breaking news
Rahul Raveendran
-
పౌడర్ వేసుకున్నానని.. తిట్టారు: లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన తొలి తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా నటించారు. వారిద్దరికి కూడా హీరోలుగా ఇదే తొలి సినిమా. 2012లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. సినిమాలోని డైలాగ్స్, పాటలు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ క్లాసిక్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది. జూన్ 13న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా లావణ్యతో పాటు చిత్రబృందం అంతా మరోసారి సినిమా కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో సినిమా షూటింగ్ నాటి అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా లావణ్య ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. హీరోలతో పాటు తను కూడా మేకప్ లేకుండానే నటించానని చెప్పింది. ఓ సారి అనుకోకుండా ముఖానికి మేకప్ వేసుకొని వస్తే.. దర్శకుడు హను రాఘవపూడి తిట్టాడని చెప్పింది. ‘ఈ సినిమా కోసం నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదు. రియల్ హెయిర్‌తోనే నటించాను. కనీసం పౌడర్ కూడా వేసుకోలేదు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లోనే నేను పౌడర్ వేసుకొని సెట్‌కి వచ్చాను. దర్శకుడు హను ఫోటో తీసి నా దగ్గరకు వచ్చి జూమ్ చేసి చూపించాడు. నీ ముఖంపై పౌడర్ పటికలు ఎలా కనిపిస్తున్నాయో చూడు’ అన్నారు. వెంటనే నేను ముఖం కడుక్కొని వచ్చాను’ అంటూ నాటి షూటింగ్ అనుభవాలను లావణ్య పంచుకున్నారు. ఇక రాహుల్ మాట్లాడుతూ.. జీరో మేకప్‌తో సినిమా చేశాం. కనీసం సన్‌స్క్రీన్ కూడా వాడలేదని చెప్పారు. -
ఢిల్లీలో 66వ జాతీయ అవార్డు ప్రదానోత్సవం
-
అరుదైన అవకాశం ఇది!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, షానీ, భానుశ్రీ మెహ్రా, ఖుషి హెబా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా’. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రానికి అనీల్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు మురళీమోహన్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. మరో అతిథి కోన వెంకట్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పాల్గొన్న నాని, ఆది, ప్రిన్స్, లావణ్య త్రిపాఠి, రిచా పనయ్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ -‘‘అప్‌కమింగ్ హీరోలకు అన్ని కోణాలున్న పాత్రలు చేసే అవకాశం రావడం కష్టం. అలాంటి అరుదైన అవకాశం ఈ చిత్రం ద్వారా నాకు లభించింది’’ అని చెప్పారు. మంచి పాటల కుదిరాయని చిత్రసంగీతదర్శకుడు భీమ్స్ తెలిపారు. ఇదొక చక్కని ప్రేమకథా చిత్రమనీ, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెప్పారు.