
సాధారణంగా డ్యాన్స్ అనగానే గంతులు వేయడం లాంటి స్టెప్స్ చాలా వరకు ఉంటాయి. కానీ రష్మిక మాత్రం కాస్త డిఫరెంట్ సాంగ్‌లో కనిపించింది. డ్యాన్స్ కూడా అందుకు తగ్గట్లే ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తొలి పాటని రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'నదివే' అంటూ సాగిన ఈ పాట.. ప్రేమ సాహిత్యం తరహాలో వెరైటీగా ఉంది.
(ఇదీ చదవండి: థియేటర్లలోకి రిలీజైన ఒక్కరోజుకే ఓటీటీలోకి హిట్ సినిమా)
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక లీడ్ రోల్ కాగా, 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటిస్తున్నాడు. యానిమల్, పుష్ప 2, ఛావా తదితర సినిమాలతో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. అల్లు అరవింద్ నిర్మించారు. తాజాగా రిలీజ్ చేసిన పాట చూడటానికి వినటానికి బాగానే ఉంది. మూవీని సెప్టెంబరు 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఆయన నా ఫ్యామిలీ మెంబర్ లాంటోడు.. అందుకే: ప్రభాస్)