మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ | Bha Bha Ba Movie OTT Telugu Streaming Details | Sakshi
Sakshi News home page

OTT: సూపర్‌స్టార్స్ కలిసి చేసిన సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్

Jan 27 2026 6:15 PM | Updated on Jan 27 2026 6:19 PM

Bha Bha Ba Movie OTT Telugu Streaming Details

రీసెంట్ టైంలో ఓటీటీ సంస్థలు.. ఏ భాషా చిత్రాలకైనా తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా భాషల్లో హిట్ అయిన మూవీస్‪‌కి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెస్తున్నాయి. రీసెంట్‌గా 'సిరై' అనే తమిళ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు మలయాళంలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఓ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన దాదాపు 10 రోజులకు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)

మలయాళంలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా చెలామణీ అయిన దిలీప్.. 2017లో హీరోయిన్ భావనపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటన తర్వాత నుంచి దిలీప్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. గత నెల అంటే 2025 డిసెంబరులో ఈ కేసు నుంచి దిలీప్‌కి పూర్తిగా రిలీఫ్ దక్కింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి దిలీప్ పేరు తొలగించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే దిలీప్ కొత్త మూవీ 'భా భా భా' థియేటర్లలోకి వచ్చింది.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. డిసెంబరు 18న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కొన్నిరోజుల క్రితం ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు మలయాళం మాత్రమే రాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement