మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ (Pranav Mohanlal) హీరోగా నటిస్తున్న చిత్రం డియస్ ఈరే.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.


