హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రో లీగ్‌కు హానరరీ చైర్మన్‌గా దిల్‌రాజు వ్యవరించనున్నారు. క్రికెట్-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. * * *