రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీ.. ఎమోషనల్ సాంగ్‌ రిలీజ్ | Rashmika Mandanna’s The Girlfriend New Song “Neede Katha” Out Now | Emotional Hit | Sakshi
Sakshi News home page

The Girlfriend Movie: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌.. ఎమోషనల్ సాంగ్‌ రిలీజ్

Nov 5 2025 5:00 PM | Updated on Nov 5 2025 5:17 PM

Rashmika Mandanna The Girlfriend Needhe Katha Lyrical Video out now

దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా  రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement