హైదరాబాద్‌లో టాలీవుడ్‌ ప్రో లీగ్‌ ప్రారంభం | Tollywood Pro League Started In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టాలీవుడ్‌ ప్రో లీగ్‌ ప్రారంభం

Dec 21 2025 8:39 PM | Updated on Dec 21 2025 8:45 PM

Tollywood Pro League Started In Hyderabad

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది.  ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్‌ కార్యక్రమాన్ని నిర్మాత దిల్‌ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  

టాలీవుడ్ ప్రో లీగ్‌కు  హానరరీ చైర్మన్‌గా దిల్‌రాజు వ్యవరించనున్నారు. క్రికెట్‌-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్‌ను ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.

ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో  మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. 

 

*
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement