లోకేశ్ కనగరాజ్ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు గ్యారెంటీ! ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించాడు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' సినిమా మిక్స్‌డ్ టాక్‌తోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
వేలల్లో విమర్శలు
ఈ విమర్శలు, కలెక్షన్స్‌పై లోకేశ్ తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. కూలీ సినిమాకు వేలకొద్దీ విమర్శలు వచ్చాయి. ఎక్కడ తప్పు చేశానో గుర్తించి దాన్ని నెక్స్ట్ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకుంటాను. అయితే ఓపక్క విమర్శిస్తూనే రజనీకాంత్ సర్ కోసం మా సినిమా ఆదరించారు. ఈ చిత్రానికి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మా నిర్మాత చెప్పారు.
గతంలో ఏమన్నాడంటే?
అంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. గతంలోనూ కూలీ మూవీకి వచ్చిన మిశ్రమ స్పందన గురించి మాట్లాడుతూ.. జనాల అంచనాలకు తగ్గట్లుగా తాను కథలు రాయలేనన్నాడు. తాను రాసిన కథ వారి అంచనాలను అందుకుంటే మంచిది. లేదంటే వాళ్లు సంతోషపడేవరకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.
వార్ 2పై కూలీ విజయం
కూలీ విషయానికి వస్తే.. ఇందులో రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ రచిత రామ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2 సినిమాతో పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్‌లో వార్ 2ని దాటేయడం విశేషం!
చదవండి: మొన్న ఆమిర్.. ఇప్పుడు షారూఖ్


