‘ది గర్ల్‌ఫ్రెండ్‌’.. రష్మికకు రెట్టింపు రెమ్యునరేషన్‌.. కారణం ఇదే! | Dheeraj Mogilineni Talk About The Girlfriend Movie, Reveals Rashmika Remuneration Details | Sakshi
Sakshi News home page

అందుకే రష్మికకు రెమ్యునరేషన్‌ రెట్టింపు ఇస్తున్నాం : ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నిర్మాత

Nov 1 2025 6:35 PM | Updated on Nov 1 2025 6:57 PM

Dheeraj Mogilineni Talk About The Girlfriend Movie, Reveals Rashmika Remuneration Details

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ కథ రష్మికకు బాగా నచ్చింది. నెరేషన్‌ ఇవ్వగానే వెంటనే ఈ ప్రాజెక్ట్‌ చేసేద్దాం అని చెప్పింది. రెమ్యునరేషన్‌ తీసుకోకుండా నటించింది. అందుకే కృతజ్ఞతతో ఇప్పుడు మేము రెట్టింపు రెమ్యునరేషన్‌ ఇస్తున్నాం’ అన్నారు నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. రష్మిక-దీక్షిత్శెట్టి జంటగా నటించిన తాజా చిత్రంది గర్ల్ఫ్రెండ్‌’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. నెల 7 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేపథ్యంలో తాజాగా నిర్మాతలు ధీరజ్‌, విద్య కొప్పినీడి మీడియాతో ముచ్చటించారు. విశేషాలు..

లాక్ డౌన్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత థియేటర్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఆ టైమ్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్ గా కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది.

మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్ నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది.

"ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం. దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్ కు ఉపయోగపడుతుందని అనుకోలేదు, ఆ క్యారెక్టర్ కు ఆయన కరెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నాం. అయితే రశ్మిక, దీక్షిత్ ఉండటం వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతుంది.

తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలూ ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైమ్ సరిపోక కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేయడం లేదు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను ఈ నెల 7న హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మరో వారం తర్వాత ఈ నెల 14న తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తాం. ముంబైలో ఒక ఈవెంట్ చేయాలనే ప్లాన్ ఉంది.

అనూ ఇమ్మాన్యుయేల్ మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు ఆమె పర్పెక్ట్ గా కుదిరింది. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం. కానీ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం.

కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. థియేట్రికల్ గా ఇది బాగుంటుంది అనే స్టోరీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. గీతా ఆర్ట్స్, అరవింద్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం.

 ‘ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు’ అని నిర్మాత విద్య కొప్పినీడి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement