
హీరోలు-నిర్మాతలకు మంచి బాండింగే ఉంటుంది. కానీ వరసగా మూడు సినిమాలు చేయడం లాంటివి మాత్రం కాస్త అరుదు అని చెప్పొచ్చు. ప్రభాస్‌తో 'సలార్' తీసిన హోంబల్ సంస్థ మాత్రం మరో మూడు చిత్రాలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ దీని గురించి మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్'పై కొత్త రూమర్స్.. మరోసారి తప్పదా?)
'విజయ్ కిరగందూర్ వల్లే హోంబలే సంస్థ ఈ స్థాయికి చేరుకుంది. తనతో కలిసి పనిచేసే వాళ్లని ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. అందరితో కలివిడిగా ఉంటారు. 'సలార్'తో మా జర్నీ మొదలైంది. మేమంతా ఓ కుటుంబంలా కలిసిపోయాం. ఆయన నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. నాలానే విజయ్ కూడా బయట ఎవరితో కలవడు'
'కేజీఎఫ్ షూటింగ్ టైంలో జరిగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. భారీ సెట్ వేయగా అది అనుకోకుండా కాలిపోయింది. టీమ్ అంతా కంగారుపడుతుంటే ఈయన మాత్రం.. 'కంగారుపడొద్దు. డబ్బు గురించి ఆలోచించొద్దు. అనుకున్నట్లు సినిమాని పూర్తి చేయండి' అని ధైర్యం చెప్పారు. సినిమా మేకింగ్‌కి వచ్చేసరికి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడరు. అదే నాకెంతో నచ్చింది. అందుకే వరస సినిమాలు చేస్తున్నాను' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్‌తో 'నిన్నందలే' అనే సినిమాతో హోంబలే సంస్థ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్, కాంతార, సలార్.. ఇలా భారీ బ్లాక్‌బస్టర్స్‌తో ప్రస్తుతం దేశంలోనే అగ్రసంస్థగా మారిపోయింది. వచ్చే ఏడాది ప్రభాస్‌తో 'సలార్ 2' చేయనున్నారు. మిగిలిన రెండు ప్రాజెక్టులు ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
(ఇదీ చదవండి: థియేటర్లలోకి రిలీజైన ఒక్కరోజుకే ఓటీటీలోకి హిట్ సినిమా)