణ్ గోపి మాట్లాడుతూ – ‘‘సర్ఫింగ్ కోసం ప్రణవ్ ఇండోనేషియాలోని బాలీ దగ్గర నెలరోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ పాత్రను పోషించడానికి ప్రణవ్ చాలా శ్రమపడుతున్నాడు. ఈ సర్ఫింగ్ సన్నివేశాలను సౌత్ ఆఫ్రికాలో షూట్ చేయనున్నాం’’ అని అన్నారు. -
2018లో రెండోసారి
ఈ ఏడాది జనవరిలో ‘ఆది’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు మలయాళ నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్. ఈ సినిమాలో ప్రణవ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ప్రణవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇరుపతియొన్నామ్ నూటాన్డు’. రీసెంట్గా ‘రామాలీలా’ సినిమాతో మాలీవుడ్‌కు దర్శకునిగా పరిచయం అయిన అరుణ్గోపీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం మొదలైంది. ఇందులో కల్యాణీ ప్రియదర్శని కథానాయికగా నటించనున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ స్పీడ్‌గా జరిపి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని టాక్. సో.. ఈ ఏడాది రెండోసారి ప్రణవ్ కనిపిస్తారన్న మాట. ఈ సినిమా కాకుండా తండ్రి మోహన్‌లాల్ హీరోగా నటించనున్న ‘మరార్కర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రణవ్. -
ముహూర్తం ఖరారైంది
మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఆది’. తాజాగా ఆయన రెండో చిత్రం ప్రారంభోత్సవం వచ్చే నెల 9న జరగనుందని మాలీవుడ్ సమచారం. అరుణ్ గోపీ దర్శకత్వం వహించనున్నారు. వివేక్ హర్షన్, హరినారాయణన్, రంగనాథ్, జోసెఫ్, ధన్య బాలకృష్ణన్, లిబిన్ మోహనన్ తదితరులు నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే నెలాఖర్లో స్టార్ట్ కానుందట. మరోవైపు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందనున్న మరార్కర్ సినిమాలో యంగ్ మోహన్‌లాల్ క్యారెక్టర్లో ప్రణవ్మోహన్లాల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో స్టార్ట్ కానుంది. -
యంగ్ లాల్!
స్టార్ హీరో సినిమాల్లో తమ చిన్నప్పటి క్యారెక్టర్‌ను వాళ్ల పిల్లలు చేస్తుంటారు. 2002లో మోహన్‌లాల్ నటించిన ‘ఒన్నామన్’లో చైల్డ్ ఎపిసోడ్లో ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపించారు. 16 ఏళ్ల తర్వాత యంగ్ మోహన్‌లాల్‌గా కనిపించనున్నారు ప్రణవ్. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా ‘మరా క్కర్ : అరబికడలింటే సింహం’ టైటిల్‌తో కెప్టెన్ మరాక్కర్ బయోపిక్ రూపొందనుంది. టైటిల్ రోల్లో మోహన్‌లాల్ కనిపిస్తారు. యంగ్ మరాక్కర్ పాత్రలో ప్రణవ్ యాక్ట్ చేయనున్నారు. ఆల్మోస్ట్ 22 ఏళ్ల తర్వాత నటుడు ప్రభు, మోహన్ లాల్ ఈ సినిమాలో కలసి నటించబోతున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున నటించనున్నారు. -
లైక్ డాడ్స్ – లైక్ సన్స్
మమ్ముటి, మోహన్‌లాల్ మలయాళ సూపర్ స్టార్స్. ఇద్దరూ సూపర్ స్టార్స్ అంటే పోటీ సహజమే. కానీ అది కేవలం సినిమాల వరకు మాత్రమే. బయట వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. వాళ్లనే వాళ్ల వారసులు కూడా ఫాలో అవుతున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ హీరోగా హిట్. ఇప్పుడు మెహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ‘ఆది’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు. ‘ఆది’ సినిమా ఈ నెల 26న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణవ్ డెబ్యూ సినిమాకు దుల్కర్ సల్మాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లెటర్ రాసి, ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. ‘‘డియరెస్ట్ అప్పు, ‘ఆది’ సినిమాకు ఆల్ ది వెరీ బెస్ట్. మనిద్దరం ఎప్పుడూ మంచి ఫ్రెండ్లీ బాండ్‌ను షేర్ చేసుకున్నాం. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్ చిన్నపిల్లాడివి. మనం ఫ్రెండ్స్ అయినప్పడు నీకు ఏడేళ్లు. నేను హై స్కూల్లో చదువుతున్నాను. నువ్వు నాకు ఎప్పటికీ ‘లిటిల్ బ్రదర్’వే. నీ ప్రతీ స్టెప్‌ను అప్రిషియేట్ చేస్తూ, నీ సక్సెస్ కోరుకుంటున్నాను. నీ పెరెంట్స్, సిస్టర్ నీ ఎంట్రీకు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో నాకు తెలుసు అండ్ వాళ్లు అస్సలు వర్రీ అవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నువ్వు పుట్టిందే సూపర్ స్టార్ అవ్వడం కోసం’’ అంటూ ప్రణవ్‌కు హృదయపూర్వక విషెస్ తెలిపారు దుల్కర్ సల్మాన్. చాలా బాగుంది కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏ నటుడైనా తన తొలి సినిమాను స్క్రీన్ పై చూసుకొని మురిసిపోవాలనుకుంటాడు. కానీ ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం అందుకు భిన్నం. ప్రణవ్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. తన తొలి సినిమా ‘ఆది’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే తన ఫేవరేట్ ప్లేస్ హిమాలయాలకు వెళ్లిపోయాడట. ప్రణవ్ తనను తాను ఇంకా స్క్రీన్ మీద చూసుకోలేదు అని దర్శకుడు జీతూ జోసెఫ్ పేర్కొన్నారు. ‘ఆది’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రణవ్ యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశాడని, మిగతా సీన్స్ కూడా ఓకే అని టాక్. సో.. మోహన్ లాల్ ఫుల్ హ్యాపీ అన్నమాట. -
వారసుడొస్తున్నాడు..!
‘ఆది’ ఎవరు? అంటే మన తెలుగు ప్రేక్షకులు చిన్న ఎన్టీఆర్ పేరు చెబుతారు. ఇప్పుడు మలయాళ ‘ఆది’ రెడీ అవుతున్నాడు. ఆదిగా కనిపించనున్న ఈ మలయాళ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ప్రణవ్‌కి హీరోగా ‘ఆది’ మొదటి సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే ఈ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ రిలీజ్ చేశారు. ప్రణవ్ హ్యాండ్సమ్గా ఉన్నాడని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని పోస్టర్ చూసినవారు అంటున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్న నమ్మకం ఉంది. ప్రణవ్ అద్భుతంగా నటిస్తున్నాడు’’ అని పేర్కొన్నారు జోసెఫ్. ఆల్రెడీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకెళుతున్నాడు. మలయాళంలో పేరు తెచ్చుకుని, ‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ భాషల్లోనూ మార్కులు కొట్టేశారు. ఇప్పుడు మోహన్‌లాల్ వారసుడు ప్రణవ్ వస్తున్నాడు. ఈ వారసుడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, తండ్రిలా తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తాడని ఊహించవచ్చు. -
తండ్రికి విలన్... కుమారుడికి?
హీరోయిజమ్, విలనిజమ్... జగపతిబాబు నటనలో రెండిటినీ తెలుగు ప్రేక్షకులు చూశారు. మలయాళీలకు ఆయన నటనలోని విలనిజమ్ మాత్రమే తెలుసు. అసలు పేరు కంటే కొసరు పేరు ‘డాడీ గిరిజ’గా అక్కడి ప్రేక్షకులకు తెలుసు. మోహన్‌లాల్ ‘పులి మురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలైంది)లో డాడీ గిరిజగా జగపతిబాబు ప్రదర్శించిన విలనిజమ్ అటువంటిది మరి! మలయాళంలో ఆయన నటించిన తొలి చిత్రమది. తాజాగా మరో చిత్రం అంగీకరించారు. ఇందులో మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ హీరో. సిన్మా పేరు ‘ఆది’. అప్పుడు మోహన్‌లాల్ ‘పులి మురుగన్’తో మలయాళంలో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు, ఇప్పుడు ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ‘ఆది’లోనూ విలన్‌గా నటిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని యూనిట్ సభ్యులు ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు!


