అలలతో ఆటలాడుతూ..

Pranav Mohanlal learnt surfing in Bali for Irupathiyonnam Noottandu - Sakshi

ఎల్తైన బిల్డింగ్‌ మీద నుంచి దూకడం, సముద్రంలో సర్ఫింగ్‌ చేయడం.. ఇలాంటి రిస్క్‌లు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడటంలేదు ప్రణవ్‌.. సన్నాఫ్‌ మోహన్‌లాల్‌. అవును మరి.. మంచి నటుడు అనిపించుకోవాలంటే సీన్‌ ఏది డిమాండ్‌ చేస్తే అది చేయాలి కదా. పైగా తండ్రిలానే మంచి యాక్టర్‌గా పేరు సంపాదించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు ప్రణవ్‌. ఫస్ట్‌ సినిమా ‘ఆది’ కోసం ‘పార్కౌర్‌’ (బిల్డింగ్స్‌ మీద నుంచి వేగంగా రన్నింగ్, జంపింగ్‌ చేయడం) నేర్చుకున్నారు. ఇప్పుడు తన సెకండ్‌ సినిమా ‘ఇరుపత్తియొన్నాం నూట్టాండు’ సినిమా కోసం సముద్రపు అలలతో ఆటలాడే ‘సర్ఫింగ్‌’ గేమ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు అరుణ్‌ గోపి మాట్లాడుతూ – ‘‘సర్ఫింగ్‌ కోసం ప్రణవ్‌ ఇండోనేషియాలోని బాలీ దగ్గర నెలరోజుల పాటు ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఈ పాత్రను పోషించడానికి ప్రణవ్‌ చాలా శ్రమపడుతున్నాడు. ఈ సర్ఫింగ్‌ సన్నివేశాలను సౌత్‌ ఆఫ్రికాలో షూట్‌ చేయనున్నాం’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top