సినీ నటీనటుల పని గంటలపై గతకొంత కాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. నిర్దిష్ట పనివేళలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. ‘ది గర్ల్ప్రెండ్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘నటీనటులకే కాదు దర్శకుల నుంచి లైట్‌మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉంటే బాగుంటుంది. దాని వల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుంది.
ఇకపై నేను ఫ్యామిలీపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నా. భవిష్యత్తు గురించే నా ఆలోచనంతా. తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే ఊహిస్తుంటా’ అని రష్మిక అన్నారు.
ఎనిమిది గంటలే పని చేస్తానని డిమాండ్ చేయడంతో దీపికా పదుకొణెను స్పిరిట్ చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు వర్కింగ్ అవర్స్‌పై స్పందించారు. ది గర్ల్‌ఫ్రెండ్ విషయానికొస్తే.. ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానుంది.


