ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్, ధనంజయ, ప్రియాంకా మోహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ప్రియాంకా మోహన్ పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, ప్రత్యేకమైన కథా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు.


