breaking news
The Girlfriend Movie
-
రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు?.. ది గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్ రిప్లై ఇదే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్ రష్మిక లుక్‌పై కామెంట్ చేశాడు. క్లైమాక్స్ సీన్లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్ఫుల్ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్‌ఫ్రెండ్‌కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు కళాశాల అందరి ముందు ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్‌గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'అఖండ 2' మాత్రమే రాబోతుంది. హిందీలో 'ధురంధర్' అనే చిత్రం రిలీజ్ కానుంది. ఇవి రెండు తప్పితే వేరే చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం హిట్ సినిమాలు చాలానే రాబోతున్నాయి. తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం.(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ఈ వీకెండ్ రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్', 'థామా'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, డీయస్ ఈరే, స్టీఫెన్ చిత్రాలు కచ్చితంగా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, సిరీస్‌లు రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (డిసెంబరు 01 నుంచి 07 వరకు)నెట్ఫ్లిక్స్ట్రోల్ 2 (నార్వేజియన్ సినిమా) - డిసెంబరు 01కిల్లింగ్ ఈవ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 02మై సీక్రెట్ శాంటా (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05అమెజాన్ ప్రైమ్థామా (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 (రెంట్ విధానం)ఓ వాట్ ఫన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03ఆహాధూల్పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05హాట్స్టార్ద బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05జీ5ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05ఘర్వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05సోనీ లివ్కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05సన్ నెక్స్ట్అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05ఆపిల్ టీవీ ప్లస్ద హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 03ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05బుక్ మై షోద లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 04(ఇదీ చదవండి: హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇంట్లో యువతి ఆత్మహత్య) -
టాలీవుడ్ నవంబర్ రివ్యూ.. 35లో మూడు మాత్రమేనా?
టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్ నెల గడిచిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్ హీరోల హిట్ చిత్రాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.సెంటిమెంట్ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్ కూడా భారీ ఫ్లాప్‌తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్ 1న విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడలేదు.ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్‌ఫ్రెండ్, జటాధర, ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశాయి.ఇక రెండోవారం(నవంబర్ 14) కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది.ఇక నవంబర్ 21న అల్లరి నరేశ్ ‘12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, పాంచ్ మినార్‌తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్ అయింది. ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక నవంబర్ చివరివారంలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలుకా’తో, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్ తాలుకా చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టుకోలేకపోయింది. రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్ రీటా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్‌లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్లో అయిన టాలీవుడ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందో చూడాలి. -
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.నెల తిరగకముందే ఓటీటీలోనవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.కథేంటంటే?The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్‌ఫ్రెండ్ చూసేయండి.. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్.. అంతమాటన్నాడా? -
'అదంతా పీఆర్ స్టంట్' .. నెటిజన్‌కు ది గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా లీడ్ రోల్లో కనిపించింది. దీక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ లవ్ ఎంట్ర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 20.4 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. దీంతో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.అయితే ఇటీవల ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ థియేటర్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమా చూసిన ఓ అమ్మాయి డైరెక్టక్ రాహుల్‌ను చూసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా తన దుపట్టా తీసి గర్వంగా తిరుగుతానంటూ చేసి చూపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలైంది. దీంతో అమ్మాయిని మెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఒక హగ్ ఇచ్చాడు. అయితే ఇదంతా చూసిన ఓ నెటిజన్ అంతా పీఆర్ స్టంట్ అని ట్రోల్ చేశాడు. కేవలం దుపట్టా, హగ్ కోసమే ఆ అమ్మాయికి డబ్బులిచ్చి అలా చేయించారా? అంటూ విమర్శించాడు. ఇది చూసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు.ఆ అమ్మాయిపై నెగెటివిటీ రాకూడదనే ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశాడు. కానీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను ఖండించాల్సి అవసరముందన్నారు. ఈ థియేటర్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు ఎక్కడికి వెళ్లాలో మేము కచ్చితంగా డిసైడ్ అవ్వలేదన్నారు. ఆ థియేటర్‌కు మేము వెళ్తామో కూడా చివరికి వరకు మాకే తెలియదని రాసుకొచ్చాడు. ఇందులో ఎలాంటి పీఆర్ స్టంట్ లేదని.. అది పూర్తిగా యాదృఛ్చికం అని రవీంద్రన్ ట్వీటిర్లో పోస్ట్ చేశారు.రాహుల్ రవీంద్రన్ తన ట్వీట్లో రాస్తూ..' ఆ వీడియోను బయట పెట్టడం గురించి నేను కొంచెం ఆందోళన చెందా. కొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారని భయపడ్డా. ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల నాకు భయంగా ఉంది. ఆమెకు చాలా బలంగా, ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ద్వారా వారి చున్నీలను తీయమని నేను చెప్పడం లేదు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. ఒక అమ్మాయి తన దుపట్టాను యాదృచ్ఛికంగా తీయడం వల్ల ఓ వర్గం ప్రజలు బాధపడుతున్నారు. ఇది మన సంస్కృతిని కాపాడుకోవడం అనే చాలా పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది' అని పోస్ట్ చేశారు.ఇంకా ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి వారం ఎవరైనా పురుషులు ఓ యాక్షన్ సన్నివేశానికి ముందు తమ చొక్కాలు చింపివేసినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని నేను ఆశ్చర్యపోతున్నా. నేను ఒకరిని ప్రేరేపించాలని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం పక్షపాత ధోరణిని మాత్రమే ప్రశ్నిస్తున్నా. సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ నా ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది. కానీ ఇక్కడ మన సంస్కృతిని కాపాడుకునే భారాన్ని ఓ వర్గం మన మహిళల భుజాలపై మాత్రమే ఎందుకు మోపింది? చాలామంది ప్రతిరోజూ ధోతీల కట్టుకుని ఎందుకు తిరగడం లేదు? వారు ప్యాంటుకు ఎందుకు మారారు? వారిలో చాలామంది ఇంగ్లీషులో ఎందుకు ట్వీట్ చేస్తారు? అన్నింటికంటే, వారు మన సంస్కృతిని కాపాడుకోవడం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు కదా? ఇలాంటి ప్రశ్నలు తెలివితక్కువవిగా, చిరాకు తెప్పించే అపరిపక్వంగా అనిపిస్తాయి కదా. అలాంటప్పుడు వారు మహిళలను వేరే ప్రమాణాలకు అనుగుణంగా ఎందుకు ఉంచుతున్నారు? దీనికి నా దగ్గర సమాధానాలు లేవు. ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి సినిమా ఈ రోజు సందర్భోచితంగా ఉందా? అవసరమా? అని నన్ను అడిగే కొద్ది మంది మాత్రమే ఈ చిత్రానికి వస్తున్న ప్రతిస్పందనలను గమనిస్తున్నారని ఆశిస్తున్నా. ఇక్కడే వారికి సమాధానం దొరుకుతుంది' అని నెటిజన్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చేశాడు. I didn’t want to react to any of this so as to not draw any more negativity towards the girl. But the accusations keep getting more and more baseless. Firstly, 20 minutes before reaching this theatre… we were trying to decide between two different theatres and where we should… https://t.co/eohxBhzGUg— Rahul Ravindran (@23_rahulr) November 14, 2025 -
‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. ముఖ్య అతిథిగా విజయ్ (ఫొటోలు)
-
‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
రష్మికది చాలా మంచి మనసు
‘‘రష్మికని నేను ‘గీత గోవిందం’ సినిమా నుంచి చూస్తున్నా.. నిజ జీవితంలోనూ తను భూమానే. తను ఇన్నోసెంట్. తన గురించి ఆలోచించదు.. సెట్స్‌లో అందరూ సంతోషంగా ఉండాలి.. డైరెక్టర్ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుంటుంది. డైరెక్టర్ ఏది చేయమంటే అది చేస్తుంటుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ‘నన్ను ఎవడన్నా ఏదైనా గెలికితే నేను మళ్లీ రివర్స్‌లో వెళతాను. కానీ, రష్మిక ఏంటంటే... ప్రపంచంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడుతుంది.. అంత మంచి మనసు తనది. తను నిజంగా అమేజింగ్ ఉమన్’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 20.4 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నన్ను ఎంత భావోద్వేగానికి గురి చేసిందంటే చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా సన్నివేశాల్లో మనసు బరువెక్కిన అనుభూతి కలిగింది. ఈ మధ్య నేను చూసిన గొప్ప చిత్రాల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఒకటి. ఈ సినిమా ఇటు ఇండియాలో అటు విదేశాల్లో హ్యూజ్ సక్సెస్ అందుకుంది. ఇలాంటి సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాని నంబర్స్‌తో పోల్చలేం. ఈ చిత్రం సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరూ మీ లైఫ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి మూవీ చేసి జీవితం పరిపూర్ణం చేసుకున్నారు’’ అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’కి హీరో మా డైరెక్టర్ రాహుల్. మా ‘గీత గోవిందం’లో నటించిన రష్మిక.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో మా సంస్థకు వన్నె తెచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘ది గర్ల్‌ఫ్రెండ్’లో నేను చేసిన భూమా పాత్రలో ఏం జరిగిందో నా జీవితంలోనూ అలానే జరిగింది. మనందరి జీవితాల్లోనూ జరిగి ఉంటుంది. ఈ చిత్రం కోసం మొదటిసారి రాహుల్‌కి సరెండర్ అయిపోయి పనిచేశాను. ఈ సినిమాని మీరు (ప్రేక్షకులు) అర్థం చేసుకున్నారు.. బాగా కనెక్ట్ అయ్యారు.. అదే నాకు పెద్ద అవార్డుతో సమానం. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. తనలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి’’ అని తెలిపారు. ‘‘భూమా పాత్రలో నటించడం ద్వారా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు రష్మిక’’ అన్నారు విద్య కొప్పినీడి. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రశంసలతో జాతీయ అవార్డు పొందినంత సంతోషంగా ఉంది’’ అని ధీరజ్ మొగిలినేని పేర్కొన్నారు. ‘‘నా గత సినిమా (మన్మథుడు 2) రిలీజై ఆరేళ్లయింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్, పాటల రచయిత రాకేందు మౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, నటి రోహిణి తదితరులు మాట్లాడారు. -
‘గర్ల్ ఫ్రెండ్’కి రూ.20 కోట్లు
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు."ది గర్ల్ ఫ్రెండ్" మూవీ సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. కానీ రెండో రోజు నుంచి పాజిటివ్ మౌత్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. -
‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
స్టార్ హీరోలతో సినిమా.. రిగ్రెట్ ఫీల్ అవుతున్నానన్న హీరోయిన్
నేను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు గానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా’ అని అన్నారు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటీ కీలకపాత్రలో, రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుర్గ అనే క్యారెక్టర్లో అను నటించింది. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో తాజాగా అను మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలతో పాటు తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.→ ఈ సినిమా కోసం మొదట ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను.→ ఈ చిత్రంలో దుర్గ క్యారెక్టర్ లో నటించాను. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంవేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా. రాహుల్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. నా క్యారెక్టర్ ఒక్కటే కాదు, అన్ని పాత్రలను చేయి పట్టి నడిపించారు. కమర్షియల్ మూవీస్ లో మాతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు.→ ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చేసరికే రశ్మికను భూమా పాత్రకు తీసుకున్నారు. నేను భూమా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ లో మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలను జస్టిఫై చేసేలా మూవీ రూపొందించారు.→ నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించాను. అయితే నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా.→ ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాను. "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి.→ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. -
ఆయన గట్టి గట్టిగా అరిచాడు.. నేనైతే ఏడ్చేదాన్ని: అను ఇమ్మాన్యుయేల్
తమిళ సినిమా 'అదర్స్' ప్రమోషన్లలో నటి గౌరీ కిషన్‌కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో 'మీ బరువెంత?' అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించడం వివాదస్పదమైంది. సినిమా గురించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నా పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడిగారని సదరు జర్నలిస్ట్‌పై గౌరీ ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్ గౌరికి మద్దతు తెలుపుతూ.. జర్నలిస్ట్‌ని ట్రోల్ చేశారు. చివరకు సదరు జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. జర్నలిస్ట్ సారీని గౌరీ అంగీకరించలేదు. 'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. ఆయన ప్రశ్నని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని.. ఆయన బాడీ షేమింగ్ చేయలేదనడం కరెక్ట్ కాదు’ అంటూ ఆయన క్షమాపణలను తోసిపుచ్చింది. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు చిత్రపరిశ్రమం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel ) స్పందించింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న చాలా తప్పని అను చెప్పింది. ఒకరి బాడీపై కామెంట్స్ చేసే అధికారం ఎవరికీ లేదని అను పేర్కొంది.గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గౌరి కిషన్ ఇష్యూ గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానం చెప్పారు. ‘నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఏడ్చేదాన్నేమో. ఆ జర్నలిస్ట్ గౌరీపై గట్టి గట్టిగా అరిచాడు. కానీ ఆమె ధైర్యంగా ఎదురించింది. హీరోని సినిమా విషయాల గురించి చక్కగా అడిగిన ఆ జర్నలిస్ట్.. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి ‘బరువెంత?’అని అడిగాడు. సినిమాకు ఆమె బరువుకు ఏం సంబంధం? హీరోయిన్ అంటే లిప్‌స్టిప్ పెట్టుకొని మంచిగా రెడీ అయి ఉండడమేనా? అంతకు మించి కూడా మాలో వేరే టాలెంట్ ఉంటుంది. అది గుర్తించండి’ అని అను ఇమ్మాన్యుయేల్ పేర్కొంది. -
'గర్ల్‌ఫ్రెండ్' కోసం వస్తున్న బాయ్ ఫ్రెండ్
పాన్ ఇండియా సెన్సేషన్ హీరోయిన్ రష్మిక.. గత 11 నెలల్లో ఐదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీసెంట్గా అయితే 'ద గర్ల్‌ఫ్రెండ్' మూవీతో వచ్చింది. దీనికి అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు రష్మిక కోసం స్వయంగా విజయ్ దేవరకొండ కూడా రాబోతున్నాడు.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)'గర్ల్‌ఫ్రెండ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్.. సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండని తీసుకొస్తానని అన్నారు. ఇప్పుడు అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్. సాధారణంగా చూస్తే ఇందులో పెద్ద విషయమేం ఉండదు. కానీ గతకొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నాళ్ల క్రితమే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం అనధికారికంగా బయటకొచ్చినా విజయ్ గానీ రష్మిక గానీ బయటపడట్లేదు.ఎంగేజ్మెంట్ రూమర్స్ తర్వాత విజయ్-రష్మిక కలిసి తొలిసారి స్టేజీపై కనిపించబోతున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడుతారా అనేది చూడాలి? మరోవైపు విజయ్-రష్మికల పెళ్లి గురించి కూడా అప్పుడే రూమర్స్ వచ్చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని అంటున్నారు. ఇప్పుడు కనిపించబోతున్న ఈవెంట్లో వివాహం గురించి కూడా ఏమైనా హింట్ ఇస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?) -
'గర్ల్‌ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
హీరోహీరోయిన్లు అన్నాక సినిమాలు చేస్తారు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ గత కొన్నాళ్లలో కొందరు సెలబ్రిటీలు.. ముందు మూవీస్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత పారితోషికాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కూడా 'ద గర్ల్‌ఫ్రెండ్' విషయంలో ఇలానే చేసినట్లు తెలుస్తోంది. మూవీ విడుదలకు ముందు ఓ ఈవెంట్లో నిర్మాత ధీరజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిలీజ్ తర్వాత తనకు డబ్బులివ్వాలని రష్మిక చెప్పిన సంగతి బయటపెట్టారు.'గర్ల్‌ఫ్రెండ్' రీసెంట్‌గానే (నవంబరు 07న) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ కలెక్షన్ నంబర్స్ పెరుగుతున్నాయి. దీంతో రష్మిక రెమ్యునరేషన్ ఎంత తీసుకుందా అనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ.5-6 కోట్ల వరకు అందుకుంటోందట. 'గర్ల్‌ఫ్రెండ్' కోసం మాత్రమే రూ.3 కోట్లు చాలానే అందట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)కొన్నిసార్లు కొన్ని సినిమాలు.. ఆయా హీరోహీరోయిన్లకు కిక్ ఇస్తుంటాయి. బహుశా రష్మికకు కూడా 'గర్ల్‌ఫ్రెండ్'తో ఇలాంటి సంతృప్తి లభించినట్లు ఉంది. అందుకే సాధారణంగా తీసుకునే దానికంటే తక్కువగానే తీసుకుందని మాట్లాడుకుంటున్నారు. దీంతో రష్మిక మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అలానే ప్రస్తుతం ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కాలంలో ఈమె నుంచి ఐదు వైవిధ్య భరిత సినిమాలు రావడం విశేషం.'ద గర్ల్‌ఫ్రెండ్' విషయానికొస్తే.. భూమా(రష్మిక) ఎం.ఏ లిటరేచర్ స్టూడెంట్. తండ్రి(రావు రమేశ్)ని ఒప్పించి హస్టల్లో చేరుతుంది. కానీ కాలేజీలో చేరిన తొలిరోజే భూమా, విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమలో పడతారు. విక్రమ్‌ని దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం భూమానే ప్రేమిస్తాడు. రిలేషన్లో మానసికంగా, శారీరకంగా చాలానే దూరం వెళ్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..) -
అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)
-
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్‌బాబు బావమరిది సుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్‌లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
-
రష్మిక మందన్నా లవ్ లెటర్.. నెట్టింట వైరల్
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా (The Girlfriend Movie)లో నటనకు రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు జాతీయ అవార్డు రావాల్సిందే! నిన్నటివరకు ఇది అల్లు అరవింద్ మాట.. కానీ, ఈ సినిమా చూశాక చాలామందిదీ ఇదే మాట! రష్మికకు అవార్డు ఇచ్చి తీరాల్సిందే.. అంత అద్భుతంగా నటించింది అని కొనియాడుతున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. మీ అందరికీ నా ప్రేమలేఖరాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (నవంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ లవ్ లెటర్ రాసింది. అమ్మాయిలందరికీ దాన్ని అంకితమిచ్చింది. అందులో ఏముందంటే.. స్త్రీగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ నా ప్రేమలేఖ.. 'నీకేం తెలుసు?' అన్న ప్రశ్న ఎదుర్కొనే ప్రతి అమ్మాయి 'తనకేం కావాలో బాగా తెలుసు' అనే స్థాయికి చేరుకుంటుంది. ఈ జర్నీ చిన్నదేమీ కాదు. ప్రేమ అంటే బంధీ అవడం కాదునువ్వు ఎంతోదూరం వచ్చావ్.. ఇప్పటికైనా నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను చూసి నువ్వు గర్వపడు. ఇలాంటి అమ్మాయిలకు అండగా నిలబడిన అబ్బాయిలు.. మీ ప్రేమ వల్లే తాను ఇంత ధైర్యంగా నిలబడగలిగింది. ప్రేమలో ఎవరూ మాట్లాడని విషయాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవడం కాదు, స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. మనసును తేలిక చేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం. మిమ్మల్ని మీరు ప్రేమించండినా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ మనసును తాకుతుందని, మీ బలాన్ని మీకు గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారని అనుకుంటున్నాను. అదే గనక నిజమైతే నా ఆశయం నెరవేరినట్లే! నిశ్శబ్ధాన్ని చీల్చుకుని ధృడసంకల్పంతో ముందడుగు వేసేవారికి.. వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారికోసమే నా ఈ ప్రేమలేఖ అని ట్వీట్ చేసింది. ఈ లవ్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. A love letter to all the girlies growing into the woman they love.To every Girl who was told “what do you know”… and yet grew into a woman “who knows what she wants”.You’ve come a long way, give yourself that proud, tight Hug🫂 And to the men who’ve loved, not by leading,…— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ -
ది గర్ల్‌ఫ్రెండ్ చూసి నా భార్య, నేను ఎమోషనలయ్యాం!
‘‘తెలుగులో నేను అంగీకరించిన తొలి సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend Movie). కాకపోతే ‘ఖుషి’ తో నా ఎంట్రీ జరిగింది. ‘ఖుషి, హాయ్ నాన్న, మనమే, 8 వసంతాలు’... ఇలా నా మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రాలతో పోల్చినప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి కాస్త విభిన్నమైన సంగీతం అందించాను. ఎందుకంటే... ఇది ఇంటెన్స్ లవ్‌స్టోరీ’’ అని చెప్పారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab). రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నా భార్యతో సినిమా చూశా..రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు, నేటి తరం యువత, తల్లిదండ్రులు ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను కచ్చితంగా చూడాలన్నది నా అభిప్రాయం. నా భార్యతో కలిసి నేను ఈ సినిమా చూశాను. మేం భావోద్వేగానికి లోనయ్యాం. నేటి సమాజంలోని ఓ అంశాన్ని ప్రస్తావించారు రాహుల్ రవీంద్రన్. రష్మిక, దీక్షిత్ అద్భుతంగా నటించారు. సంగీతానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు. ఆ సినిమాకు ఏఐ వాడా..కానీ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో కొంత ఏఐ వాడాం. ‘హాయ్ నాన్న’ సినిమాకు సంగీతంలో ఏఐ వాడాను. ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నాను. తమిళంలో ఓ సినిమాకు, కన్నడంలో గణేశ్‌గారి సినిమాకు సంగీతం అందిస్తున్నాను. కన్నడలో నా తొలి మూవీ ఇది. హిందీలో నా తొలి సినిమా ఖరారైంది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది’’ అని చెప్పారు.చదవండి: సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో.. -
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ
నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend Review). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్‌స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’పై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..భూమా(రష్మిక) తండ్రి(రావు రమేశ్)చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వచ్చి రామలింగయ్య ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. విక్రమ్(దీక్షిత్ శెట్టి), దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా అదే కాలేజీలో చేరతారు.విక్రమ్ ఆవేశపరుడు. అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్)..విక్రమ్‌ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. లవ్, రిలేషన్‌కు దూరంగా ఉండాలనుకుంటూనే..భూమా కూడా విక్రమ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేదే మిగతా కథ(The Girlfriend Review)ఎలా ఉందంటే..అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలాంటి పనులే చేయాలని చెప్పే ‘మగమహారాజులు’ చాలా మందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి..ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని భర్తలు.. ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని.. మాటలతో హింసించే బాయ్‌ప్రెండ్స్ ఇప్పటీకీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి.. ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్‌ఫ్రెండ్’. మనల్ని కంట్రోల్ చేసే పవర్‌ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలి అని చెప్పే సినిమా ఇది. కథగా చూస్తే..ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ. కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షవర్ సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిరర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పు వచ్చే సింబాలిక్ షాట్స్.. ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటిచెబుతాయి.ఇదంతా ఒకవైపు.. ఇక లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే.. పాత చింతకాయపచ్చడి కథేలాగే కనిపిస్తుంది. అంతేకాదు నాణానికి ఒకవైపే చూపించాడని.. రెండో వైపు కూడా ఉంటుంది కదా..దర్శకుడు అదేలా మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాడ్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరీ పాత్రలూ.. మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే.. సెకండాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా..తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే..కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు ల్యాగ్ చేసినా..‘ది గర్ల్‌ఫ్రెండ్’ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలోని భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె అద్బుతంగా నటించింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. చాలా బాగా నటించింది. రావు రమేశ్ ఒకటి రెండు షాడ్స్తో కనిపించినా..తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు, ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం రెండూ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మంచి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది
‘‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు... సంతృప్తి. ఒక నిర్మాతగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్‌లాంటి సున్నితమైన మనసు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా రూపొందించగలరు. మన అక్క, చెల్లి, పిన్నిల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి ఆశలు ఉంటాయి? అనుకుని ఈ మూవీ చూడాలి. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ నటన నచ్చి, మరో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో రష్మిక నటన ఈ దశాబ్దంలో ఒక మహిళా నటి తెలుగులో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలుస్తుంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ సమావేశంలో దీక్షిత్, ధీరజ్, విద్య కొప్పినీడి తదితరులు పాల్గొన్నారు. -
రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. -
డైరెక్టర్‌కు బంపరాఫర్.. నీ సొంతింటి బాధ్యత నాదే: టాలీవుడ్ నిర్మాత
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మూవీ నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ రవీంద్రన్ తనతో ఓ మాట అన్నారని తెలిపారు. ఈ మూవీ సూపర్ హిట్ అయితే నెక్ట్స్ మూవీకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఓ ఇల్లు కొనుక్కుంటానని నాతో చెప్పారని అన్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు హైదరాబాద్‌లో ఇప్పటివరకు సొంతిల్లు లేదన్నారు. ఈ సినిమా హిట్ అయితే నేనే మీ ఇంటి కలను నెరవేరుస్తానని నిర్మాత ధీరజ్ మొగిలినేని హామీ ఇచ్చారు.కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్
'అందాల రాక్షసి' హీరోగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన రాహుల్ రవీంద్రన్.. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. మరోవైపు దర్శకుడిగానూ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. పాన్ ఇండియా సెన్సేషన్ రష్మికతో 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తీశాడు. ఈ శుక్రవారం ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్.. తన భార్య తాళిబొట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'నాకు పెళ్లి అయిన తర్వాత.. మంగళసూత్రం (తాళి) మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది ఓ వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధన మహిళలకు మాత్రమే ఉండటం సరికాదు' అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని కూడా పాజిటివ్‌గానే తీసుకుంటున్నాడు. తాజాగా రాహుల్ ఇలా అన్నాడని చెప్పి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దానికి స్పందించిన ఓ నెటిజన్.. 'నీ మీదున్న గౌరవం పోయింది రాహుల్ అన్న' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన రాహుల్.. 'ఒకరి మాటలతో ఏకీభవించకపోవడం, ఒకరిపై గౌరవం పోవడం ఓకే బడ్డీ. కానీ నువ్వు ఈ విషయాన్ని కూడా గౌరవంగా సంభోదిస్తూ చెప్పావ్ చూడు. ఆ విషయంలో నిన్ను మెచ్చుకుంటున్నాను' అని అన్నాడు.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా విషయానికొస్తే.. రష్మిక లీడ్ రోల్ చేసింది. దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటించాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేమకథనే అయినప్పటికీ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతుందనిపిస్తోంది. రాహుల్ నటుడే అయిప్పటికీ గతంలో 'చిలసౌ' అనే మూవీతో దర్శకుడిగా మారాడు. హిట్ కొట్టాడు. తర్వాత 'మన్మథుడు 2' తీశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్టర్‌గా వస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే సింగర్ చిన్మయిని రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక కనిపించరు: దీక్షిత్ శెట్టి
‘‘మనం ఒకే తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే ఇంటివరకూ క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. నా కెరీర్లో చేసిన మూవీస్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఉత్తమ చిత్రం అని చెప్పగలను’’ అని దీక్షిత్ శెట్టి చెప్పారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ–‘‘దసరా’ చిత్రం తర్వాత రాహుల్ రవీంద్రన్‌గారు నన్ను సంప్రదించి, ‘ది గర్ల్ ఫ్రెండ్’లో విక్రమ్ పాత్రకి నేను సరిపోతానని చెప్పారు. రాహుల్‌గారికి ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ పాత్ర చేయడం సులభం అయ్యింది. ఈ సినిమా కేవలం యువత కోసమే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో రష్మికగారి నటన చూశాక ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి మరో నాయిక న్యాయం చేయలేదేమో? అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై రష్మిక కనిపించరు.. ఆమె చేసిన భూమా పాత్ర మాత్రమే కనిపిస్తుంది.రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ టైమ్‌లో అల్లు అరవింద్‌గారు రషెస్ చూసి, పిలిస్తే వెళ్లాను. ఆయన నన్ను అభినందించి, తర్వాతి చిత్రానికి అడ్వాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. విద్య, ధీరజ్గార్లు మా యూనిట్‌కి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మా సినిమాకు హైలైట్ అవుతుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు ఇష్టం. అందుకే తెలుగు భాషని కూడా నేర్చుకున్నాను. విక్రమ్ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.బాగా నటిస్తే భాషతో సంబంధం లేకుండా ఆయా నటీనటులను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘దసరా’ చిత్రం నుంచి హీరో నానిగారితో నా అనుబంధం కొనసాగుతోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్, ట్రైలర్ బాగున్నాయంటూ ఆయన ప్రశంసించడం సంతోషం. ఇక నేను కన్నడలో నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా, కేజేక్యూ’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్‌కుమార్‌గారితో కలిసి ఓ మూవీ చేస్తున్నా. మలయాళంలో నటించిన ‘ఏంజెల్ నెం.16’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని తెలిపారు. -
రిస్క్ తీసుకునేంతలా కథ నచ్చింది: నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
‘‘కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమౌతోంది. దీంతో థియేట్రికల్‌గా బాగుంటాయనుకునే కథలనే ఎంపిక చేసుకుంటున్నాం. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ థియేట్రికల్ మూవీ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. రష్మికా మందన్నా లీడ్ రోల్లో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా స్టోరీ నచ్చింది. ఈ చిత్రం హీరోయిన్ కోణంలో ఉంటుంది... అంతే. కన్నడ మార్కెట్ కోసం దీక్షిత్‌ను తీసుకోలేదు. అతను మంచి పెర్ఫార్మర్ అనే తీసుకున్నాం. రాహుల్ చేసిన గత సినిమాల గురించి మేం ఆలోచించలేదు. రాహుల్ రాసిన ఈ కథ నచ్చి, ఈ సినిమా చేశాం. పారితోషికం తీసుకోకుండానే రష్మిక ఈ సినిమా చేశారు. ఆ కృతజ్ఞతతో ఆమెకు రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్ ప్రాధాన్యం ఉన్న అతిథి పాత్ర చేశారు. నిర్మాత విద్య, నేను సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చిత్రాన్ని మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. అల్లు అరవింద్‌గారు మాకు మంచి సపోర్ట్‌గా ఉంటారు’’ అని అన్నారు. మరో నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ– ‘‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రెగ్యులర్ సినిమా కాదు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం.దర్శకుడిగా రాహుల్‌కు జాతీయ అవార్డు రావొచ్చనే ప్రశంసలు సెన్సార్ వారి నుంచి వచ్చాయి. ఈ చిత్రంలోని నాలుగు పాటలు, రెండు బిట్ సాంగ్స్‌కి హేషమ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు ఓ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడం అంత సులువైన పని కాదు. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి, సినిమాలు చేయాల్సి వస్తోంది. అరవింద్‌గారు ఇచ్చే సలహా కూడా ఇదే’’ అని చెప్పారు. -
‘ది గర్ల్‌ఫ్రెండ్’.. రష్మికకు రెట్టింపు రెమ్యునరేషన్.. కారణం ఇదే!
‘ది గర్ల్‌ఫ్రెండ్’ కథ రష్మికకు బాగా నచ్చింది. నెరేషన్ ఇవ్వగానే వెంటనే ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం అని చెప్పింది. రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించింది. అందుకే కృతజ్ఞతతో ఇప్పుడు మేము రెట్టింపు రెమ్యునరేషన్ ఇస్తున్నాం’ అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు ధీరజ్, విద్య కొప్పినీడి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ లాక్ డౌన్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత థియేటర్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఆ టైమ్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్ గా కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది.→ మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్ నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది.→ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం. దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్ కు ఉపయోగపడుతుందని అనుకోలేదు, ఆ క్యారెక్టర్ కు ఆయన కరెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నాం. అయితే రశ్మిక, దీక్షిత్ ఉండటం వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతుంది.→ తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలూ ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైమ్ సరిపోక కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేయడం లేదు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను ఈ నెల 7న హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మరో వారం తర్వాత ఈ నెల 14న తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తాం. ముంబైలో ఒక ఈవెంట్ చేయాలనే ప్లాన్ ఉంది.→ అనూ ఇమ్మాన్యుయేల్ మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు ఆమె పర్పెక్ట్ గా కుదిరింది. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం. కానీ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం.→ కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. థియేట్రికల్ గా ఇది బాగుంటుంది అనే స్టోరీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. గీతా ఆర్ట్స్, అరవింద్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. ‘ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు’ అని నిర్మాత విద్య కొప్పినీడి అన్నారు. -
నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం
తెలుగులో చాలావరకు పెద్ద సినిమాలన్నీ పండగల్ని టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ ఏడాదికి అన్ని పండగలు అయిపోయాయి. మిగిలింది క్రిస్మస్ మాత్రమే. దానికి ఇంకా చాలా సమయముంది. నవంబరులో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రిలీజులేం ఉండవు. ఈసారి మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటాయనే పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ నవంబరులో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలేంటి? వాటి సంగతేంటి?గత రెండు నెలలు (సెప్టెంబరు, అక్టోబరు) టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్ చిత్రాలతో కాస్త హిట్ కళ కనిపించింది. నవంబరులోనూ అలా అరడజనుకు పైగా కాస్త పేరున్న మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో రష్మిక ద 'గర్ల్ ఫ్రెండ్', దుల్కర్ సల్మాన్ 'కాంత', రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్) తొలివారంలో రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్' రానుంది. ఇది హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. ఎందుకంటే ఈమె చేసిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ట్రైలర్ అయితే డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది. మరోవైపు మహేశ్ బాబు బావమరిది సుధీర్ బాబు 'జటాధర'తో ఈ వారమే రానున్నాడు. ప్రస్తుత ట్రెండ్ అయిన సూపర్ నేచురల్ ఎలిమింట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. ఇది హిట్ కావడం కూడా హీరోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా సుధీర్ బాబుకి హిట్ లేదు. వీటితో పాటు తిరువీర్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం కూడా ఇదే వారం రానుంది.రెండో వారంలో దుల్కర్ సల్మాన్ 'కాంత' వస్తుంది. ఓ దర్శకుడు, హీరో, హీరోయిన్.. వాళ్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్‌తో తీసిన పీరియాడిక్ మూవీ ఇది. గతేడాది 'లక్కీ భాస్కర్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీతో హిట్ కొట్టిన దుల్కర్.. ఈసారి కూడా హిట్ కొడితే టాలీవుడ్లో సెటిలైపోవచ్చు. ఇదే రోజున చాందిని చౌదరి 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మూవీ రానుంది. దీనిపై పెద్దగా అంచనాల్లేవు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)మూడోవారానికి ప్రస్తుతానికి కొత్త సినిమాలేం షెడ్యూల్ కాలేదు. చివరి వారంలో మాత్రం రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఒక్కటే రానుంది. మాస్‌ని నమ్ముకుని గత రెండు మూడు మూవీస్‌తో పూర్తిగా నిరాశపరిచిన రామ్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇతడి కోరిక 'ఆంధ్రా కింగ్ తాలుకా'తోనైనా నెరవేరుతుందా అనేది చూడాలి? ఈ చిత్రంతో పాటు 'కాంత'లోనూ భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్. అంటే రెండు వారాల గ్యాప్‌లో భాగ్యశ్రీ రెండు చిత్రాలతో తన అదృష్టం పలకరించుకోనుంది.పైన చెప్పిన సినిమాలే కాకుండా మోహన్ లాల్ 'వృషభ' (నవంబరు 06), కృష్ణలీల (నవంబరు 7), ప్రేమిస్తున్నా (నవంబరు 07), స్కూల్ లైఫ్ (నవంబరు 14), ధనుష్ హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే' (నవంబరు 28) తదితర సినిమాలు కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన) -
రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. -
అప్పుడే హీరోగా వద్దనుకున్నా : రాహుల్ రవీంద్రన్
‘నేను అసిట్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయి కదా అని హీరోగా నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్ రైటింగ్ సైడే ఉండేది. ఇప్పుడు కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. నేను డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ చేసినప్పుడే హీరోగా వద్దు అనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్ అనేది నా కెరీర్ గా భావిస్తా’ అన్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన దర్శకత్వంలో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేసింది. ఇలా టైమ్ ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ చేసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి "ది గర్ల్ ఫ్రెండ్" కథ పంపాను. నేను, రష్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సిఉండేది. "ది గర్ల్ ఫ్రెండ్" కథను అల్లు అరవింద్ గారు చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రష్మిక, మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం.→ రష్మికకు స్క్రిప్ట్ పంపినప్పుడు చదివి చెప్తానంది. రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా చదివి కాల్ చేసింది. ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం, ఇలాంటి కథ ఆడియెన్స్ కు చెప్పాలి, ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను, బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పింది. నేను ఏ కథ రాసినా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్..ఇలా కొంతమందికి పంపిస్తుంటా. అలా "ది గర్ల్ ఫ్రెండ్" కథ కూడా పంపాను. సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారనే వార్తలూ వచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివాక, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటారని సజెషన్ ఇచ్చింది.→ టీజర్, ట్రైలర్ లో ఆడియెన్స్ ను కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్ లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్ లో ఉంటుంది. ఈ డ్రామా సర్ ప్రైజ్ చేస్తుంది. ఒక జంట లైఫ్ లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్ లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్ లో చేశాం.→ రష్మిక యానిమల్ సినిమా రిలీజై వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. ఆమెను ఇంత రియలిస్టిక్ గా చూపిస్తున్నాం, అక్కడేమో యానిమల్ ఆడియెన్స్ మీద మరో ఇంప్రెషన్ వేస్తోంది అని అనుకున్నా. రష్మికకు నా సందేహం తెలిసి, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని సపోర్ట్ చేసింది. మనం వుమెన్ సెంట్రిక్ మూవీస్ అని పిలుస్తుంటాం కానీ ఆ ముద్ర పోయేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం.→ ఈ మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్టరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయితే వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సివచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్ కు పర్పెక్ట్ గా సెట్ అయ్యింది.→ నా లైఫ్ లో నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్న ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్ పైర్ అయి కథ రాస్తుంటాను. దర్శకుడిగా నాకొక తరహా, ఒక ముద్ర ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను కొన్ని మూవీస్ చేశాక అందులో నా తరహా విలువలు, నమ్మకాలు చూసి ఆడియెన్స్ కు రాహుల్ డైరెక్షన్ లో ఇలాంటి సెన్సబిలిటీస్ ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతుందేమో.→ నెక్ట్స్ నేను డైరెక్ట్ చేయబోయో రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రష్మిక నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ గా రష్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సిఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది. -
వర్కింగ్ అవర్స్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ నటీనటుల పని గంటలపై గతకొంత కాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. నిర్దిష్ట పనివేళలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. ‘ది గర్ల్‌ప్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘నటీనటులకే కాదు దర్శకుల నుంచి లైట్‌మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉంటే బాగుంటుంది. దాని వల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుంది. ఇకపై నేను ఫ్యామిలీపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నా. భవిష్యత్తు గురించే నా ఆలోచనంతా. తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే ఊహిస్తుంటా’ అని రష్మిక అన్నారు.ఎనిమిది గంటలే పని చేస్తానని డిమాండ్ చేయడంతో దీపికా పదుకొణెను స్పిరిట్ చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు వర్కింగ్ అవర్స్‌పై స్పందించారు. ది గర్ల్‌ఫ్రెండ్ విషయానికొస్తే.. ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానుంది. -
‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్లో మెరిసిన రష్మికా మందన్న (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండతో పెళ్లి.. క్యూట్‌గా 'రష్మిక' సమాధానం (వీడియో)
టాలీవుడ్లో ఆన్‌స్క్రీన్ ఫేవరెట్ జంట ఎవరంటే.. విజయ్ దేవరకొండ- రష్మిక గురించే మొదట చెప్తారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని వారి సన్నిహితులు వెల్లడించారు. కానీ, ఈ జోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే, వీరిద్దరూ ఒకేరకమైన ఉంగరాలు పెట్టుకొని ఈ మధ్య కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక నటించిన కొత్త సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ ఈవెంట్లో తన పెళ్లి గురించి టాపిక్ రాగానే అవుననే సిగ్నల్ ఆమె ఇచ్చేసింది.ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో యాంకర్ వేసిన ప్రశ్నతో రష్మిక పెళ్లి గురించి మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఒక వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంపిక చేసుకోవాలంటే ఎలా జడ్జ్ చేయాలని రష్మికను యాంకర్ అడుగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి విజయ్ దేవరకొండను అడిగితే చెప్తారని సమాధానం వస్తుంది. అప్పుడు రష్మిక కూడా నవ్వుతూ కనిపిస్తుంది. రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అంటూ యాంకర్ మరో ప్రశ్న వేయగానే మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తినే అంటూ ఆన్సర్ వస్తుంది. ఆ సమయంలో రష్మిక కూడా చిరునవ్వుతో అందరికీ తెలుసే.. అంటూ చేతులతో అవుననే సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇలాగైనా ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే, వచ్చే ఏడాదిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Captures by Chan (@celebrities_tollywood_) -
కొద్దిరోజులుగా మాస్క్‌తోనే రష్మిక.. కారణం ఇదేనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజులుగా మాస్క్‌లోనే కనిపించేది.. కానీ, తాను నటించిన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్ కోసం మాస్క్ లేకుండా మెరిసింది. ట్రైలర్‌ను చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తన నటనకు ఎక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత తన గురించి మరోసారి పాన్ ఇండియా రేంజ్లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే, కొద్దిరోజులుగా రష్మిక ఎక్కడ కనిపించినా సరే మాస్క్ పెట్టుకునే ఉండేది. తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్‌కు మాత్రం మాస్క్ లేకుండానే వచ్చేశారు.రష్మిక తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించడంతో అభిమానులు కూడా ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గత వారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్ ధరించే మెరిశారు. ఆ సమయంలో ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. చాలారోజుల తర్వాత ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా కోసం మాస్క్ లేకుండా కనిపించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. మరింత గ్లామర్‌గా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు, వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి.రీసెంట్గా థామా సినిమాతో మెప్పించిన రష్మిక.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించనున్నారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 7న విడుదల కానుంది. -
అర్థరాత్రి 2 వరకు షూటింగ్.. డ్రెస్సింగ్ రూమ్‌లోనే రెస్ట్, రష్మిక కష్టాలు!
ఒకవైపు తెలుగు మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయారు నేషనల్ క్రష్ రష్మిక(Rashmika). పుష్ప సినిమా తర్వాత ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. చేతిలో మూడు, నాలుగు పాన్ ఇండియా సినిమా ఉన్నాయి. అయినా కూడా లేడీ ఓరియెంటెండ్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’కి ఓకే చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం కోసం రష్మిక చాలా కష్టపడాల్సి వచ్చిందట. అంతేకాదు ముందుగా పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా రిలీజ్ తర్వాతే తన రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పిందట. ఈ విషయం స్వయంగా చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలేనియే చెప్పారు.నేడు(అక్టోబర్ 25) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరజ్ మాట్లాడుతూ..‘నా కెరీర్ మొత్తంలో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలి అనుకుంటాను. వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. రష్మికకు కథ వినిపించగానే వెంటనే ఓకే చెప్పేసింది. తర్వాత రెమ్యునరేషన్ కోసం తన మేనేజర్ని కలిసేందుకు ప్రయత్నించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో నేరుగా రష్మికనే కలిసి పారితోషికం గురించి అడిగాను. అప్పుడు ఆమే‘నాకు ఇప్పుడు ఏం ఇవ్వకండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పారితోషికం ఇవ్వండి’ అని చెప్పింది. ఆమె చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక చాలా బిజీగా ఉంది. ఒకవైపు పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు మా సినిమా కోసం టైం కేటాయించింది. అర్థరాత్రి 2 గంటల వరకు పుష్ప 2 షూటింగ్ చేసుకొని.. ఉదయం 7 గంటలకల్లా మా సినిమా సెట్లో ఉండేది. రెండు, మూడు నెలల పాటు ఆమె సరిగ్గా నిద్రపోలేదు. ఓ సినిమా కోసం ఫారిన్ వెళ్లి..తెల్లవారుజామున 4 గంటలకల్లా హైదరాబాద్ వచ్చేది. డ్రెస్సింగ్ రూమ్‌లోనే కాసేపు రెస్ట్ తీసుకొని..ఉదయం 8 గంటలకల్లా సెట్స్‌లో ఉండేది. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది. రష్మిక లేకుంటే "ది గర్ల్ ఫ్రెండ్" సినిమానే లే లేదు’ అని ధీరజ్ ఎమోషనల్‌గా చెప్పారు. -
రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్: బ్రేక్ తీసుకుందామా?
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend Movie). హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. శనివారం (అక్టోబర్ 25న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.అదిరిపోయిన ట్రైలర్అందులో 'మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్‌లా..' అని రష్మిక డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. నువ్వు విక్రమ్‌తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్.. కానీ, వాడు నీకు కరెక్ట్ కాదు అని రష్మికకు సలహా ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఇక మరో సీన్లో.. ఇంత క్యారెక్టర్‌లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడు అంటూ రావు రమేశ్.. రష్మిక చెంప పగలగొట్టాడు. అలా ఫుల్ ఎమోషనల్‌గా ట్రైలర్ కొనసాగింది. ఆ ట్రైలర్ మీరూ చూసేయండి.. -
నేను నీకు కరెక్టేనా?
‘విక్రమ్... అందరికీ ఒక టైపు ఉంటుంది కదా... నేను నీ టైపేనా’, ‘అంటే... ఒకరికొకరు కరెక్టా? అని ఎలా తెలుస్తుంది... అంతకన్నా ఎప్పుడు తెలుస్తుంది’, ‘కొంపతీసి నేను నీకు కరెక్టేనా అని ఆలోచిస్తున్నావా ఏంటి?’, ‘నేను నీకు కరెక్టేనా? అని కూడా ఆలోచిస్తున్నా?’... ఈ సంభాషణలు‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రోమోలోనివి.రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా పేర్కొని, రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. -
ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్‌ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్
పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న రష్మిక.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో ఇది జరిగింది. అధికారికంగా బయటకు చెప్పలేదు. అయితే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని విజయ్ టీమ్ చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే త్వరలో రష్మిక పెళ్లి హడావుడిలో పడిపోతుంది. అంతకు ముందు ఈమె నటించిన ఓ రెండు మూవీస్... రెండు వారాల వ్యవధిలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!)ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. ఈ నెల 21న 'థామా' అనే హారర్ మూవీతో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన 'గర్ల్ ఫ్రెండ్' చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబరు 07న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి మరీ చెప్పుకొచ్చారు.గీతా ఆర్ట్స్ నిర్మించిన 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాగా.. రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు పాటలు రిలీజ్ కాగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. నవంబరు 07న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. ఆ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ అయితే ఏం లేవు.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్) -
రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. మెలోడీ సాంగ్ రిలీజ్
ఓవైపు స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రష్మిక.. మరోవైపు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. అదే 'గర్ల్ ఫ్రెండ్'. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ స్టోరీతో తీస్తున్నారు. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మిక సరసన నటిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో గీతాన్ని వదిలారు.చిన్మయి పాడిన ఈ పాట.. మంచి మెలోడీయస్‌గా ఉంటూనే హీరోహీరోయిన్ మధ్య లవ్ ఎలా ఉండబోతుందనేది చూపించింది. ఒకే కాలేజీలో చదువుకునే ప్రధాన పాత్రధారుల మధ్య ప్రేమని చూపించే సీన్స్ అన్నీ ఈ పాటలో కనిపించాయి. చూస్తుంటే రష్మిక.. మరి హిట్ కొట్టేలా కనిపిస్తుంది. లెక్క ప్రకారం ఈ మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. కానీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
డిఫరెంట్ సాంగ్‌లో రష్మిక.. డ్యాన్స్ మాత్రం
సాధారణంగా డ్యాన్స్ అనగానే గంతులు వేయడం లాంటి స్టెప్స్ చాలా వరకు ఉంటాయి. కానీ రష్మిక మాత్రం కాస్త డిఫరెంట్ సాంగ్‌లో కనిపించింది. డ్యాన్స్ కూడా అందుకు తగ్గట్లే ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తొలి పాటని రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'నదివే' అంటూ సాగిన ఈ పాట.. ప్రేమ సాహిత్యం తరహాలో వెరైటీగా ఉంది.(ఇదీ చదవండి: థియేటర్లలోకి రిలీజైన ఒక్కరోజుకే ఓటీటీలోకి హిట్ సినిమా)రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక లీడ్ రోల్ కాగా, 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటిస్తున్నాడు. యానిమల్, పుష్ప 2, ఛావా తదితర సినిమాలతో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. అల్లు అరవింద్ నిర్మించారు. తాజాగా రిలీజ్ చేసిన పాట చూడటానికి వినటానికి బాగానే ఉంది. మూవీని సెప్టెంబరు 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆయన నా ఫ్యామిలీ మెంబర్ లాంటోడు.. అందుకే: ప్రభాస్) -
కన్నులలో వెన్నెలలే కురిసే...
రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లుఅరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. శనివారం రష్మికా మందన్నా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ఆడియో, కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అలాగే ‘రేయి లోలోతుల సితార...’ పాట కూడా ఉంది. ‘‘కన్నులలో వెన్నెలలే కురిసే, మది మోసే తల వాకిట తడిసే..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీ పాద పాడారు. -
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.ఈ రోజు(ఏప్రిల్ 5)రష్మిక బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్"(The Girlfriend) సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక వారియర్ లుక్ లో గన్, కత్తితో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలో వచ్చే పోయెమ్ ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. 'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే - 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


