నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.
"ది గర్ల్ ఫ్రెండ్" మూవీ సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. కానీ రెండో రోజు నుంచి పాజిటివ్ మౌత్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.


