రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నిలిచింది. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.
ప్రస్తుతం ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. ది గర్ల్‌ఫ్రెండ్ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.
ది గర్ల్‌ఫ్రెండ్ కథేంటంటే?
భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ.
#TheGirlfriend is the 2nd most watched Non English film in THE WORLD on @NetflixIndia
Have you watched it yet? pic.twitter.com/d21N2UhQuS— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025


