1897 నుంచి 1920 మధ్య సాగిన బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా రూపొందుతోంది. బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రను మంచు మనోజ్ పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.
హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ‘‘మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్, పర్‌ఫార్మెన్స్‌తో డేవిడ్ రెడ్డి పాత్రలో ఒదిగిపోతున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: ఆచార్య వేణు.


