మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణవ్. హృదయం మూవీతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా డియాస్ ఇరాయ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ డియాస్ ఇరాయ్‌ని విడుదల చేస్తోంది.
మలయాళ సినిమాలకు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు.
ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న విడుదల కానుంది. తెలుగు వర్షన్‌ను నవంబర్ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా.. గతంలో రిలీజైన ప్రేమలు', '2018', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కొత్త లోక' లాంటి మలయాళ సినిమాలు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


