breaking news
666 Operation Dream Theatre Movie
-
డ్రీమ్ థియేటర్లో...
ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్, ధనంజయ, ప్రియాంకా మోహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ప్రియాంకా మోహన్ పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, ప్రత్యేకమైన కథా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
‘జాలిరెడ్డి’ కొత్త సినిమా.. లుక్ అదిరిందిగా..
సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్ రావు, తాజాగా "666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్" అనే టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ హీరోగా నటిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2 చిత్రాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ లో నటించారు.విజే ఫిలిమ్స్ బ్యానర్ పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ 2, పెద్ది చిత్రాల్లో నటిస్తోన్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ''666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'' చిత్రం కన్నడ తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది.


