రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.
రజనీకాంత్ సినిమాలో గెస్టులు
జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
మిక్స్‌డ్ టాక్
అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్.
జైలర్ 2లో సూపర్ స్టార్
ఇందులోనూ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.


