యంగ్‌ లాల్‌! | Mohanlal and son Pranav Mohanlal to share screen space in Marakkar | Sakshi
Sakshi News home page

యంగ్‌ లాల్‌!

Jun 23 2018 1:23 AM | Updated on Jul 15 2019 9:21 PM

Mohanlal and son Pranav Mohanlal to share screen space in Marakkar - Sakshi

ప్రణవ్‌ మోహన్‌లాల్‌

స్టార్‌ హీరో సినిమాల్లో తమ చిన్నప్పటి క్యారెక్టర్‌ను వాళ్ల పిల్లలు చేస్తుంటారు. 2002లో మోహన్‌లాల్‌ నటించిన ‘ఒన్నామన్‌’లో చైల్డ్‌ ఎపిసోడ్‌లో ఆయన కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ కనిపించారు. 16 ఏళ్ల తర్వాత యంగ్‌ మోహన్‌లాల్‌గా కనిపించనున్నారు ప్రణవ్‌. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా ‘మరా క్కర్‌ : అరబికడలింటే సింహం’ టైటిల్‌తో కెప్టెన్‌ మరాక్కర్‌ బయోపిక్‌ రూపొందనుంది. టైటిల్‌ రోల్‌లో మోహన్‌లాల్‌ కనిపిస్తారు. యంగ్‌ మరాక్కర్‌ పాత్రలో ప్రణవ్‌ యాక్ట్‌ చేయనున్నారు. ఆల్మోస్ట్‌ 22 ఏళ్ల తర్వాత నటుడు ప్రభు, మోహన్‌ లాల్‌ ఈ సినిమాలో కలసి నటించబోతున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement